Prediabetic = ప్రాగ్ మధుమేహి

6 views
Skip to first unread message

Marripoodi Mahojas

unread,
Mar 12, 2015, 1:55:38 AM3/12/15
to telug...@googlegroups.com
ఈ మధ్య ఈనాడు దినపత్రికలోఒకచోట ముందస్తు మధుమేహ స్థితి గలవారు అని వాడారు. వారు ఏం చెప్పదల్చుకున్నారో మొదట అసలేమీ అర్థం కాలేదు. కాసేపు ఆలోచించాక అది Prediabetic కి వచ్చిన తిప్పలని అర్థమైంది. కానీ ముందస్తు మధుమేహం అంటే Juvenile diabetes (బాల్యంలోనే వచ్చే మధుమేహం) అని అర్థం చేసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. Prediabetes ని వికిపీడియా ఇలా నిర్వచిస్తోంది :

Prediabetes is the medical stage in which not all of the symptoms required to label a person as diabetic are present, but blood sugar is abnormally high.[1] This stage is often referred to as the "gray area."

అంటే ఇంకా మధుమేహ లక్షణాలు ఇప్పుడే పూర్తిగా లేకపోయినా రక్తంలోని చక్కెర స్థాయిలు మాత్రం ఆరోగ్యవంతులకు ఉండాల్సినదాని కన్నా చాలా ఎక్కువగా కనిపిస్తూంటే అది మధుమేహానికి పూర్వస్థితి అంటారట.

దీన్ని మనం "మధుమేహ పూర్వస్థితి" లేదా "పూర్వమధుమేహం" అనొచ్చు ననుకుంటా. ఇలా అంటే చాలా బారుగా ఉంది. దీనికన్నా మూలాంగ్లపదమే క్లుప్తంగా ఉంది.

లేకపోతే "పదనిష్పాదన కళ" లో 89 వ పేజీ, 2 లైన్ ని అనుసరించి

ప్రాగ్ మధుమేహం = Prediabetes
ప్రాగ్ మధుమేహి = Prediabetic

అనాలి. అప్పుడు క్లుప్తంగానూ ఉంటుంది.
Reply all
Reply to author
Forward
0 new messages