తెలుగు - కర్మణి ప్రయోగాలు

718 views
Skip to first unread message

వీవెన్

unread,
Mar 19, 2015, 5:47:29 AM3/19/15
to తెలుగుపదం
వేరే తీగలో జరిగిన చర్చను ఇక్కడికి మళ్ళిస్తున్నాను. ఈ విషయంపై చర్చను ఇక్కడ కొనసాగించండి.

పార్వతీశ్వర శర్మ:
బడు ప్రత్యయ ప్రయోగం వ్యావహారికంలో అంతగా ఆమోదయోగ్యంగాలేదు. అందుకని, జతచేసినది, జతయినది - కలిపినది, అతికినది, అంటినది, చేర్చినది అంటే ??

మఱ్ఱిపూడి మహోజస్:
వ్యావహారికంలో "బడు" ప్రయోగాలు తక్కువనేది నిజమే. కానీ క్రమక్రమంగా వాడుకలోకి వస్తున్నాయని నాకు అనిపిస్తోంది. ఉదాహరణకి "ఆ స్విచ్చి నొక్కబడదు (నొక్కడం కష్టం) అని ఒకరు అనగా విన్నాను. అయినా వ్రాసే భాషలో వ్యావహారికానికి పూర్తిగా కట్టుబడాల్సిన అవసరం లేదు. వ్రాసే భాషా, వాడుకభాషా ఎప్పుడూ కాస్త తేడాగానే ఉంటాయి.

వేణు:
తెలుగులో కర్మణి (బడు) వాక్యాలు  కృత్రిమంగా ఉంటాయి. ఎందుకంటే అవి వ్యావహారిక భాషలో ఎక్కడా  ఉండవు కాబట్టి.  రాసే భాషలో  బడులు ఉన్న  వాక్యాల కంటే  అవి  లేని వాక్యాలే  సాఫీగా   ఉంటాయి.   చదవటానికి  సులువుగా ఉంటాయి;  స్పష్టంగా అర్థమవుతాయి. 

ఎవరైనా బడులు ఉపయోగించి   మాట్లాడారంటే ఆ సందర్భంలో వారి భాష అసహజంగానే ఉన్నట్టు.  (లైటర్ వీన్ లో హాస్యం కోసం - సరదాగా  ‘బడు’  ఉపయోగించి మాట్లాడటం వేరు).

మఱ్ఱిపూడి మహోజస్:
తెలుగులో verb పక్కన చేర్చే "బడు" ప్రయోగాలు అసహజం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. తరతరాల నుంచి ఉన్నాయి. కొన్ని వాడుకల్లో అవి సర్వైవ్ అయ్యాయి. ఉదాహరణకి-

వినబడు
కనబడు
అలవడు (అలియన్ + పడు)
పొఱబడు (పొఱియన్ + పడు)
బోరగిలబడు
చేరగిలబడు

అన్నివేళలా "బడు" ప్రయోగాల్ని తప్పించుకుందామంటే అది సాధ్యం కాకపోవచ్చునేమో. ఆంగ్లంలో straight verbs గా ఉన్నవి కొన్ని తెలుగులో "బడు" చేరిస్తే గాని అర్థం కాకపోవచ్చు. అలాగే తెలుగులో straight verbs గా ఉన్న కొన్నిటిని, ఇంగ్లీషులో passive voice లో అనువదిస్తేనే గాని బోధపడకపోవచ్చు. అవేంటో ఉన్న పళాన ఇప్పుడే  జ్ఞాపకం రావడం లేదు. జ్ఞాపకమొచ్చినప్పుడు ఉదాహరణలిస్తానని మనవి.

వేణు:
కర్మణి వాక్యాలంటే  సులువుగా  అర్థం కావటం కోసం  ‘బడు’ వాక్యాలు అని  వ్యవహరిస్తుంటారు.  అంతమాత్రాన  బడు అని  చేరిన  ప్రతి  క్రియా పదమూ కర్మణి  కానే కాదు.

