పార్కింగుకి తెలుగు పదం?

49 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Oct 24, 2010, 12:33:10 AM10/24/10
to తెలుగుపదం
మామూలుగా అయితే వాహనాలను నిలుపు స్థలము అంటాం. కానీ పార్కు చేయడమంటే, వాహనాన్ని ఒక చోట నిలిపి కొంతసేపు దాన్ని వదిలివెళ్ళడం.

  • park (క్రియ): నిలుపివుంచు, నిలుపు. You cannot park the car here. ఇక్కడ కార్లని నిలుపకూడదు.
ఇలా నిలుపుతో సరిపెట్టేసుకోవచ్చా?

  • parking (నామవాచకం):
    1. వాహనాన్ని కొంతసేపు వదిలివెళ్ళే నిమిత్తం ఒక చోట నిలిపివుంచే చర్య. No Parking.
    2. వాహనాలను నిలిపి ఉంచే స్థలము. నా కారు పార్కింగులోనే ఉండిపోయింది.

ఈ వాడుకల కొరకు ఏమైనా కొత్త/పాత తెలుగు పదాలును సూచించగలరా?

నెనరులు,
వీవెన్.

Akshay Regulagedda

unread,
Oct 24, 2010, 3:32:44 AM10/24/10
to telug...@googlegroups.com
వీవెన్ గారు,

అంటే నిలపడమే కాదు, నిలిపి వదిలేయడం అన్న మెలుకువ కూడా వుందని మీరు అంటున్నారా? 

ఎందుకడుగుతున్నానంటే, Parking అన్న పదాన్ని ఇంగ్లీషీతర ఐరోపా భాషల్లోకి అనువదించేటపుడు నిలుపడం అన్న భావాన్నే మామూలుగా అనువదిస్తారు. ఉదాహరణకు, ఫ్రెంచిలో parking అన్న పదాన్ని ఒక్కోసారి stationnement అని అనువదిస్తూంటారు (మామూలుగా parking ని parkingయే అంటారనుకోండి. అది వేరే విషయం)

భారతీయ భాషలలో కూడా మనము ఇదే సరళిని చూడగలము. గూగులేశ్వరుడు no parking ని హిందీలోకి ఇలా అనువదించాడు: वाहन खड़ा करना मना है

खडा అంటే నిలుపడమే కదా. 

shabdkosh.comలో पार्किंग తో పాటు, गाडी स्थान అని ఇంకో నానార్థం సూచించారు. నా అభిప్రాయంలో ఇది అంత సరిపోయిన అనువాదం కాదు; parking అన్నది కేవలం నామవాచకమే కాదు, నామవాచకంగా మార్చగలిగిన క్రీయావాచకం ('gerund') మీరు సూచించిన సందర్భాలలో వాడలేము. అయితే, అనూహ్యంగా వారు पड़ाव అని ఇంకో నానార్థం ఇచ్చారు. అనూహ్యం ఎందుకంటే, parking అన్న సందర్భంలో నేను ఈ పదాన్ని ఎప్పుడూ వినలేదు; మామూలుగా पड़ावని దశ లేదా మజిలీ అన్న అర్థముతో వాడుతారని నేను అనుకున్నాను. రెండోది ఆ పదానికి వారు సూచించిన ఉచ్ఛరణ సలహా: paṛāva. ड కాస్తా ṛ గా ఎలా మారిందో హిందీలో ప్రావీణ్యమున్న పెద్దలే చెప్పాలి. అలాగే, ఈ పదానికి సాంస్కృతాంధ్రానువాదం సరిపోతుందో అన్నది కూడా మీరే చెప్పాలి. 

వివిధ భాషలలో నేను సేకరించిన నానార్థాలివి:-

Français

parking

stationnement

Español

aparcamiento

estacionamiento

parking

aparcamento

Italiano

parcheggio

हिन्दी

पार्किंग

अड्डा

स्टैंड

पड़ाव (m)

पार्किंग (m)

गाड़ी स्थान (m)

ఈ పట్టిక బట్టి మనకు రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి:-
1) Parkingని ప్రపంచ భాషలలో పార్కింగ్ అనే అనువదిస్తున్నారు
2) వేరే భాషలలోకి అనువదించెటప్పుడు నిలుపుట అన్న భావాన్నే ఎక్కవగా అనువదిస్తున్నట్టున్నారు. 

ఇక సలహాలు, సూచనలు మీ వొంతు. :)

అక్షయ్

24 అక్టోబర్ 2010 12:33 సా న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

phani deep prayaga

unread,
Oct 24, 2010, 2:53:36 PM10/24/10
to తెలుగుపదం

నిలుపుదల అంటే ఎలా ఉంటుంది?

phani deep prayaga

unread,
Oct 24, 2010, 3:41:02 PM10/24/10
to తెలుగుపదం

paṛāva. ड కాస్తా ṛ గా ఎలా మారిందో హిందీలో ప్రావీణ్యమున్న పెద్దలే
చెప్పాలి.


