Perigee and Apogee - ఉపజ్య, పరాజ్య

50 views
Skip to first unread message

Marripoodi Mahojas

unread,
Apr 3, 2015, 10:17:51 AM4/3/15
to telug...@googlegroups.com
శ్రీహరికోటలో పి.ఎస్.ఎల్.వి. ప్రయోగం ద్వారా ఇటీవల వార్తల్లోకెక్కిన రెండు పదాలు పెరిజీ, అపోజీ. వీటిని వికిపీడియా ఇలా వివరిస్తోంది :

For any satellite of Earth including the Moon the point of least distance is the perigee (/ˈpɛrɨ/) and greatest distance the apogee.

అంటే- చంద్రుడితో సహా భూమి చుట్టూ పరిభ్రమించే ఏ ఉపగ్రహపు కక్ష్యకైనా భూమి నుంచి కనిష్ఠ దూరంలో ఉన్న బిందువు పెరిజీ. గరిష్ఠ దూరంలో ఉన్న బిందువు అపోజీ.

(మరింత స్పష్టత కోసం నేను ఆంగ్లమూలాన్ని కొంచెం విస్తరించి అనువదించాను)

నేను ఈ పదాలకి రెండు తెలుగు సమానార్థకాల్ని సిద్ధం చేశాను.
౧. Perigee = ఉపజ్య (లేక ఉపజ్యాబిందువు)
౨. Apogee = పరాజ్య (లేక పరాజ్యాబిందువు)

వృత్తపరిధిలో ఒక భాగాన్ని తెలుగులో జ్యా అంటారు. (స్పష్టత కోసం ఈ వేగుతో పాటు జతచేసిన PNG బొమ్మని పరిశీలించండి). ఈ పదాల్ని ఇలా కల్పించడంలో నా ఉద్దేశం ఏంటంటే- ఉపజ్య అంటే దగ్గరగా ఉన్న జ్యా. పరాజ్య అంటే గా ఉన్న జ్యా.

పదనిష్పాదన కళలో 7 వ అధ్యాయం, 87 - 88  పుటల్లో ఉపసర్గలకిచ్చిన అర్థాల్ని బట్టి వీటిని ఇలా నిష్పాదించడం జరిగింది. వీటికి ఆల్రెడీ తెలుగులో పదాలుంటే నా పదాల్ని పట్టించుకోనక్కరలేదని గమనిక.


Jyaa.png

Marripoodi Mahojas

unread,
Apr 3, 2015, 10:22:23 AM4/3/15
to telug...@googlegroups.com
పైన పరాజ్యకి ఇచ్చిన అర్థాన్ని-

"పరాజ్య అంటే దూరంగా, అవతలగా,  Remote గా ఉన్న జ్యా."
అని సవరించుకొని చదవాల్సిందిగా ప్రార్థన. 

Kiran Kumar Chava

unread,
Apr 3, 2015, 10:30:10 AM4/3/15
to telug...@googlegroups.com
They smell more academic. Can we try for more non academic versions?

From: Marripoodi Mahojas
Sent: ‎03-‎04-‎2015 19:47
To: telug...@googlegroups.com
Subject: (తెలుగుపదం) Perigee and Apogee - ఉపజ్య, పరాజ్య

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Marripoodi Mahojas

unread,
Apr 3, 2015, 10:32:44 AM4/3/15
to telug...@googlegroups.com
అక్షరాలు ఎన్నున్నా పర్లేదంటే-

ఉపజ్యని "సమీప చాపబిందువు"
పరాజ్యని "సుదూర చాప బిందువు"
అని కూడా అనుకోవచ్చు.

కానీ వినేవాళ్ళకి ఇవి ఇవి వర్ణనాత్మక అనువాదాల (Descriptive renditions) లా అనిపిస్తాయే తప్ప పెరిజీ, అపోజీల మాదిరి పేర్లలా అనిపించవు. వర్ణనాత్మక అనువాదాలు అపహాస్యం చేయబడుతున్నాయి. 

Marripoodi Mahojas

unread,
Apr 3, 2015, 10:37:09 AM4/3/15
to telug...@googlegroups.com
Dear Sir! Thank you for your kind response.

ఇంగ్లీషులోని పెరిజీ, అపోజీ కూడా అకాడెమిక్కే. అవి సామాన్య ఇంగ్లీషు జనాల వాడుకలో ఉన్న పదాలు కావు. వాళ్ళ నిత్యజీవితానికి ఉపయోగపడేవీ కావు. వాస్తవమేంటంటే ఇక్కడి సభ్యుల అవగాహన కోసం నేనిచ్చిన వివరణ మాత్రమే అకాడెమిగ్గా ఉంది. పదాలు అకాడెమిగ్గా లేవు. వాడడం మొదలుపెడితే అవీ అన్ని పదాల్లాంటివే అనిపిస్తుంది. As a specialised group, I ecxpect more than a layman's range from our members.

Marripoodi Mahojas

unread,
Apr 3, 2015, 10:41:45 AM4/3/15
to telug...@googlegroups.com
నా మనసులో మాట నేను సరిగా చెప్పగలుగుతున్నానో లేదో తెలీదు. చెప్పలేకపోతే మన్నించండి.

