తెలుగు వార్తాపత్రికల్లోని భాష - తీరుతెన్నులు " వ్యాసం

60 views
Skip to first unread message

Parvatheeswara Sarma Rambhatla

unread,
Mar 16, 2015, 2:16:12 PM3/16/15
to telug...@googlegroups.com
నమస్సులు. ఈ నెల సుజనరంజని - Silicon Andhra పత్రిక లో  తెలుగు వార్తాపత్రికల్లోని భాష - తీరుతెన్నులు నా వ్యాసం వచ్చింది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపగలరు. 

Plese click on the lik


"అవధానసుధాకర" రాంభట్ల పార్వతీశ్వర శర్మ
విశాఖపట్నం.

Venu Ch

unread,
Mar 17, 2015, 12:13:03 AM3/17/15
to telug...@googlegroups.com
పత్రికా భాష గురించి  వివరంగా చర్చించిన  మీ వ్యాసం చదివాను.   బాగుంది.

విద్యుదాఘాతం కంటే విద్యుద్ఘాతం  సరైనదని మీరు రాశారు.   కానీ శబ్ద రత్నాకరం-  మొదటి పదానికి  చంపుట.
కొట్టుట,  దెబ్బ,  గాయము అనే అర్థాలనిచ్చింది. రెండో పదానికి  దెబ్బ,  బాణము అనే అర్థాలనిచ్చింది.  

దెబ్బ అనే అర్థం రెండు పదాల్లోనూ ఉంది.  కొట్టుట, గాయము అనే  అదనపు అర్థాలు కూడా  సాధించే  ‘విద్యాదాఘాతం’  వాడకం మెరుగు కదా! 
 

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Parvatheeswara Sarma Rambhatla

unread,
Mar 17, 2015, 12:51:00 AM3/17/15
to telug...@googlegroups.com
వేణు గారికి నమస్సులు. వ్యాసాసాంతం సమీక్షణకు ధన్యవాదాలు.
మీరన్నది సబబే. నేను ప్రస్తావించింన విషయం ఏమిటంటే పూర్వం నుండి సుపరిచితమైన పదం విద్యుద్ఘాతమే. విద్యుత్ సంబంధ అధికారుల కరపత్రాల్లో గాని, ప్రథమచికిత్సలకు అందించే సమాచారముండే పుస్తకాలలో కాని విద్యుత్+ఘాతం అన్న పదమే బహుళప్రచారంలో ఉంది. ఇది గుర్తింపు పొందింది కూడా. ఆ పదాన్ని విడిచిపెట్టి,  అంతగా ఉపయోగంలేని, ఉపసర్గపూర్వకమైన ఆ+ఘాతం అనే పదాన్ని  దాదాపు కొన్ని సంవత్సరాలుగా విద్యుత్+ ఆఘాతం అన్న పదానికి బహుళప్రచారం కల్పించారు. ఒకసారి తెలుగు అకాడమీ హైదరాబాద్ నిఘంటువు పరిశీలిస్తే మీకు ఇదే విషయం సుగమం అవుతుంది.

ధన్యవాదాలు

Marripoodi Mahojas

unread,
Mar 17, 2015, 1:42:42 AM3/17/15
to telug...@googlegroups.com
చాలా బాగా రాశారు. ప్రతి అక్షరంతోనూ ఏకీభవిస్తున్నాను. ఆ వ్యాసాన్ని ఆమూలాగ్రం చదివాక అక్కడ నేను పెట్టిన వ్యాఖ్య :