వినబడు, కనబడు  మొదలైన క్రియలను   మీరు కర్మణి  ప్రయోగాాలుగా    పొరబడుతున్నారు.   వినపడు-  వినబడుగా, కనపడు-  కనబడుగా  రూపాంతరం చెందాయి.


మఱ్ఱిపూడి మహోజస్:
నేను పొరపడడం లేదండీ. బాగ తెలిసే, అర్థం చేసుకునే చెబుతున్నాను. కనబడు, వినబడు. నిలబడు అనేవి కర్మణిప్రయోగాలని వింటూనే స్పష్టంగా అర్థమయిపోతున్నాయి కదా.

కను - చూచు
అది కనబడింది = అది నాచే చూడబడినది.

విను = విను
అది వినబడింది = అది నాచే వినబడినది.

ఇక్కడ అర్థమవుతోంది కదా? అలాగే మిగతావి కూడా! ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. తిరగబడు, మర్లబడు - ఇవన్నీ కూడా కర్మార్థకాలే. ఇవన్నీ - తెలుగులో కర్మార్థక ప్రయోగాలు అతిప్రాచీనమనీ, సహజమనీ నిరూపిస్తున్నాయి. తెలుగులోనే కాదు, ద్రావిడభాషలన్నిట్లోనూ కర్మార్థక ప్రయోగాలున్నాయి. తెలుగు క్రియాధాతువుకు కర్మార్థకంలో "పడు" చేర్చడం అసహజమైతే మరి మిగతా అన్నిద్రావిడభాషల్లోనూ ఇదే "పడు" ధాతువుని కర్మార్థకంలో ఎందుకు చేరుస్తున్నారు? అంటే తెలుగు మిగతా ద్రావిడభాషల నుంచి విడిపోవడానికి ముందే "పడు" ప్రయోగం ఉండేదని విశదమవుతోంది కదా! ఇది ఎంత ప్రాచీనమో దీన్ని బట్టి అర్థమవుతోంది కదా!

వేణు:
నిలబడు’  అనే మాట కూడా ఉంది కదా?

మీ  అన్వయం ప్రకారం-   దీనికి కూడా  కర్మణి వాక్యం చూపండి! 

కర్మణి వాక్య ప్రయోగం  తెలుగులో ఉందో లేదో తర్వాత చర్చించవచ్చు.

వీవెన్:
ఆ దిశలోనే నేను ప్రయత్నిస్తున్నాను. :-)

నిలు = ఆగు/ఆపు
బండి నిలబడింది = బండి ఆపబడింది. అన్నట్టు 'నిలఁబడు'ని నిలువఁబడుకి రూపాంతరంగా పేర్కొన్నారు.

కాలక్రమంలో చాలా మార్పులు చోటుచేసుకుని ఉండొచ్చు. మనం ఇది ఇలా జరిగింది అని తేల్చేయలేమేమో.

నామవాచకాలుగా కూడా బడులు వాడుకలో ఉన్నట్టున్నాయి.
  • ఏలుబడి
  • కట్టుబడి
  • చెల్లుబడి (చెల్లుబాటు)
  • పలుకుబడి
  • పెట్టుబడి
  • రాబడి

ఇక కర్మణి ప్రయోగాలు వాడకూడదు అన్నది పత్రికల కంటే ముందు కాలం నుండీ ఉందా? అలాంటి అభ్యంతరం 'వాడు చంపబడ్డాడు' వంటి వాడుకలకేనా? పాత పుస్తకాల్లో 'బడెను' వాడుకలు కనబడేవి.

ఇట్లు,
వీవెన్.


Venu Ch

unread,
Mar 19, 2015, 5:59:18 AM3/19/15
to telug...@googlegroups.com
మహోజస్:
మీరు రాసిన వాక్యాలు-
 
‘కను - చూచు

అది కనబడింది = అది నాచే చూడబడినది.

విను = విను
అది వినబడింది = అది నాచే వినబడినది.’

కన్నుకూ, చెవికీ సంబంధించిన స్థితి/ సామర్థ్యాన్ని గురించి తెలిపే క్రియలివి.  మరో రకంగా చెప్పాలంటే..  కంట పడింది, చెవుల పడింది అనే అర్థాలను ఇస్తాయి.