ఒక సాఫ్టువేరు వాడే మామూలు వాడుకరికి అందులో ఏం కోడ్ వాడారో, ఏ ప్లాట్ ఫామ్ మీద రాశారో ఏమీ తెలీదు. అతను వాడుకుంటాడంతే. అదంతా వివరించబోతే అతని కళ్ళకీ అది అకాడెమిగ్గా అనిపిస్తుంది. అలాగే పదాల నిర్మాణం వెనక ఉన్న తర్కం సామాన్యమానవుడికి అవసరం లేదు. మనం అందిస్తే అతను వాటిని వాడుకుంటాడు. కానీ ఆ తర్కం ఈ గుంపు సభ్యులుగా మనక్కావాలి. మనకు మాత్రమే కావాలి.

వీవెన్

unread,
Apr 3, 2015, 11:09:24 AM4/3/15
to తెలుగుపదం
బానేవున్నాయి.

ముందుగా ఆ ఆంగ్ల పదాల వ్యుత్వత్తి చూస్తే. విక్షనరీ. పెరిజీ, ఆపొజీల్లో జీ  అంటే భూమి. పెరి అంటే దగ్గర. ఆపొ అంటే దూరంగా. మామూలుగా మాట్లాడుకోవాలంటే, భూమికి దగ్గరగా ఉన్న బిందువు, దూరంగా ఉన్న బిందువు అనేసుకోవచ్చు. జ్యా అన్నది బిందువును సూచిండం లేదు కదా.

ఇంతకుముందు వీటిని ఎవరైనా తెలుగు చేసారా? ఆంధ్రభారతిలో వెతుకుదాం.

perigee = పరిజ్యము
apogee = అపజ్యము, భూమ్యుచ్చము, తుంగము, మందోచ్చము

ఆసక్తి కలిగించే విషయమేమంటే వీటిలోనూ జ్య వచ్చింది.

ఇవి వాడినట్టు ఏమైనా దాఖలాలు ఉన్నాయేమో అని గూగుల్లో వెతికితే ఏమీ దొరకలేదు.

మరేమైనా మంచి కాయింపులు వస్తాయేమో చూద్దాం.

ఇట్లు,
వీవెన్.








3 ఏప్రిల్, 2015 8:02 [PM] న, Marripoodi Mahojas <mahojasm...@gmail.com> ఇలా రాసారు :

--

Lanka Giridhar

unread,
Apr 3, 2015, 5:13:42 PM4/3/15
to telug...@googlegroups.com

మహోజస్ గారు, మీరు సూచించిన పదాలు బాగుగా ఉన్నవి.

Vasu Valluri

unread,
Apr 3, 2015, 8:13:20 PM4/3/15
to telug...@googlegroups.com

మహోజాస్ గారు,
మీరు సూచించిన పదాలు బాగున్నాయి కానీ వాటికి ఇదివరకే నిఘంటువులలో అర్ధాలు సూచించారు. వాటిని జ్యోతిష్య శాస్త్రంలో వాడుతున్నారు.
వాసు

On Apr 4, 2015 2:43 AM, "Lanka Giridhar" <giridha...@gmail.com> wrote:

మహోజస్ గారు, మీరు సూచించిన పదాలు బాగుగా ఉన్నవి.

--

Marripoodi Mahojas

unread,
Apr 3, 2015, 10:53:52 PM4/3/15
to telug...@googlegroups.com
మన పదాల్లో బిందువుని గురించిన ప్రస్తావన లేదు. ఒప్పుకుంటాను. కానీ ఆంగ్లపదాల్లో కూడా ఆ ప్రస్తావన లేదు కదా. పెరి- , అపో- అనేవి గ్రీకు ఉపసర్గలే గానీ బిందువుల్ని సూచించవు. "జీ" అంటే భూమి. చిత్రమేంటంటే తెలుగు "జ్యా" కి కూడా భూమి అనే అర్థం ఉంది. ఆ రకంగా చూసినప్పుడు-

ఉప + జ్యా = భూమికి దగ్గరగా ఉన్నది.
పరా + జ్యా = భూమికి అవతలగా ఉన్నది.

బిందువు అనేది ఈ పదాల్లో ఇంప్లైడ్ మాత్రమే. అంటే "అవి బిందువుల పేర్లు" అని పైకి చెప్పకపోయినా అర్థం చేసుకోవాలి. అయితే ఇంకా స్పష్టత కావాలనుకునేవారి కోసం ఉపజ్యాబిందువు, పరాజ్యాబిందువు అని ప్రత్యామ్నాయాలు కూడా సూచించాను. నా కొత్త పదాలతో పాటు పాత పదాలు కూడా బానే ఉన్నాయి. ఆల్రెడీ ఉంటే ఇవి అవసరం లేదని నేనన్నది ఇందుకే. పాత పదాలలో కూడా జ్యా అనే పదమే ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

Samba Siva Rao Kolusu

unread,
Oct 19, 2015, 11:49:22 AM10/19/15
to తెలుగుపదం
ఈ విషయమై సూర్య సిద్ధాంతమేమి చెబుతుందో పరిశీలించ మనవి.
Reply all
Reply to author
Forward
0 new messages