తెలుగు లో Space

31 views
Skip to first unread message

Sunny D

unread,
Nov 28, 2014, 9:10:26 PM11/28/14
to telug...@googlegroups.com, telug...@googlegroups.com
మిత్రులారా,

మనం ఆంగ్లం టైపు చేసేటప్పుడు space వాడతాము కదా, దానికి తెలుగు keyboard లో కానీ  / లేదా భారతీయ భాషా keyboards లోకాని ఏదైనా పదం వున్నదా ?? అలాగే 
comma(,) , 
colon (:), 
slash (/), 
single quote ('), 
double quotes (") మొదలైనవి 

కృతజ్ఞలతో,
సునీల్ 

వీవెన్

unread,
Nov 30, 2014, 10:14:00 PM11/30/14
to తెలుగుపదం, suneel.du...@gmail.com, తెలుగు బ్లాగు గుంపు
29 నవంబర్, 2014 12:22 [AM] న, Sunny D <suneel.du...@gmail.com> ఇలా రాసారు :

మిత్రులారా,

మనం ఆంగ్లం టైపు చేసేటప్పుడు space వాడతాము కదా, దానికి తెలుగు keyboard లో కానీ  / లేదా భారతీయ భాషా keyboards లోకాని ఏదైనా పదం వున్నదా ??

తెలుగులో ఖాళీ అంటాము. ఉదా॥ పదాల మధ్య ఖాళీ వదలాలి.

తతిమావి నాకూ తెలియదు. కానీ ఆంధ్రభారతి నిఘంటు శోధనలో వెతికి చూసాను.

అలాగే 
comma(,) , 
అల్పవిరామము, బిందుకల్పము, వాక్యాంశబిందువు (ఆంధ్రభారతి నిఘంటు శోధన)
 
colon (:), 
న్యూనబిందువు, ద్విబిందువు (ఆంధ్రభారతి నిఘంటు శోధన)
 
slash (/), 
దొరకలేదు.
 
single quote ('), 
double quotes (") మొదలైనవి 
quotation markని ఉద్ధరణ చిహ్నం అన్నారు. దీనికే జంట అనే విశేషణాన్ని చేర్చి డబుల్ కి వాడుకోవచ్చు.

ఇట్లు,
వీవెన్.

బాలాజీ మారిశెట్టి

unread,
Dec 4, 2014, 1:41:27 AM12/4/14
to telug...@googlegroups.com, suneel.du...@gmail.com, telug...@googlegroups.com
పదాలు బాగా పెద్దవిగా అనిపిస్తున్నాయండి.
"అవి, బిక, వాబి..."‌ ఇలా మార్చేస్తే ఎలా ఉంటుంది?

Sunny D

unread,
Dec 4, 2014, 3:55:15 AM12/4/14
to బాలాజీ మారిశెట్టి, telug...@googlegroups.com, telug...@googlegroups.com
మిత్రులారా,

బాలాజీ గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తాను. అలాగని "తవిక" లని సృష్టించమని కాదు

1. అర్ధవంతము గా వుండాలి 
2. ఆధునిక అవసరాలకి (computer, ప్రచురణ, మొ..) వీలుగా వాడుకలో సులభంగా వుండాలి. 

సంగణన లో కీలకం గా ఉపయోగ పడే keyboard లో అక్షరమాలేతర అక్షరాలకి /, :, ;, ", ', ।, \, ?, [, ], {, }, =, (, ) తెలుగు లేదా సంస్కృతం లో పదాలు  కనుగొంటే ఉపయోగకరం. 

వీవెన్ గారు చెప్పిన పదాలను వాడుకలో సులభంగా వుండే విధంగా కుదించవచ్చా ??

- సునీల్ 

Marripoodi Mahojas

unread,
Dec 30, 2014, 7:28:32 AM12/30/14
to telug...@googlegroups.com, balajim...@gmail.com, telug...@googlegroups.com
ఎడం.

Marripoodi Mahojas

unread,
Dec 30, 2014, 7:34:21 AM12/30/14
to telug...@googlegroups.com, telug...@googlegroups.com
comma(,) , = విరామచిహ్నం, విరామం.
colon (:), = విసర్గాభం (విసర్గలాంటిది)
slash (/), = నిశ్రేణి (అసలు సాహిత్యార్థం "నిచ్చెన")
single quote ('), = ఏక ఉటంకింపు
double quotes (") = జమిలి ఉటంకింపు.

(క్రింది నాలుగూ - పదనిష్పాదన కళలోని సూత్రాల ననుసరించి నేను కనిపెట్టినవి)

కందర్ప కృష్ణ మోహన్

unread,
Jan 7, 2015, 12:17:01 AM1/7/15
to telug...@googlegroups.com, telug...@googlegroups.com
మిత్రులారా
అన్నింటికీ చిన్నపదాలే కావాలనడం, అనుకోవడం సరికాదు. భాష వ్యుత్పత్తిని బట్టి పదాలు తయారవుతాయి కానీ అన్నీ మన సౌకర్యం ప్రకారమే పుట్టవు. కాబట్టి నిజమైన భాషని బతికించుకోవాలి అంటే కొంచెం శ్రమ తీసుకుని అసలైన పదాలే వాడుకోవాలి. నిజానికి అది శ్రమ కాదు, సేవ. భాషని నిలబెట్టడానికి మనం చేయగలిగే సేవ అంతే. 

బెంగళూరు పక్కనున్న కునిగల్ అనే గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ శాఖకి నేను ఒకసారి వెళ్ళినపుడు అక్కడ "ఏక గవాక్ష కిటికీ" అని కన్నడలో వ్రాసి ఉండడం చూసి ఎంతగానో మురిసిపోయాను. మరుక్షణంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా అటువంటి పదం వాడకంలో లేకుండా కేవలం "Single Window Counter" అని మాత్రమే వాడుకలో ఉండడం గుర్తుకొచ్చి అంతగానూ బాధపడ్డాను. మనం వాడితేనే భాష బతుకుతుంది. అది ఒకటే మార్గం.

నెనరులు.

29 నవంబర్, 2014 12:22 [AM] న, Sunny D <suneel.du...@gmail.com> ఇలా రాసారు :
మిత్రులారా,

మనం ఆంగ్లం టైపు చేసేటప్పుడు space వాడతాము కదా, దానికి తెలుగు keyboard లో కానీ  / లేదా భారతీయ భాషా keyboards లోకాని ఏదైనా పదం వున్నదా ??

అంతరము, మధ్యస్థలము
అలాగే 
comma(,) , 
colon (:), 
slash (/),
భిన్నీకరణి 
single quote ('), 
double quotes (") మొదలైనవి 

కృతజ్ఞలతో,
సునీల్
మిగతా పదాలు వీవెన్ సూచించినవే వాడవచ్చును. 

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.



--
కృష్ణ మోహన్ కందర్ప
భాగ్యనగరము
http://telugutheepi.blogspot.com/
http://manikyaveena.blogspot.com/
http://idikathakadu.blogspot.com/

Reply all
Reply to author
Forward
0 new messages