ఈ జంతువు తరచుగా ఉత్తర అమెరికాలో దొరుకుతుంది. ఇవి చాలా చిలిపిగా, తుంటరిగా ఉంటాయి: భారతదేశంలో కోతులు ఎలాంటి అల్లరి చేస్తాయో ఇవి కూడా అలాంటి అల్లరి చేస్తాయి. కొన్ని నగరాల్లో ఇవి చెత్త బుట్టల్లో కూడా తిండి కోసం వెతుకుతాయి, కాని అడవిలో మామూలుగా చేపలను పట్టుకుని తింటాయి.
దీనికి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది: దేన్నైనా తినే ముందు, ప్రవహిస్తున్న నీళ్ళలో చేతులతో తన తిండి కడుగుతుంది. చాలా భాషల్లో దీని పేరు ఈ అలవాటును సూచిస్తుంది. జర్మను భాషలో దీన్ని
వాష్ బ్యార్ అంటారు, మరి జపనీయ భాషలో దీన్ని
అరాయిగుమా అంటారు. ఈ రెండు పదాలకు "
కడుగు ఎలుగు బంటి" అనే అర్థం ఉంది, కాని ఇది ఎలుగుబంటంత పెద్దది కాదు కాబట్టి,
కడుగుపిల్లి అనే పదం సరైనదని నాకు అనిపిస్తోంది. మీ అభిప్రాయాలను తప్పకుండా తెలపండి.