విండోస్ XP లో తెలుగు సపోర్ట్ స్థాపించటం గురించి..

5 views
Skip to first unread message

చైతన్య క్రిష్ణ పాటూరు

unread,
Jan 10, 2008, 12:27:48 AM1/10/08
to తెలుగుబ్లాగు

నేను కొన్ని రోజులుగా విండోస్ xpలో సీడీ లేకుండా ఆటోమేటిక్ గా తెలుగు
సపోర్ట్ ని ఎనేబుల్ చేసే పద్దతి కోసం వెతుకుతున్నాను. అసలు సమస్యేమిటంటే
నా మిత్రులు చాలా మంది దగ్గర xp సీడీ లేదు indic సపోర్ట్
స్ఠాపించుకోటానికి. ఇక ఆఫీస్ కంప్యూటర్ లలో అసలు కుదరదు. అడిగితే
అడ్మినిస్ట్రేటర్ ఎందుకు, ఏమిటి అని వంద ప్రశ్నలేస్తాడు. ఇదిలా వుంటే
కంపెనీ సిస్టమ్ లు కొన్నవాళ్ళకి ఇంకో రకం సమస్య. వాళ్ళకి కంప్యూటర్ తో
పాటూ xp సీడీ ఇవ్వకుండా, రికవరీ డిస్క్ ఇచ్చారంట. దాంతో indic సపోర్ట్
ఎనేబుల్ కావట్లేదని ఒకటే గోల. path మార్చాలేమో మరి. మిత్రులెవరికన్నా
తెలుగు బ్లాగులు, వెబ్ సైట్లు లంకె పంపితే సరిగ్గా కనపడట్లేదని
కంప్లైంటు. ఒకొక్కరి సిస్టమ్ ని తెలుగు యూనికోడ్ కి రెడీ చెయ్యటానికి
బోలెడు శ్రమ, సమయం తీసుకుంటున్నాయి. ఏదో ఇంటెర్నెట్ ఎక్స్ ప్లోరర్ వరకు
ఐతే ఒక dll, ఒక ఫాంట్ ఫైల్ స్థాపించటంతో పోతుంది, కాని కొన్ని ఓపెన్
సోర్స్ సాఫ్ట్వేర్ లను తెలుగులోకి అనువాదం చేద్దామని, మిత్రులతో
చేయిద్దామని ప్రయత్నిస్తే దానికి సంబందించిన సాఫ్ట్వేర్ పరికరాలు (POEdit
లాంటివి), OS స్థాయిలో తెలుగు ఎనేబుల్ అయ్యుండాలని మెలిక పెడుతున్నాయి.

గత రెండు రోజులుగా నా కంప్యూటర్ మీద ప్రయోగాలు చేసి, ఏవేం ఫైల్స్ కావాలో,
సీడీ లేకుండా ఎలా స్థాపించాలో కనుక్కున్నాను. అంతా చేసాక, అంతర్జాలంలో
వెతికితే ప్రవీణ్ గార్లపాటి, సుధాకర్ మొదలైన వారు, ఈ పని క్రితం
సంవత్సరమే చెయ్యబోయారని, ఇది మైక్రోసాఫ్ట్ లైసెన్స్ ని అతిక్రమించటం
కిందకి వస్తుందని తెలిసింది. కాని తర్వాత సరిగ్గా ఇలాంటి పరికరమే ఒకటి
నాకు అంతర్జాలంలో తారసపడింది.

http://www.omicronlab.com/tools/icomplex-full.html

ఇది బంగ్లా సపోర్ట్ కోసం ఉద్దేశించబడినా, మొత్తం భారతీయ భాషలన్నిటిని
ఎనేబుల్ చేస్తుంది. అవసరం లేదనుకుంటే సపోర్ట్ తొలగించగలదు కూడా. వాళ్ళు
దర్జాగా వెబ్ సైట్ లోంచి డౌన్ లోడ్ చేసుకోమని ఇచ్చారు. కాకపోతే ఇది లీగల్
యూజర్స్ మాత్రమే వాడాలని ఒక disclaimer పారేసారు. మనమూ అలా చేయవచ్చా?
అసలు దాన్నే వాడేసుకోవచ్చు కూడా. ఇలాంటిది వుంటే తెలుగు సపోర్ట్
స్థాపించుకోటం చాలా సులువవుతుంది. దీని పై సభ్యలు తమ అభిప్రాయం
తెలుపగలరు.