‘నిలబడు’ అనే పదాన్ని కర్మణి వాక్యంగా  రాయటం కుదరకపోవటానికి అది అకర్మక క్రియ కావటమే కారణం.  కర్మణి వాక్యాలు సకర్మక క్రియలతో మాత్రమే తయారవుతాయి. అకర్మక క్రియలతో కాదు.

ఇలాంటి అకర్మక క్రియలు కొన్ని-
పొరబడు
తగలబడు
భయపడు
సంతోషపడు
కలవరపడు
తిరగబడు
 
వీటితో కర్మణి వాక్యాలు రాయటం సాధ్యం కాదు.
 
క్లుప్తంగా చెప్పాలంటే...

చంపడం సకర్మక క్రియ.  దానితో కర్మణి వాక్యం తయారవుతుంది. 
ఉదా:   ‘వాడు చంపబడ్డాడు’. (సూత్రరీత్యా సరైనది, కానీ తెలుగులో అసహజం, కానీ అర్థవంతం).

చావడం అకర్మక క్రియ. దీనితో కర్మణి వాక్యం తయారు కాదు. 
ఉదా:   ‘వాడు చావబడ్డాడు’ (సూత్రరీత్యా కూడా తప్పు వాక్యం.  తెలుగులో అసహజం,  అర్థ రహితం). 

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Marripoodi Mahojas

unread,
Mar 19, 2015, 6:10:35 AM3/19/15
to telug...@googlegroups.com
నేను చెప్పాల్సింది చెప్పేశానండీ. అయిపోయింది. ఇక్కడ నేను కొనసాగించడానికి ఏమీ లేదు. నేను పండితుణ్ణి కాను. అయితే ఒక మాట చెప్పి ముగిస్తాను.

కర్మణి ప్రయోగాలు తెలుగుకు అసహజమనేది అనునిత్య వాడుకను మాత్రమే పరమప్రమాణంగా తీసుకున్న కొందరు ఏర్పరచుకున్న అభిప్రాయం. వారు భావిస్తున్నట్లు కర్మణి ప్రయోగం అసహజమైతే దానికి తెలుగులో అసలు వనరులే లేకుండా పోవాల్సింది. కానీ అలా లేదు. తుమున్నంతాలకి "పడు" ధాతువుని చేర్చడం ద్వారా కర్మణి ప్రయోగాలకి తెలుగు వ్యాకరణం అవకాశం కల్పిస్తోంది. ఇదే అవకాశాన్ని ఇదే ధాతువుతో మిగతా ద్రావిడభాషలు కూడా కల్పిస్తున్నాయి. అంటే తెలుగులో కర్మణి ప్రయోగం అనాదిగా ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా పరాయిభాషల నుంచి విడిపదాలు (individual words) వచ్చిచేరతాయి. కానీ వ్యాకరణాంశాలూ, వాక్యనిర్మాణాలూ దిగుమతి కావు. కర్మణిప్రయోగం అలాంటి ఒక వ్యాకరణాంశం. ఒక వాక్యనిర్మాణ పద్ధతి. అది ఎక్కణ్ణుంచో దిగుమతయ్యే అవకాశం శూన్యం. అలా దిగుమతైన పక్షంలో- ఏ భాషనుంచి అది దిగుమతైందో మనం తెలుసుకోవాల్సి ఉంది. సాధారణంగా అలా దిగుమతైనప్పుడు ఆ మూలభాషలో కర్మణికి వాడే పదాలు కూడా దిగుమతైపోతాయి. అంతే తప్ప అందుకోసం "పడు" లాంటి ఒక స్థానిక పదం యొక్క సహాయాన్ని తీసుకోవడం జరగదు. 