నాకు హిందీ లో అంత ప్రావీణ్యం లేదు కాని
మీరు ड़ ,ड ల విషయం లో తొట్రు పడ్డారేమో అనుకుంటున్నను
ड మన తెలుగు డ కి సమానం (ఉద: अंडा=గుడ్డు,डालो=పొయ్యి, कुण्ड=కుండం)
(ఇది plosive గాలి కొంత సేపు ఆపేస్తాం)
దీన్ని ఇంగ్లీష్ లో d కింద రాస్తారు


ड़ ని కొంత కొంత మంది కొన్ని రకాలుగా పలకటం విన్నాను
----- కొందఱు ర కి డ కి మధ్యలో పలుకుతారు(ఉదా: puri पुड़ी
=పూరీ , bara बड़ा =పెద్ద, garhगढ़ =కోట, chattisgarh lo laagaa )
(flap గాలి ఆపం)
----- కొంత మంది ఇంచు మించు డ లా పలుకుతారు
దీన్ని ఇంగ్లీష్ లో r కింద రాస్తారు

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Oct 24, 2010, 9:51:58 PM10/24/10
to telug...@googlegroups.com
<< park (క్రియ): నిలుపివుంచు, నిలుపు. You cannot park the car here. ఇక్కడ కార్లని నిలుపకూడదు.  >>
<< parking (నామవాచకం):
    1. వాహనాన్ని కొంతసేపు వదిలివెళ్ళే నిమిత్తం ఒక చోట నిలిపివుంచే చర్య. No Parking.
    2. వాహనాలను నిలిపి ఉంచే స్థలము. నా కారు పార్కింగులోనే ఉండిపోయింది. >>
park (v.) = ఆపిపెట్టు, "ఆపెట్టు", parking (n.) = ఆపెట్టకం/ఆపెటకం?
 
...అంటే ఎలా ఉంటుంది? ("నిలబెట్టు" అన్న పదం ఉంది కనుక మఱో పదం నిష్పాదిస్తే మంచిదని, "ఆపి పెట్టడం" అన్న రాయలసీమ మాండలీక ప్రయోగం (?) "అట్టిపెట్టడం" అన్న కోస్తాంధ్ర మాండలీక ప్రయోగానికి సమానార్థంలో ఉంటుందని... ఆ రెండింటినీ కలిపి "ఆపెట్టు" = ఆపి + ఎట్టు (లేదా ఆపి+పెట్టు) అన్న అర్థాన్వయం సులువుగానే ఉంటుందనిపించింది.)
 
<< paṛāva. ड కాస్తా ṛ గా ఎలా మారిందో >>
రడయోరభేదః అన్న సూత్రమొకటుంది. ర-డల నముడ (రడయోః) అభేదముండునని అర్థము. (హౌరా/హౌడా వంటివి అలా వచ్చినవే. మన దేశంలో డకార ప్రయోగం చేసే లడ్కా/లడ్కీ వంటి చాలా పదాలకి పాకిస్తాన్‌లో రకార ప్రయోగమే చేస్తారని చదివాను గతంలో.) రలయోరభేదః (ఛందోసూత్రాలలో ర-ల యతి గుఱించిన చోట ఎక్కడో చూసాను), బవయోరభేదః (బెంగాలీ, కళింగ భాషాప్రయోగాల్లో కనిపిస్తుంది) వంటి ఇతరాలు కూడా ఉన్నాయని తెలుసు కానీ వీటికి ఆధారభూతమైన సూత్రం వ్యావహారిక ప్రయోగమా, వ్యాకరణపరమైన సూత్రమా అన్నది తెలియదు. పెద్దలెవఱయినా చెప్పాలి.
 
విధేయుడు,
నచకి
 
--
http://forthesociety.blogspot.com/
http://nachaki.wordpress.com/
http://kirandotc.blogspot.com/

"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"

– Young Oxfam Poster

ANANDASWARUP GADDE

unread,
Oct 25, 2010, 12:08:20 AM10/25/10
to telug...@googlegroups.com
నేను అప్పుడప్పుడూ parking place కు 'కారు ఆపేచోటు' అంటూ ఉంటాను.