- చైతన్య క్రిష్ణ పాటూరు

Kiran Kumar Chava

unread,
Jan 10, 2008, 1:06:02 AM1/10/08
to telug...@googlegroups.com
ప్రస్తుతానికి దాన్నే వాడుకుంటే పోలా :)

Praveen Garlapati

unread,
Jan 10, 2008, 1:20:35 AM1/10/08
to telug...@googlegroups.com
చైతన్య గారు,

మీరు చెప్పింది నిజమే. ఇలాంటి టూల్ ని తయారు చెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు.
ఏ ఫైల్సు కాపీ అవుతున్నాయో తెలుసుకుని వాటిని పాకేజీ చేసి ఎక్స్ట్రాక్టు చెయ్యడమే.

అది ఇంతకు ముందు నేను ప్రయత్నించాను కానీ అది మైక్రోసాఫ్టు TOS వయోలేషను అని సుధాకరు గారు
హెచ్చరించగానే ఆపేసాను.

ఇకపోతే నాకు తెలిసి కంపెనీ సిస్టం లు కొంటే వారు మీ సిస్టం లోనే i386 ఫోల్డరుని ఉంచుతారు. కాబట్టి
సమస్య ఉండదని నా అభిప్రాయం.
ఒక సారి c:\ లో ఆ ఫోల్డరు ఉందో లేదో చూడండి.

ఇక మీరు సూచించిన యుటిలిటీ వయోలేషను కిందే వస్తుంది వారు గనక ఆ DLLs, fonts పాకేజీ చేస్తే.
(చేస్తున్నారనుకుంటాను).

దీనికి ఒక సొల్యూషను ఈ Complex Script/fonts/dlls సపోర్టు ఒక exe/zip గా మైక్రోసాఫ్టు
అందిస్తే ఆ url నుండి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చెయ్యడమే.
ఇంతకు ముందు ప్రదీపు గారు ఒక లంకె ఇచ్చారు. దాంట్లో అలా చేసేందుకు ఉపయోగపడే ఒక ఫంక్షన్ కాల్
గురించిన డీటెయిల్స్ ఉన్నాయి. వెతికి పంపిస్తాను.

మీకు ట్రాన్స్లేషను మొదలయిన వాటిలో సమస్యలెదురయితే ఈ గుంపుకి కానీ నాకు గానీ ఒక మెయిలు చెయ్యండి.

ఇక XP అయితే ఐఈ లో తెలుగు బాగానే కనిపిస్తుందనుకుంట ఈ కాంప్లెక్సు సపోర్టు లేకున్నా. అదొకటే మార్గం.

--
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com

telugug...@gmail.com

unread,
Jan 10, 2008, 3:38:31 AM1/10/08
to తెలుగుబ్లాగు
అదే వెబ్ సైట్ లో బంగ్లా ansi to unicode converter ఉంది. లింక్:
http://www.omicronlab.com/avro-converter.html
తెలుగుకి ఇటువంటి converter ఉందా.ఉంటే తెలుపగలరు
పద్మనాభం

On Jan 10, 11:20 am, Praveen Garlapati <praveengarlap...@gmail.com>
wrote:
> > - చైతన్య క్రిష్ణ పాటూరు- Hide quoted text -
>
> - Show quoted text -

శ్రీదీపిక

unread,
Jan 10, 2008, 3:52:39 AM1/10/08
to telug...@googlegroups.com
నమస్కారం

--
Dileep.M  శ్రీదీపిక
E-mail:      m.di...@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.wordpress.com

Veeven (వీవెన్)

unread,
Jan 10, 2008, 4:16:05 AM1/10/08
to telug...@googlegroups.com
On Jan 10, 2008 10:57 AM, చైతన్య క్రిష్ణ పాటూరు <chaitanyakr...@gmail.com> wrote:

