"పునః" పదప్రయోగానికి తెలుగు ప్రత్యామ్నాయాలు

67 views
Skip to first unread message

Marripoodi Mahojas

unread,
Mar 17, 2015, 2:58:39 AM3/17/15
to telug...@googlegroups.com
ఆంగ్లంలో చాలా పదాలకి ముందు మళ్ళీ అనే అర్థంలో Re అని చేరుస్తారు. ఆ పదాల్ని తెలుగులోకి అనువదించేటప్పుడు మనవాళ్ళు పునః అనే అవ్యయాన్ని చేరుస్తున్నారు. సంస్కృత పదాలతో అనువదించేటప్పుడు ఈ పద్ధతి శ్రావ్యంగానే ఉంటుంది. కానీ అనువాదానికి తెలుగుపదాలే తప్ప సంస్కృత పదాలు దొరకని/ తెలియని సందర్భాల్లో ఆ తెలుగుపదాలకి పునః అని చేరిస్తే బావుంటుందా? అది ఎబ్బెట్టుగా ఉండొచ్చునని నాకనిపిస్తోంది. ఉదాహరణకి-

Rejoining the duty = మళ్ళీ విధుల్లో చేరడం
Rewriting the rules = నిబంధనల్ని తిరగరాయడం
Rechange = మళ్లీ మార్చడం
Reunion = మళ్లీ కలుసుకోవడం

Repayment = తిరిగి చెల్లించడం

వీటికి సంస్కృత పదాలు ఉన్నాయో లేదో నాకు తెలీదు. ఉన్నా అవి తెలుగులో వాడుకలో లేవని మాత్రం తెలుసు. పైన నేను సూచించినవి, మూలపదాలకి అనువాదాలే తప్ప సమానార్థకాలు కావు. అర్ర్హమయ్యేలా అనువదించి వాక్యాల్లో చెప్పడం వేరు. సమానార్థకాన్ని కల్పించడం వేరు. అందుచేత మనకలవాటైన పాత పద్ధతిలో వీటికి పునః అనే అవ్యయాన్ని చేర్చి "పునస్ చేరిక, పునర్ రాత, పునర్ మార్పు, పునస్ కలయిక, పునస్ చెల్లింపు" అంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. వీటిని సందర్భాన్ని బట్టి ఒక్కో తెలుగు ఉపసర్గతో అనువదిస్తే బావుంటుందని నా అభిప్రాయం. (చూడండి : పదనిష్పాదన కళ - ఆరో అధ్యాయం - 83 వ పేజీ - చివరి లైను) ఉదాహరణకి-

Rejoining the duty = విధుల్లో మరుచేరిక
Rewriting the rules = నిబంధనల తిరగరాత
Rechange = మరుమార్పు
Reunion = మరుకలయిక
Repayment = తిరిగిచెల్లింపు, మరుచెల్లింపు
అంటే ఎలా ఉంటుంది?

కొన్నిటికి "ఎదురు" అని అనువదిస్తే బావుంటుంది.  ఇప్పటికే
ఒకటి-రెండు అలాంటివి ఉన్నాయి. ఉదాహరణకి-

Re-bel = ఎదురుతిరుగు
Retort = ఎదురాడు, ఎదురుచెప్పు, ఎదురుమాట్లాడు
.

Marripoodi Mahojas

unread,
Mar 17, 2015, 3:03:21 AM3/17/15
to telug...@googlegroups.com
అలాగే ఈ అర్థంలో కొన్నిటికి "వెను" అని చేరుద్దామా? ఉదాహరణకి-

Recall = వెనుపిలుపు

Pulikonda

unread,
Mar 17, 2015, 7:21:56 PM3/17/15
to telugupadam
అచ్చతెలుగు సమాసం బాగుంది. దీన్ని అలవాటు చేయవచ్చు. కాని మనం ముందు పోతుంటే వెనుక నుండి ఎవరైనా పిలిచారనుకోండి. ఆ చర్యకు ఇది సరిపోయే అర్థాన్ని ఇస్తుంది. ఈ పదాన్ని వాడిన కొత్త లో పాఠకులు ఇలా అనుకునే వీలుంది. కాని కొత్త అర్థంలో బాగా ప్రచారానికి వస్తే ఇది కొత్త అర్థంతో స్థిరపడుతుంది. ఏ కొత్త పద సృష్టి జరిగిన తర్వాతైనా ఇది తప్పదు. పాత అర్థం ప్రచారం చాలా బలంగా ఉంటే కొత్త అర్థం వ్యాప్తికావడం అసాధ్యం అవుతుంది.
పులికొండ సుబ్బాచారి.