2010/10/25 NaChaKi (Kiran Chakravarthula) <email4...@gmail.com>
<< park (క్రియ): నిలుపివుంచు, నిలుపు. You cannot park the car here. ఇక్కడ కార్లని నిలుపకూడదు.  >>
<< parking (నామవాచకం):
    1. వాహనాన్ని కొంతసేపు వదిలివెళ్ళే నిమిత్తం ఒక చోట నిలిపివుంచే చర్య. No Parking.
    2. వాహనాలను నిలిపి ఉంచే స్థలము. నా కారు పార్కింగులోనే ఉండిపోయింది. >>
park (v.) = ఆపిపెట్టు, "ఆపెట్టు", parking (n.) = ఆపెట్టకం/ఆపెటకం?
 
...అంటే ఎలా ఉంటుంది?

 

Kiran Kumar Chava

unread,
Oct 25, 2010, 1:05:44 AM10/25/10
to telug...@googlegroups.com
కన్నడ వారు నిల్తాణ అని అంటున్నట్టు గుర్తు.

----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog




Akshay Regulagedda

unread,
Oct 25, 2010, 1:44:36 AM10/25/10
to telug...@googlegroups.com
< ----- కొందఱు ర కి డ కి మధ్యలో పలుకుతారు(ఉదా: puri पुड़ी
=పూరీ , bara बड़ा =పెద్ద, garhगढ़ =కోట, chattisgarh lo laagaa )
 
< paṛāva. ड కాస్తా ṛ గా ఎలా మారిందో >>
రడయోరభేదః అన్న సూత్రమొకటుంది. ర-డల నముడ (రడయోః) అభేదముండునని అర్థము. (హౌరా/హౌడా వంటివి అలా వచ్చినవే. మన దేశంలో డకార ప్రయోగం చేసే లడ్కా/లడ్కీ వంటి చాలా పదాలకి పాకిస్తాన్‌లో రకార ప్రయోగమే చేస్తారని చదివాను గతంలో.) రలయోరభేదః (ఛందోసూత్రాలలో ర-ల యతి గుఱించిన చోట ఎక్కడో చూసాను), బవయోరభేదః (బెంగాలీ, కళింగ భాషాప్రయోగాల్లో కనిపిస్తుంది) వంటి ఇతరాలు కూడా ఉన్నాయని తెలుసు కానీ వీటికి ఆధారభూతమైన సూత్రం వ్యావహారిక ప్రయోగమా, వ్యాకరణపరమైన సూత్రమా అన్నది తెలియదు. పెద్దలెవఱయినా చెప్పాలి.

చాలా ఆసక్తి కరమైన అంశాలు, ప్రస్తావించినందుకు కృతజ్ఞతాభివందనలు.  నిజమే, పాకిస్తాన్ లో రకార ప్రయోగం చేస్తారన్నది నేనూ ఎన్నో సార్లు గమనించాను; పాకిస్థానీ మిత్రులు ఉర్దూని రోమన్ లిపిలో ప్రతిలేఖించినప్పుడు बडा ('పెద్ద') ని bara అని రాస్తూవుంటారు. డకార ప్రయోగానికి అలవాటు పడిన నాకు, ఒక్కోసారి వాళ్ళు రాసేది అర్థము అవదు కూడా! :)

అక్షయ్

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Oct 25, 2010, 1:49:43 AM10/25/10
to telug...@googlegroups.com
ఆపి(ట్టే)పెట్టును ఆపెట్టు గా చెయ్యటం నాకు బాగోలేదు.

Mohamed Pasha

unread,
May 30, 2020, 10:18:53 PM5/30/20
to తెలుగుపదం
నిల్దానం

Subbachary Pulikonda

unread,
May 31, 2020, 12:13:39 AM5/31/20
to telug...@googlegroups.com
బండ్లనిలవ. అని అనువాదం చేసుకోవచ్చు.

On Sun, 31 May 2020 at 7:48 AM, Mohamed Pasha <mohame...@gmail.com> wrote:
నిల్దానం

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugupadam/58d20975-4fb5-4d3e-b4c2-c2af63554e8b%40googlegroups.com.
--
Prof. P. Subbachary Head, Department of Folklore and Tribal Studies Farmer Dean of Social Sciences Dravidian University Kuppam 517426 Sent from Gmail Mobile