నేను కొన్ని రోజులుగా విండోస్ xpలో సీడీ లేకుండా ఆటోమేటిక్ గా తెలుగు
సపోర్ట్ ని ఎనేబుల్ చేసే పద్దతి కోసం వెతుకుతున్నాను. అసలు సమస్యేమిటంటే
నా మిత్రులు చాలా మంది దగ్గర xp సీడీ లేదు indic సపోర్ట్
స్ఠాపించుకోటానికి. ఇక ఆఫీస్ కంప్యూటర్ లలో అసలు కుదరదు. అడిగితే
అడ్మినిస్ట్రేటర్ ఎందుకు, ఏమిటి అని వంద ప్రశ్నలేస్తాడు. ఇదిలా వుంటే
కంపెనీ సిస్టమ్ లు కొన్నవాళ్ళకి ఇంకో రకం సమస్య. వాళ్ళకి కంప్యూటర్ తో
పాటూ xp సీడీ ఇవ్వకుండా, రికవరీ డిస్క్ ఇచ్చారంట. దాంతో indic సపోర్ట్
ఎనేబుల్ కావట్లేదని ఒకటే గోల. path మార్చాలేమో మరి. మిత్రులెవరికన్నా
తెలుగు బ్లాగులు, వెబ్ సైట్లు లంకె పంపితే సరిగ్గా కనపడట్లేదని
కంప్లైంటు. ఒకొక్కరి సిస్టమ్ ని తెలుగు యూనికోడ్ కి రెడీ చెయ్యటానికి
బోలెడు శ్రమ, సమయం తీసుకుంటున్నాయి. ఏదో ఇంటెర్నెట్ ఎక్స్ ప్లోరర్ వరకు
ఐతే ఒక dll, ఒక ఫాంట్ ఫైల్ స్థాపించటంతో పోతుంది, కాని కొన్ని ఓపెన్
సోర్స్ సాఫ్ట్వేర్ లను తెలుగులోకి అనువాదం చేద్దామని, మిత్రులతో
చేయిద్దామని ప్రయత్నిస్తే దానికి సంబందించిన సాఫ్ట్వేర్ పరికరాలు (POEdit
లాంటివి), OS స్థాయిలో తెలుగు ఎనేబుల్ అయ్యుండాలని మెలిక పెడుతున్నాయి.

ఉత్త వెబ్ విహారణం (browsing) కొరకైతే మంటనక్క 3 సరిపోతుంది. (ఇది ప్రస్తుతం బీటా స్థాయిలో ఉంది.)  మిగతా అవసరాలంటే, కుదరదు.

కానీ అనువాదాలకై, వెబ్ ఆధారిత లాంచ్‌పాడ్‌ని వాడుకోవచ్చు. https://translations.launchpad.net/
 
గత రెండు రోజులుగా నా కంప్యూటర్ మీద ప్రయోగాలు చేసి, ఏవేం ఫైల్స్ కావాలో,
సీడీ లేకుండా ఎలా స్థాపించాలో కనుక్కున్నాను. అంతా చేసాక, అంతర్జాలంలో
వెతికితే ప్రవీణ్ గార్లపాటి, సుధాకర్ మొదలైన వారు, ఈ పని క్రితం
సంవత్సరమే చెయ్యబోయారని, ఇది మైక్రోసాఫ్ట్ లైసెన్స్ ని అతిక్రమించటం
కిందకి వస్తుందని తెలిసింది. కాని తర్వాత సరిగ్గా ఇలాంటి పరికరమే ఒకటి
నాకు అంతర్జాలంలో తారసపడింది.

http://www.omicronlab.com/tools/icomplex-full.html

ఇది బంగ్లా సపోర్ట్ కోసం ఉద్దేశించబడినా, మొత్తం భారతీయ భాషలన్నిటిని
ఎనేబుల్ చేస్తుంది. అవసరం లేదనుకుంటే సపోర్ట్ తొలగించగలదు కూడా. వాళ్ళు
దర్జాగా వెబ్ సైట్ లోంచి డౌన్ లోడ్ చేసుకోమని ఇచ్చారు. కాకపోతే ఇది లీగల్
యూజర్స్ మాత్రమే వాడాలని ఒక disclaimer పారేసారు. మనమూ అలా చేయవచ్చా?
అసలు దాన్నే వాడేసుకోవచ్చు కూడా. ఇలాంటిది వుంటే తెలుగు సపోర్ట్
స్థాపించుకోటం చాలా సులువవుతుంది. దీని పై సభ్యలు తమ అభిప్రాయం
తెలుపగలరు.

చట్టబద్ధంగా ఉండాలంటే, మన ప్యాకేజీలో పంపిణీ చేసేకంటే, ఆ ఫైళ్ళను మైక్రోసాఫ్ట్ సైటునుండి దిగుమతి చేసి, అప్పుడు వాడుకరి కంప్యూటర్లో స్థాపిస్తే (ies4linux లా) బాగుంటుంది.