గతంలో కీ.శే. చేకూరి రామారావుగారు తెలుగుభాషలో శ, ష, హ లాంటి అక్షరాల గురించి రాస్తూ "శ్రామిక వర్గాల ఉచ్చారణలో లేవు గనక భాషలో ఇవి అనవసరం" అన్నట్లు ఒక వాదం చేశారు. ఇది కూడా కేవలం వాడుకని పరమప్రమాణంగా తీసుకోవడం వల్లనేనని మనకి అర్థమవుతోంది. అయితే ఒక academic శాస్త్రచర్చ చేసేటప్పుడు వాడుక ప్రమాణంగా పనికిరాదు.

Marripoodi Mahojas

unread,
Mar 19, 2015, 6:22:23 AM3/19/15
to telug...@googlegroups.com
వేణుగారూ! పొరబడు, అలవడు, తడబడు అనే క్రియలు కర్మణి కాకపోతే

పొరబడు లో పొర కి అర్థమేంటి?
అలవడు లో అల కి అర్థమేంటి?
తడబడు లో తడ కి అర్థమేంటి?

దయచేసి ఖచ్చితంగా చెప్పి నా వాదాన్ని ఖండించవలసిందిగా కోరుతున్నాను.

కను అనే ధాతువుకి కన్ను అని అర్థం చెబుతున్నారు మీరు. అంటే స్పష్టంగా Verb అని కనపడుతున్న ఒక పదాన్ని మీరు Noun గా మార్చి భాష్యం చెబుతున్నారు. OK. మాటవరసకి మీ వాదాన్ని అంగీకరిద్దాం.. కానీ విను కి చెవి అనే అర్థం ఎక్కడుంది?

నిలచు లాంటి అకర్మక క్రియల తుమున్నంతాల పక్కన "పడు" ఎందుకొచ్చి చేరింది? ఏ అర్థంలో? అవసరమేంటి? నేరుగా "నిలిచాడు" అని వాడొచ్చుగా?

తగలబడు అనే ఉదాహరణ ఇచ్చి మహోపకారం చేశారు. నేను దీని సంగతి మర్చిపోయాను. ఇది స్పష్టంగా కర్మణి ప్రయోగమని తెలిసిపోతోంది కదా. తగలడం అంటే తాకడం (తెలంగాణలో తగలడానికి తాకడం అంటారు). అగ్నిచేత తాకబడినదే తగలబడింది.


Venu Ch

unread,
Mar 19, 2015, 6:44:42 AM3/19/15
to telug...@googlegroups.com
మహోజస్ గారూ..
అకర్మక  క్రియలూ, సకర్మక క్రియలూ  నేను కొత్తగా పుట్టించినవి కాదు.  

నిలబడు,  పొరబడు ,  తగలబడు,  భయపడు,  సంతోషపడు,  కలవరపడు, తిరగబడు,   పొరబడు,  తడబడు... వీటిని అకర్మక క్రియలు కాదు అంటారా మీరు?

అయితే  వాటిని  నిరూపిస్తూ   ఆ పదాలతో   అర్థవంతమైన కర్మణి వాక్యాలను రాసి చూపండి.  
 
‘ కంట పడింది, చెవుల పడింది అనే అర్థాలను ఇస్తాయి’ అని నేను వివరించటం  విషయం  తేలిగ్గా  అర్థం చేయటం కోసం.  అంతే గానీ  అది  భాష్యం చెప్పటమూ కాదు,  అవి కచ్చితమైన  పర్యాయ పదాలని  చెపుతున్నట్టూ  కాదు.  

ఆ సందర్భం మరోసారి చూడండి.  నా భావం అర్థమవుతుంది.

‘తగలబడు ’  అనేది కర్మణి ప్రయోగమా?  కానే కాదు.  అది అకర్మక క్రియ.  దానితో కర్మణి వాక్యాలను తయారు చేయటం కుదరదు. 
తగలబెట్టడం  -  సకర్మక  క్రియ
తగలబడటం -   అకర్మక  క్రియ


