Re: (తెలుగుపదం) Digest for telugupadam@googlegroups.com - 3 updates in 2 topics

11 views
Skip to first unread message

Ravi Kumar

unread,
Feb 3, 2015, 12:43:45 AM2/3/15
to telug...@googlegroups.com
Doctorate - పండిత పట్టా ఇది చాలా బాగుంది.



2 ఫిబ్రవరి, 2015 10:55 [PM] న, <telug...@googlegroups.com> ఇలా రాసారు :
Marripoodi Mahojas <mahojasm...@gmail.com>: Feb 01 11:20PM -0800

మనం ఈ గుంపులో చాలా కొత్తకొత్తపదాలు కనిపెడుతున్నాం. కానీ ఇవి వినియోగంలోకి
రావడం లేదు. వీటిని వినియోగంలోకి తేవాలంటే పాపులర్ మీడియానే సాధనం. కానీ మన
పదాలు మీడియా దాకా వెళ్ళడం లేదు. మనలో ఎవరికీ మీడియాలోని భాషా విషయాల ఇన్
ఛార్జిలతో సంబంధ బాంధవ్యాలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమేమోనని నా అనుమానం.
మరో పక్క మీడియాలోని పాత్రికేయులు తమ అరకొర భాషాపరిజ్ఞానం (in other words
భాషా-అజ్ఞానం) తో ఇంగ్లీషు పదాలకి అంతగా కరెక్టు కానటువంటి అనువాదాలు
చేసుకుంటూ వెళుతున్నారు. రోజూ అవి మీడియాలో చదువుతూ/ చూస్తూ కూడా భాధపడడం తప్ప
ఏమీ చెయ్యలేని, ఎవరికీ చెప్పలేని, ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో
పడిపోయాం. ఉదాహరణకి, ఈ రోజు ఈనాడులో formulations అనే మాటకి సిద్ధాంతీకరణ అని
అనువాదం చేసారు. కానీ formula అంటే సిద్ధాంతం కాదు, సూత్రం. ఇంగ్లీషులో
సిద్ధాంతానికి Theory/ Postulation/ ideology మొదలైన పదాలు వాడతారు. కాబట్టి
మనం సాధ్యమైనంత త్వరగా మీడియాతో అనుసంధానమై వాళ్ళ తప్పుల్ని సరిదిద్దడమే
కాకుండా మన పదాల్ని వాళ్ళ దాకా, వాళ్ళ ద్వారా ప్రజల దాకా తీసుకెళ్ళాల్సి
అత్యవసరం నాకు కనిపిస్తోంది. ఏమంటారు?
వీవెన్ <vee...@gmail.com>: Feb 02 09:09PM +0530

2 ఫిబ్రవరి, 2015 12:50 [PM] న, Marripoodi Mahojas <
> రావడం లేదు. వీటిని వినియోగంలోకి తేవాలంటే పాపులర్ మీడియానే సాధనం. కానీ మన
> పదాలు మీడియా దాకా వెళ్ళడం లేదు. మనలో ఎవరికీ మీడియాలోని భాషా విషయాల ఇన్
> ఛార్జిలతో సంబంధ బాంధవ్యాలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమేమోనని నా అనుమానం.
 
భాషా ఇన్‌చార్జిలకు మనకూ పరిచయం ఉన్నా వారు తమ సంస్థలో పలు ఎడిటర్లను ఎంతవరకూ
ప్రభావితం చెయ్యగలరనేదీ ఆలోచించుకోవాలి. ఈనాడు తక్క తతిమా మాధ్యమ సంస్థల్లో
(తెలుగు పదాల వాడుక విషయంలో) పరిస్థితి ఏమిటో మనకు తెలియదు.
 
ఒక పద్ధతి: (జోడింపును చూడండి) మనకు నచ్చిన కొత్త పదాలను మన రచనల్లో,
బ్లాగులో, ఈమెయిళ్ళలో, జాల పత్రికలకు పంపే వ్యాసాల్లో గట్రా వాడుతూండటం.
తద్వారా అవి క్రియాశీల చదువరులకూ ఇతర రచయితలకూ చేరుతాయి. అక్కడి నుండి
పత్రికలకూ, పుస్తకాలకూ. ఆ తర్వాత ప్రజానీకానికీ.
 
 
> చేసుకుంటూ వెళుతున్నారు. రోజూ అవి మీడియాలో చదువుతూ/ చూస్తూ కూడా భాధపడడం తప్ప
> ఏమీ చెయ్యలేని, ఎవరికీ చెప్పలేని, ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో
> పడిపోయాం.
 
తప్పులను తప్పకుండా ఎత్తిచూపాల్సిందే. 1. సంపాదకులకు వ్రాయడం 2.
బ్లాగుల్లో/సామాజిక మాథ్యమాల్లో వ్రాయడం
<https://plus.google.com/103403169568352770317/posts/D4mvEEmwpjN>. పదాల
అర్థాలపై, వాటి వాడుకలపై వివరమైన వ్యాసాలు వ్రాయడం. ఉదాహరణకు అచిరకాలం అన్న
పదం తప్పుగా వాడటం చూసి నేను చిఱుచిరలు అనే టపా
<https://veeven.wordpress.com/2014/12/17/chiruchiralu/>ను వ్రాసాను.
 