--
http://veeven.com/
Registered Linux User #460150

చైతన్య క్రిష్ణ పాటూరు

unread,
Jan 10, 2008, 2:04:43 AM1/10/08
to తెలుగుబ్లాగు
ప్రవీణ్ గారూ,

మీరన్నది నిజమే. అలా చేయటం కష్టమేమి కాదు. కాని వాళ్ళేవ్వరో దర్జాగా వెబ్
సైట్ లో పెట్టారు కదా. లైసెన్స్ అతిక్రమించకుండా చేయొచ్చేమో అని అనుమానం
వచ్చి అడిగాను. మైక్రోసాఫ్ట్ కి మీరన్నట్లు exe/zip గా ఇచ్చే వుద్దేశం
లేదనుకుంటా. ఆ విషయం bhashaindia.com ఫోరంలో ఎక్కడో చెప్పినట్లు గుర్తు.
XP IE లో బాగానే కనిపిస్తోంది. కాని POEdit లాంటి టూల్స్ OS లెవల్
సపోర్ట్ కావాలంటున్నాయి. నాకు బానే వుంది గాని, స్నేహితుల్ని కొందరిని ఈ
వైపుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. వాళ్ళకు సులువుగా తెలుగు
సప్పోర్ట్ ఎనేబుల్ చేసే వీలు కోసం ఈ తిప్పలన్ని.

నేను కూడా తెలుగు అనువాదానికి కొత్తే. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఈ
మధ్యే సమయం దొరికింది. పెద్ద పెద్ద వాటి జోలికి వెళ్ళకుండా, ఏదైనా చిన్న
దానితో మొదలుపెడదామని అనుకున్నా. నేను Image Processing/Computer Vision
లో పని చేస్తున్నా. నా ఆఫీస్ వర్క్ లో రోజు VLC Player ని వాడతాను.
అందుకే దాన్ని అనువదించటం మొదలు పెట్టాను. చూడాలి మరి ఎలా సాగుతుందో.
ఎదైనా సమస్య ఎదురైతే తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తాను.

కిరణ్ కుమార్ చావా గారు,

ప్రస్తుతం అదే చేస్తున్నా. మా ఫ్రెండ్స్ అందరికి ఆ లంకె పంపేసాను.
వాడెవడో రిస్క్ తీసుకున్నాడు. మనకీ పనికి వస్తుంది కదా. వాడేసుకుందాం :-)

చైతన్య క్రిష్ణ పాటూరు

unread,
Jan 10, 2008, 4:28:37 AM1/10/08
to తెలుగుబ్లాగు
వీవెన్ గారూ,

మీ లంకెకి నెనెర్లు. ప్రస్తుతానికి నేను VLC Player ని తెలుగులోకి
అనువదించే కార్యక్రమం మొదలుపెట్టాను. ఇది నాకు మొదటి అనువాదం. నాకు
లైనెక్స్ నివ్య తో అంత పరిచయం లేదు. ప్రస్తుతం విండోస్ వాడుతున్నాను.
పెద్ద పెద్ద అనువాదాల జోలికెళ్ళటానికి ధైర్యం చాలక VLC Player తో
మొదలుపెట్టాను. POEdit తో చేస్తున్నాను. మీరు చెప్పిన లాంచ్ పాడ్ తో ఎలా
చేయాలో తెలుపగలరు.