Marripoodi Mahojas

unread,
Mar 19, 2015, 6:51:36 AM3/19/15
to telug...@googlegroups.com
వేణుగారూ ! పడు ధాతువు చేరికతో Already కర్మణిగా మార్చబడ్డవి మళ్లీ కర్మణి ఎలా అవుతాయి? ఈనాటి భాష యొక్క వాడుకలో కనిపిస్తున్న దాన్నిబట్టి, ముఖ్యంగా ఈనాటి అర్థాల్ని బట్టి  ఆనాటి తెలుగుస్వరూపాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఇహపోతే నా ప్రశ్నల్లో ఒక్కదానిక్కూడా మీరు సమాధానం చెప్పలేదు. ముఖ్యంగా అకర్మక ధాతువుల్ని యథాతథంగా ప్రయోగించకుండా పూర్వీకులు "పడు" ఎందుకు చేర్చారు? చెప్పండి! ఏమీ చెప్పకుండా తెలుగులో కర్మణి లేనే లేదని వాదిస్తే సారీ! సర్! You are entitled to your opinions. నేనెవరికీ అడ్డురాను. అయితే నేనీ చర్చలో కొనసాగను.

Venu Ch

unread,
Mar 19, 2015, 6:58:11 AM3/19/15
to telug...@googlegroups.com
తెలుగులో కర్మణి ప్రయోగాలు లేవని నేనటం లేదు. 

కానీ  అవి అసహజం అని  గిడుగు రామ్మూర్తి గారి  కాలం నుంచీ అంటున్నదే నేనూ చెప్పాను.

అకర్మక క్రియలతో బడు వాక్యాలు రాయటం తప్పు అని సాక్షాత్తూ   చేకూరి రామారావు అంటారు.  ఆయన బడు వాక్యాలకు పెద్ద సమర్థకులు. కానీ ఆయన వాదాన్ని కూడా మీరు అంగీకరించటం  లేదు!

ఇక చర్చలో సాగటం సాగకపోవటం మీ ఆసక్తి, ఇష్టం మీద ఆధారపడుతుంది కదా...

2015-03-19 16:21 GMT+05:30 Marripoodi Mahojas <mahojasm...@gmail.com>:
వేణుగారూ ! పడు ధాతువు చేరికతో Already కర్మణిగా మార్చబడ్డవి మళ్లీ కర్మణి ఎలా అవుతాయి? ఈనాటి భాష యొక్క వాడుకలో కనిపిస్తున్న దాన్నిబట్టి, ముఖ్యంగా ఈనాటి అర్థాల్ని బట్టి  ఆనాటి తెలుగుస్వరూపాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఇహపోతే నా ప్రశ్నల్లో ఒక్కదానిక్కూడా మీరు సమాధానం చెప్పలేదు. ముఖ్యంగా అకర్మక ధాతువుల్ని యథాతథంగా ప్రయోగించకుండా పూర్వీకులు "పడు" ఎందుకు చేర్చారు? చెప్పండి! ఏమీ చెప్పకుండా తెలుగులో కర్మణి లేనే లేదని వాదిస్తే సారీ! సర్! You are entitled to your opinions. నేనెవరికీ అడ్డురాను. అయితే నేనీ చర్చలో కొనసాగను.

--

Marripoodi Mahojas

unread,
Mar 19, 2015, 7:04:46 AM3/19/15
to telug...@googlegroups.com
సర్! గిడుగు రామమూర్తిగారంటే నాకూ గౌరవం ఉంది. అయితే గౌరవమున్నంత మాత్రాన ఎవరినీ గుడ్డిగా అనుసరించను. నేను వ్యావహారికంలోనే రాస్తాను. అయితే అంతమాత్రాన నేను వీర వ్యావహారికవాదిని కాను. ఈరోజున, ఈ 21 వ శతాబ్దంలో మన భాషలో కర్మణి ప్రయోగాలు ఒక వాస్తవం. Impersonal expression కోసం అవి ఆధునిక సంభాషణ శైలిలో ఒక తప్పనిసరి అవసరం కూడా! ప్రతీదానికీ persons ని కర్తగా పెట్టి కర్తరి (active voice) వాక్యాల్లో మాట్లాడితే ఆ Direct style కి జనం hurt అవుతారు. ఇతరుల్ని అలా hurt చేయకుండా కర్మణిప్రయోగం మనల్ని రక్షిస్తుంది.

Reply all
Reply to author
Forward
0 new messages