ఇక దీర్ఘకాలిక వ్యూహంగా, తెలుగుపదం తరఫున ఎప్పుడో ఎక్కడో పుట్టిన కొత్త పదాలను
కొత్త వాడుకలను కూడా మనం డాక్యుమెంట్
<http://telugupadam.org/%E0%B0%AA%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF>
చెయ్యాలి
<http://telugupadam.org/%E0%B0%87%E0%B0%A8%E0%B1%81%E0%B0%AA_%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF>.
ఓ నిఘంటువునో లేక మాటల వాడుక వంటి ఓ పుస్తకాన్నో ప్రచురించాలి.
 
 
> ఈ రోజు ఈనాడులో formulations అనే మాటకి సిద్ధాంతీకరణ అని అనువాదం చేసారు.
> కానీ formula అంటే సిద్ధాంతం కాదు, సూత్రం. ఇంగ్లీషులో సిద్ధాంతానికి Theory/
> Postulation/ ideology మొదలైన పదాలు వాడతారు.
 
సూత్రీకరించారు/సూత్రీకరణలను ఈపాటికే వేరే అర్థంలో వాడుతున్నారు కాబట్టి
కావచ్చు.
 
 
> కాబట్టి మనం సాధ్యమైనంత త్వరగా మీడియాతో అనుసంధానమై వాళ్ళ తప్పుల్ని
> సరిదిద్దడమే కాకుండా మన పదాల్ని వాళ్ళ దాకా, వాళ్ళ ద్వారా ప్రజల దాకా
> తీసుకెళ్ళాల్సి అత్యవసరం నాకు కనిపిస్తోంది. ఏమంటారు?
 
ఆ దిశగా ప్రయత్నాలను నేను నిరుత్సాహపరచను గానీ, కొన్ని విషయాల్లో మార్పు
దశాబ్దాలు పడుతుంది. తెలుగు వాడుక తగ్గిపోతున్న ఈ కాలంలో అదింకా కష్టంగా
తోస్తుంది. మనం దీర్ఘకాల ప్రభావం గల అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తే మేలు.
 
అన్ని తెలుగు పత్రికల/ఛానెళ్ళ నుండి ఒక్కొక్కరూ, తెలుగు అకాడమీ, తెలుగు
విశ్వవిద్యాలయం, మరియు అన్ని ప్రభుత్వ కళాశాలల తెలుగు విభాగాలనుండీ
ఒక్కొక్కరూ, ఔత్సాహిక భాషావేత్తలూ ప్రతినిధులుగా ఒక సంఘం ఉండాలి. అలాంటిది
ఏర్పడడానికి మనం కృషి చెయ్యాలి. అప్పటి వరకూ అలాంటి వారందరినీ తెలుగుపదం మరియు
తెలుగు వెలుగు పత్రిక వంటి వేదికల ద్వారా సమన్వయ పరచాలి.
 
ఇట్లు,
వీవెన్.
Marripoodi Mahojas <mahojasm...@gmail.com>: Feb 01 11:09PM -0800

ఐరోపా దేశాల్లో డిప్లొమాకీ డిగ్రీకీ పెద్దగా అర్థవ్యత్యాసం లేదు. కానీ మన
దేశంలో డిప్లొమాని డిగ్రీ కన్నా తక్కువ శ్రేణిదిగా అర్థం చేసుకుంటారు. ఉన్న
డిగ్రీకి అదనపు అర్హతగానూ, తక్కువ కాలవ్యవధిలో చదివి తెచ్చుకునే సర్టిఫికేట్
గానూ దాన్ని చూస్తారు. డిప్లొమాకి తెలుగులో ఇప్పటిదాకా ఎవరైనా సమానార్థక
పదాన్ని కల్పించినట్లు నా దృష్టికి రాలేదు.
 
 
అదే విధంగా డాక్టరేట్ అనే డిగ్రీకి కూడా తెలుగుపదం నాకు కనిపించలేదు. పోస్ట్
గ్రాడ్యువేషన్ కైతే స్నాతకోత్తర పట్టం అంటున్నారు. (మనం పి.జి. అనేదాన్ని
పాశ్చాత్యులు గ్రాడ్యువేషన్ అంటారనుకోండి) కనుక వీటికి నేనీ ఈ క్రింది పదాలు
అనుకుంటున్నాను. సభ్యులు పరిశీలించి బావున్నాయో లేదో చెప్పండి.
 
Diploma = ప్రపట్టం/ ప్రపట్టా
Doctorate - పండిత పట్టం/ పండిత పట్టా
You received this digest because you're subscribed to updates for this group. You can change your settings on the group membership page.
To unsubscribe from this group and stop receiving emails from it send an email to telugupadam...@googlegroups.com.

Reply all
Reply to author
Forward
0 new messages