On Jan 10, 2:16 pm, "Veeven (వీవెన్)" <vee...@gmail.com> wrote:
> On Jan 10, 2008 10:57 AM, చైతన్య క్రిష్ణ పాటూరు <
>
>
>
>
>
> chaitanyakrishna.pat...@gmail.com> wrote:
>
> > నేను కొన్ని రోజులుగా విండోస్ xpలో సీడీ లేకుండా ఆటోమేటిక్ గా తెలుగు
> > సపోర్ట్ ని ఎనేబుల్ చేసే పద్దతి కోసం వెతుకుతున్నాను. అసలు సమస్యేమిటంటే
> > నా మిత్రులు చాలా మంది దగ్గర xp సీడీ లేదు indic సపోర్ట్
> > స్ఠాపించుకోటానికి. ఇక ఆఫీస్ కంప్యూటర్ లలో అసలు కుదరదు. అడిగితే
> > అడ్మినిస్ట్రేటర్ ఎందుకు, ఏమిటి అని వంద ప్రశ్నలేస్తాడు. ఇదిలా వుంటే
> > కంపెనీ సిస్టమ్ లు కొన్నవాళ్ళకి ఇంకో రకం సమస్య. వాళ్ళకి కంప్యూటర్ తో
> > పాటూ xp సీడీ ఇవ్వకుండా, రికవరీ డిస్క్ ఇచ్చారంట. దాంతో indic సపోర్ట్
> > ఎనేబుల్ కావట్లేదని ఒకటే గోల. path మార్చాలేమో మరి. మిత్రులెవరికన్నా
> > తెలుగు బ్లాగులు, వెబ్ సైట్లు లంకె పంపితే సరిగ్గా కనపడట్లేదని
> > కంప్లైంటు. ఒకొక్కరి సిస్టమ్ ని తెలుగు యూనికోడ్ కి రెడీ చెయ్యటానికి
> > బోలెడు శ్రమ, సమయం తీసుకుంటున్నాయి. ఏదో ఇంటెర్నెట్ ఎక్స్ ప్లోరర్ వరకు
> > ఐతే ఒక dll, ఒక ఫాంట్ ఫైల్ స్థాపించటంతో పోతుంది, కాని కొన్ని ఓపెన్
> > సోర్స్ సాఫ్ట్వేర్ లను తెలుగులోకి అనువాదం చేద్దామని, మిత్రులతో
> > చేయిద్దామని ప్రయత్నిస్తే దానికి సంబందించిన సాఫ్ట్వేర్ పరికరాలు (POEdit
> > లాంటివి), OS స్థాయిలో తెలుగు ఎనేబుల్ అయ్యుండాలని మెలిక పెడుతున్నాయి.
>
> ఉత్త వెబ్ విహారణం (browsing) కొరకైతే మంటనక్క 3 సరిపోతుంది. (ఇది ప్రస్తుతం
> బీటా స్థాయిలో ఉంది.)  మిగతా అవసరాలంటే, కుదరదు.
>
> కానీ అనువాదాలకై, వెబ్ ఆధారిత లాంచ్‌పాడ్‌ని వాడుకోవచ్చు.https://translations.launchpad.net/
>
>
>
>
>
> > గత రెండు రోజులుగా నా కంప్యూటర్ మీద ప్రయోగాలు చేసి, ఏవేం ఫైల్స్ కావాలో,
> > సీడీ లేకుండా ఎలా స్థాపించాలో కనుక్కున్నాను. అంతా చేసాక, అంతర్జాలంలో
> > వెతికితే ప్రవీణ్ గార్లపాటి, సుధాకర్ మొదలైన వారు, ఈ పని క్రితం
> > సంవత్సరమే చెయ్యబోయారని, ఇది మైక్రోసాఫ్ట్ లైసెన్స్ ని అతిక్రమించటం
> > కిందకి వస్తుందని తెలిసింది. కాని తర్వాత సరిగ్గా ఇలాంటి పరికరమే ఒకటి
> > నాకు అంతర్జాలంలో తారసపడింది.
>
> >http://www.omicronlab.com/tools/icomplex-full.html
>
> > ఇది బంగ్లా సపోర్ట్ కోసం ఉద్దేశించబడినా, మొత్తం భారతీయ భాషలన్నిటిని
> > ఎనేబుల్ చేస్తుంది. అవసరం లేదనుకుంటే సపోర్ట్ తొలగించగలదు కూడా. వాళ్ళు
> > దర్జాగా వెబ్ సైట్ లోంచి డౌన్ లోడ్ చేసుకోమని ఇచ్చారు. కాకపోతే ఇది లీగల్
> > యూజర్స్ మాత్రమే వాడాలని ఒక disclaimer పారేసారు. మనమూ అలా చేయవచ్చా?
> > అసలు దాన్నే వాడేసుకోవచ్చు కూడా. ఇలాంటిది వుంటే తెలుగు సపోర్ట్
> > స్థాపించుకోటం చాలా సులువవుతుంది. దీని పై సభ్యలు తమ అభిప్రాయం
> > తెలుపగలరు.
>
> చట్టబద్ధంగా ఉండాలంటే, మన ప్యాకేజీలో పంపిణీ చేసేకంటే, ఆ ఫైళ్ళను మైక్రోసాఫ్ట్
> సైటునుండి దిగుమతి చేసి, అప్పుడు వాడుకరి కంప్యూటర్లో స్థాపిస్తే (ies4linux
> లా) బాగుంటుంది.
>
> --http://veeven.com/
> Registered Linux User #460150- Hide quoted text -
>
> - Show quoted text -- Hide quoted text -

Veeven (వీవెన్)

unread,
Jan 10, 2008, 4:46:03 AM1/10/08
to telug...@googlegroups.com
On Jan 10, 2008 2:58 PM, చైతన్య క్రిష్ణ పాటూరు <chaitanyakr...@gmail.com> wrote:
వీవెన్ గారూ,

