మొజిల్లా ఉత్పత్తుల తెలుగింపుకి అధికారిక చర్చావేదిక

4 views
Skip to first unread message

వీవెన్

unread,
Dec 11, 2014, 5:33:21 AM12/11/14
to Firefox_Te, dev-l...@lists.mozilla.org
ఫైర్‌ఫాక్స్ తెలుగు వీరులకు,

ఈ రోజుల్లో మొజిల్లా అంటే ఫైర్‌ఫాక్స్ ఒక్కటే కాదు. ఫైర్‌ఫాక్స్‌తో బాటు Firefox OS, ఆండ్రాయిడ్లో ఫైర్‌ఫాక్స్, మొజిల్లా వెబ్ సైట్లు, మార్కెట్‌ప్లేస్, ఇంకా ఫైర్‌ఫాక్స్ ఖాతాలు వంటి సేవలూ, వెబ్‌మేకర్ వంటి ప్రాజెక్టులూ, ఇలా ఎన్నో.

మనం వీటన్నింటినీ తెలుగులోకి తీసుకురావడానికి, మంచి సమన్వయం అవసరం. Firefox_Te అనే గూగుల్ గ్రూపు ఉన్నా అది స్తబ్దుగా ఉంది. అందునా అన్ని మొజిల్లా ప్రాజెక్టుల స్థానికీకరణనూ ప్రతిబింబించాలి కాబట్టి, తతిమా భాషా సమూహాల రీతిలోనే మనకీ మొజిల్లా తెలుగు స్థానికీకరణ జట్టుకి తగ్గ మెయిలింగు లిస్టు ఉంటే బాగుంటుంది అనుకున్నాం.

మొజిల్లా ప్రాజెక్టుల తెలుగీకరణలో ఎదుర్కొనే సమస్యలను చర్చించి పరిష్కారాలు కనుక్కోడానకీ, అనువాదాల పురోగతిని నివేదించడానికీ సమీక్షించుకోడానికీ, అనువాద అవకాశాలను తెలియజేయడానికీ, ఔత్సాహికులకు చేయూత ఇవ్వడానికీ, మొజిల్లా తెలుగు స్థానికీకరణ చర్చా వేదిక కోసం mozilla.dev.l10n.te అనే మెయిలింగు లిస్టును మొజిల్లా లిస్టు సర్వరులోనే ఏర్పాటు చెయ్యమని కోరాము. అదిప్పుడు చేతనమయ్యింది. లిస్టు పేజీని ఇక్కడ చూడవచ్చు: https://lists.mozilla.org/listinfo/dev-l10n-te (అక్కడే లిస్టులో చేరవచ్చు కూడా.)

రండి, అందరం కలిసి మొజిల్లా ఉత్పత్తులను తెలుగు లోనికి తీసుకువద్దాం!

ఇట్లు,
వీవెన్.

Reply all
Reply to author
Forward
0 new messages