Vasu Valluri

unread,
Jun 3, 2020, 8:42:41 PM6/3/20
to telug...@googlegroups.com
మహమ్మద్ పాషాగారు / సుబ్బాచారిగారు నమస్తే!
మహమ్మద్ పాషాగారు చెప్పిన పదానికి (నిల్దానం) మూలాలు అర్ధం కావటం లేదు. 
ఇక సుబ్బాచారిగారు చెప్పిన పదం - బండ్లనిలవ. బండ్ల వరకు బాగానే ఉన్నా నిలవ అనే పదం మనకు నిలువచేసుకోవటం స్ఫురింపజేస్తుంది. ఇక్కడ అది సరి కాదనుకుంటాను.
ఇది వరకు గుర్రపుశాల, ఏనుగులశాల, రధశాల, చెరసాల, పాఠశాల, వంటి పదాలను వాడేవారు. కానీ వాటికి పైకప్పు ఉండేది. పైకప్పు ఉండని ప్రహరీ మాత్రమే ఉన్న వాటిని దొడ్ది అనేవారు - పందులదొడ్డి, గొర్రెలదొడ్డి వంటివి. కానీ ఇదే పదాన్ని మనం బహిర్భూమి అనే అర్ధంలోనూ వాడాము.
కానీ
garage : ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008    Report an error about this Word-Meaning
  • వాహనశాల, (మరమ్మతులు చేసే) కార్ఖానా.
కాబట్టి దీనిని వాడలేము

stable for horses. = అశ్వకటి
pigsty = పందులదొడ్డి.
Sheepcote, Sheepfold= గొర్రెల దొడ్డి 
ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008    చెప్పిన పదం parking place = (వాహనాలు) నిలిపే చోటు.
ఇది బాగానే ఉంది కానీ ఇప్పుడు మనం  ఆ ఆంగ్ల పదాన్ని విశ్లేషిద్దాము - ఇది park అనే పదం నుండి వచ్చింది. పార్క్ అంటే వివిధ నిఘంటువులు ఈ విధంగా నిర్వచించాయి. ఆంటే అప్పటికే అలా వాడే వారు:
park : ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008    Report an error about this Word-Meaning
n.
  • తోట, ఉద్యాన(వన)ం, పచ్చిక మైదానం.
v.
  • నిలుపు, ఉంచు.
Park : శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972    Report an error about this Word-Meaning
n. 
  • ఉపవనము, శృంగారవనము, ఉద్యానవనము, a piece of ground enclosed and kept for recreation, pleasure ground, pleasure garden.
Park : శాస్త్ర పరిభాష, వ్యవహారిక కోశము (దిగవల్లి వెంకట శివరావు) 1934    Report an error about this Word-Meaning
  • (పార్కు); ఉద్యానవనము.
  • ఉద్యానవనము.

ఈ నేపధ్యంలో
వాహనాలమజిలీ
వాహనమజిలీ
వాహనవిడిది
బండ్ల మజిలీ
బండ్లవిడిది
అనేపదాలు అర్ధవంతంగా ఉంటాయి
ధన్యవాదాలు
 




--
Best Regards
Vasu
9392447590
9849271701

Disclaimer:

This email and any files transmitted with it are confidential and intended solely for the use of the individual or entity to whom they are addressed. If you have received this email in error please notify the system manager. This message contains confidential information and is intended only for the individual named. If you are not the named addressee you should not disseminate, distribute or copy this e-mail. Please notify the sender immediately by e-mail if you have received this e-mail by mistake and delete this e-mail from your system. If you are not the intended recipient you are notified that disclosing, copying, distributing or taking any action in reliance on the contents of this information is strictly prohibited.

Vasu Valluri

unread,
Jun 3, 2020, 8:47:43 PM6/3/20
to telug...@googlegroups.com
ఇంకొక పదం:
బండ్లబస

Vasu Viswanadha

unread,
Jun 3, 2020, 10:48:36 PM6/3/20
to telug...@googlegroups.com
మజిలీ అన్యదేశ్యం కాబట్టి ఈక్రొత్తపదంలొ అదిలేకుండావుంటే బాగుంటుందనిపిస్తుంది

వాసు

Veerabhadram Mantha

unread,
Jun 3, 2020, 10:48:36 PM6/3/20
to telug...@googlegroups.com
నిల్దాణ అన్న పదం కన్నడలో వాడుకలో వుంది.

అలా మనం తెలుగులో నిలు+తావు = నిల్దావు వాడుకోవచ్చా?
నిల్దావు = నిలిపే తావు(చోటు)

Vasu Valluri

unread,
Jun 5, 2020, 5:40:29 AM6/5/20
to telug...@googlegroups.com
మరైతే బండ్లబస అనటానికి అభ్యంతరం లేదనుకుంటాను.

balaji marisetti

unread,
Jun 5, 2020, 11:02:30 AM6/5/20
to telug...@googlegroups.com
ఉత్తిగ “తావు” అంటే సరిపోతుందనుకుంట

--
:-)balaji

Karthikeya Buddhiraju

unread,
Aug 11, 2020, 1:56:42 PM8/11/20
to తెలుగుపదం
నిలుదావు నిల్దావు పదములు బాగుగానున్నవి.
Reply all
Reply to author
Forward
0 new messages