మీ లంకెకి నెనెర్లు. ప్రస్తుతానికి నేను VLC Player ని తెలుగులోకి
అనువదించే కార్యక్రమం మొదలుపెట్టాను. ఇది నాకు మొదటి అనువాదం. నాకు
లైనెక్స్ నివ్య తో అంత పరిచయం లేదు. ప్రస్తుతం విండోస్ వాడుతున్నాను.
పెద్ద పెద్ద అనువాదాల జోలికెళ్ళటానికి ధైర్యం చాలక VLC Player తో
మొదలుపెట్టాను. POEdit తో చేస్తున్నాను. మీరు చెప్పిన లాంచ్ పాడ్ తో ఎలా
చేయాలో తెలుపగలరు.

VLC కి అక్కడ అనువాదం చేసే సౌకర్యంలేదు. https://translations.launchpad.net/vlc వీడియోలాన్ వారిని అడిగితే చేరుస్తారేమో.

లాంచ్‌పాడ్‌లో అనువాదం చేయదగ్గ ప్రాజెక్టులును ఇక్కడ చూడవచ్చు: https://translations.launchpad.net/

అక్కడ అనువాదాలు చెయ్యడానికి మీకు లాంచ్‌పాడ్ ఖాతా ఉండాలి.

తెలుగువీర

unread,
Jan 12, 2008, 5:09:13 AM1/12/08
to తెలుగుబ్లాగు
చైతన్య క్రిష్ణ గారూ,
మంచి లింకు పట్టారు..
అవును..కొత్తది చెయ్యటమెందుకు మనం ఈ-తెలుగులో దీని డౌన్లోడుకి ఒక
లింకిచ్చి దీన్నే ఉపయోగించుకుంటే సరిపోతుంది..
కట్టె విరగకుండా..పాము చావకుండా పరిష్కారము ఇదేనేమో..

రాకేశ్వర రావు

unread,
Jan 12, 2008, 11:54:29 PM1/12/08
to తెలుగుబ్లాగు

తెలుగు ఎనేబులు చేయడానికి కావలసినవి రెండు dll లు మాత్రమే.
ఫాంటు గౌతమి ప్రతి xp కంప్యూటరులో వుంటుంది.
ఆ dll లు నెట్టులు పెట్టేస్తే పోలో అనుకున్నప్పడు అది TOS అతిక్రమించడం
అని తెలిసింది.
మీరన్నట్టు ఆ మహానుభావుడెవరో ఆ పని మనకోసం చేసి పెట్టినప్పుడు మన దానిని
వాడుకుంటే సరిపోతుంది. టూ హెల్ విత్ టీఓఎస్.
ఇక ప్రవీణ్ గారు చెప్పినట్లు సీడీ లేక పోయినా i386 ఫోల్డరు వుంటే చాలు.
నా కంపీలో అదే వుంది, సీడీ వుండేది కాదు.
అత్యవసర పరిస్థితుల్లో ఆ dllలు మెయిలు ద్వారా కూడా పంపవచ్చేమే.. మరోసారి
టూ హెల్ విత్ టీఓఎస్.

సుభవార్త ఏంటంటే, నేను మొన్న ఒక చుట్టాలింటికి వెళ్లి నప్పుడు, అక్కడ
వారికి విస్తా వుంది.
వెంటనే నేను కంట్రోలు పానల్ లో తెలుగు ఎనేబులు చేసి, టైపు చేయడం మొదలు
పెట్టాను.(Inscript కీబోర్డు)
ఎటువంటి తిరకాసూ లేదు.

- రాకేశ్వర రావు

On Jan 10, 2:28 pm, "చైతన్య క్రిష్ణ పాటూరు"

రాకేశ్వర రావు

unread,
Jan 12, 2008, 11:55:02 PM1/12/08
to తెలుగుబ్లాగు
అన్నటు 'కృష్ణ' అని వ్రాయడం సరిగదా..

On Jan 10, 2:28 pm, "చైతన్య క్రిష్ణ పాటూరు"

చైతన్య క్రిష్ణ పాటూరు

unread,
Jan 13, 2008, 6:49:52 AM1/13/08
to తెలుగుబ్లాగు
రాకేశ్వర రావు గారు,

కృష్ణ అనే రాస్తారు. కానీ పలికే పదానికి, రాసే పదానికి తేడా ఎందుకని
క్రిష్ణ అని వాడుతున్నాను
Reply all
Reply to author
Forward
0 new messages