On 17 March 2015 at 12:33, Marripoodi Mahojas <mahojasm...@gmail.com> wrote:
అలాగే ఈ అర్థంలో కొన్నిటికి "వెను" అని చేరుద్దామా? ఉదాహరణకి-

Recall = వెనుపిలుపు

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.



--
Prof. P.  Subbachary
Head, Department of Folklore and Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dravidian University
Kuppam 517425
A.P

Marripoodi Mahojas

unread,
Mar 17, 2015, 10:40:25 PM3/17/15
to telug...@googlegroups.com
ఆచార్య పులికొండ సుబ్బాచారిగారూ! మీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. "వెనుపిలుపు" నకు మీరన్న ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు.

వీవెన్

unread,
Mar 19, 2015, 6:18:03 AM3/19/15
to తెలుగుపదం
కంప్యూటర్ ఉపకరణాల్ని అనువదించేటప్పుడు తరచూ వచ్చే కొన్ని re పదాలు:

restore = (మునుపటి స్థితికి) పునరుద్దరించు
renewal/renew = (చందా) పునరుద్దరణ/పునరుద్దరించు
rename = పేరుమార్చు
revert changes = మార్పులను తిరగ్గొట్టు
reset = ?? (ఇది కూడా మునుపటి స్థితికి పునరుద్దరించడం లాంటిదే, కానీ కాస్త వేరు.)

వీటికీ తెలుగు మాటలు సూచిచండి.

Marripoodi Mahojas

unread,
Mar 19, 2015, 7:08:45 AM3/19/15
to telug...@googlegroups.com
అయితే మళ్లీ ఓసారి "పదనిష్పాదన కళ" తిరగెయ్యాల్సిందే. నేను తప్పకుండా వీటి గురించి ఆలోచిస్తాను. మీరూ ఆలోచించండి.

Vasu Valluri

unread,
Mar 19, 2015, 7:44:37 AM3/19/15
to telug...@googlegroups.com

Recall అనే పదానికి గుర్తు తెచ్చుకొను అనే అర్ధం కూడా ఉంది.
ఇక్కడ మీరు ఉత్పత్తులలో తప్పులు సరిదిద్దటానికి ఉత్పత్తులను వెనుకకు రప్పించుకునే సందర్భానిి వెనుపిలుపు అన్నారనుకుంటా. బాగుంది.

అలాగే ఈ అర్థంలో కొన్నిటికి "వెను" అని చేరుద్దామా? ఉదాహరణకి-

Recall = వెనుపిలుపు

Marripoodi Mahojas

unread,
Mar 20, 2015, 4:15:51 AM3/20/15
to telug...@googlegroups.com
Recall ని చాలా అర్థాల్లో వాడుతూంటారండీ. ప్రజలు ప్రజాప్రతినిధుల్ని అర్ధాంతరంగా పదవీత్యాగం చేయమనడానికి కూడా వాడతారు. విదేశాల్లో పనిచేస్తున్న దౌత్యాధికారుల్ని వెనక్కి రప్పించడానికి కూడా వాడతారు. అయితే ఈ అన్నిసందర్భాలకీ "వెనుపిలుపు" ఒక్కటే అన్వయిస్తుందని నమ్మకంగా చెప్పలేను. కనుక విభిన్న ఆవిష్కారాలకి సాదర స్వాగతం.

Marripoodi Mahojas

unread,
Mar 28, 2015, 6:21:19 AM3/28/15
to telug...@googlegroups.com
Reunion కి కొంతమంది పునర్ మిలనం అని వాడగా చూశాను. హిందీ ప్రభావంలా అనిపించింది.