"పత్రికలవారు వైరిసమాసాలను ప్రయోగించడం కన్నా అసలు సమాసాలనే పూర్తిగా ఎత్తివేసే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి- మధ్యభారత్ ని మధ్య భారత్ అని విడగొట్టి ముద్రించేతలికి  "మధ్య" అనే పదం, భారత్ తో కాకుండా, దానికి ముందున్న పదంతో అన్వయమౌతూ Central India అనే అర్థాన్ని ఇవ్వడం మానేస్తోందని గ్రహించలేని దుస్థితిలో ఉన్నారు. "మహిళ కాంగ్రెస్" అట. "శాఖ పరమైన విచారణ" అట. "చలిపులి" అనే సమాసాన్ని విడగొట్టి చలి డ్యాష్ పులి అని పెద్దపెద్ద అక్షరాలతో కలర్ లో ముద్రిస్తూ తమ ఘోర అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఈనాడులో రోజూ దర్శనమిచ్చే కళాఖండాలు. ఇవి తెలీక చేస్తున్న తప్పులు కానే కాదు. బాగా తెలిసి చేస్తున్న తప్పులే. ఇందులో అజ్ఞానం పాత్ర కొంత కాగా, "తెలుగుక్కూడా నియమాలా?" అనే చిన్నచూపూ, "తెలుగులో ఎలా వ్రాసినా చల్తా హై"అనే నిర్లక్ష్యం పాత్ర కొంత. ఎక్కువ సందర్భాల్లో కాలమ్ స్పేస్ పొదుపు చేసుకోవాలనే కక్కుర్తితో ఈ విధమైన మాతృభాషాహత్యకి పాల్పడుతున్నారు. విభక్తిప్రత్యయాలు తీసేసి వాక్యాలు వ్రాస్తూ మనల్ని అర్థం చేసుకోమంటారు.ీళ్ళకి లింగబ్ఝేదం తెీదు. వచనభేదం తెలీదు. అసలు తిన్నగా ఒక తెలుగువాక్యం వ్రాయడమే రాదు. వీళ్లసలు ఏం పాత్రికేయులో అర్థం కాదు. వీళ్ళకి ఇంగ్లీషులో ఉన్న పునాదులు తెలుగులో లేకపోవడం బహుశా ఒక కారణం. తాడేపల్లివారు పదనిష్పాదనకళ గ్రంథంలో చెప్పినట్లు ఇవన్నీ వీరవ్యావహారికవాదం వేస్తున్న వెఱ్ఱితలల్లా ఉన్నాయి. ప్రతీవాడూ తన ఇష్టమొచ్చినట్లు వ్రాస్తూ అది వ్యావహారికమని వాదిస్తున్నాడు."  

Parvatheeswara Sarma Rambhatla

unread,
Mar 17, 2015, 1:42:04 PM3/17/15
to telug...@googlegroups.com
మీ సానుకూలస్పందనకు, సత్యనిరూపణ దృష్టికి అభివాదాభినందనలు.

Marripoodi Mahojas

unread,
Apr 3, 2015, 11:00:28 AM4/3/15
to telug...@googlegroups.com
సిలికానాంధ్రవారు చాలా ఆర్తిగా పాఠకుల అభిప్రాయాల్ని ఆహ్వానిస్తున్నట్లు పైకి కనిపిస్తుంది. కానీ భూమిక పత్రికలాగే వారికీ కామెంట్ల ఫోబియా ఉన్నట్లు తోస్తుంది. అక్కడ ఒక కామెంట్ గానీ, ఉత్తరం గానీ కనిపించడం లేదు. కామెంట్ బాక్స్ అయితే కనిపిస్తోంది. నా సమయం వృథా అయింది. చూసి వదిలేయాల్సింది.

Parvatheeswara Sarma Rambhatla

unread,
Apr 4, 2015, 6:25:12 AM4/4/15
to telug...@googlegroups.com
నమస్సులు. సుజనరంజని పత్రిక వారు ఇంకా ఏ శీర్షిక సంబందించిన పాఠకుల స్పందనలను ఇంకా ప్రచురించలేదు. త్వరలో... అని అక్కడ ఉంచారు. కాబట్టి 2 లేదా 3 రోజుల్లో ప్రకటింఛే అవకాశం ఉంది. వేచిచూద్దాం. ధన్యవాదాలు.
Reply all
Reply to author
Forward
0 new messages