Samba Siva Rao Kolusu

unread,
Oct 19, 2015, 10:59:51 AM10/19/15
to తెలుగుపదం


On Saturday, March 28, 2015 at 3:51:19 PM UTC+5:30, Marripoodi Mahojas wrote:
Reunion కి కొంతమంది పునర్ మిలనం అని వాడగా చూశాను. హిందీ ప్రభావంలా అనిపించింది.

restart : మార్మొదలు,
redo : ???

undo : వెనుదీయు

Jayanth Varma B

unread,
Apr 23, 2016, 11:25:11 PM4/23/16
to తెలుగుపదం
Restart కి పునఃప్రారంభించు అనే పదం వాడుకలో ఉంది.

Redo అంటే సందర్భం బట్టి "మళ్ళీ చేయుట" లేక "తిరిగి ప్రారంభించుట" అని అనవచ్చు.

Undo అంటే వేసిన అడుగు వెనక్కి వెయ్యటం లాంటిది. అందుకని సందర్భం బట్టి "పునఃస్థితికి మార్చుటా" లేక "యథాస్థితికి తేవుట" అని అనవచ్చు.

Jayanth Varma B

unread,
Apr 23, 2016, 11:25:11 PM4/23/16
to తెలుగుపదం
వీవెన్ గారు restore కి reset కి కొంచం వెత్యాసం ఉంది.

Restore అంటే మనం భద్ర పరచిన విధానాన్ని తిరిగి తేవడం. అంటే మనం పెట్టిన తేర కాంతి(బ్రైట్నెస్), తెరిచిన విండోలు, బ్రౌజరు ట్యాబ్లు లాంటివి. ఉదాహరణకి మనం ఒక browser ని restore చేస్తే అది మనం దాచిన వాటిని తుడిచేదు. మనం దానిని మూసే ముందు ఎలా ఉందో అలా మారుద్ది. అంటే tabs ని మాత్రం తిరిగి తెరుచుద్ది.

Reset అంటే మనం తెచ్చిన కొత్తలో ఉన్న settings లోకి మార్చడం. ఉదాహరణకి మనం ఒక browser ని reset చేస్తే అది మనం దాచిన bookmarks ని passwords ని తుడిచి కొత్త browser లా మారడం.

Set అంటే పెట్టటం. Reset అంటే మళ్ళి మొదట్లో ఉన్న విధంగా మార్చిపెట్టడం.

అందుకే reset అంటే తిరిగి పెట్టడం లేక సాధారణంగా మార్చుట అని అనవచ్చు అని నా ఉద్దేశం.

ఆంగ్లం లాగ ప్రెతి పనికి ఒక చిన్న పదం సృష్టించడం అంటే నాకు పెద్దగా నచ్చని పధ్ధతి అందుకే చిన్న పేర్లు ఆలోచించలేదు. కాని ఎవరైనా ఒక మంచి పేరు ఆలోచించినచో అది పెద్ద, లేక చిన్న పదమైనా నాకు వాడుటకు సంకోచం లేదు.

Pulikonda

unread,
Apr 24, 2016, 3:06:24 AM4/24/16
to telugupadam
పునః ప్రారంభం లేదా పునరారంభం అనే సంస్కృత సమాసాలు సరైన అను వాదాలే అవుతాయి.
కాని అంత బరువు లేకుండా తిరిగి మొదలెట్టు అని తేలికైన తెలుగు పదాల్ని వాడుకోవచ్చు.

పులికొండ సుబ్బాచారి.

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Dr.R.P.Sharma

unread,
Aug 11, 2016, 10:22:45 AM8/11/16
to తెలుగుపదం
Undo = వెనుకడుగు
Redo = ముందడుగు

ఇలా వాడ్డంలో తెలుగు జాతీయతా ఉంటుంది. ఆలోచించండి.

---------------------------------------------------------------------------------------------------
రామక పాండురంగ శర్మ,
Reply all
Reply to author
Forward
0 new messages