నమస్కారాలు. అందరూ క్షేమమని తలుస్తున్నాను.
ఉన్నతవిద్యావ్యవస్థల్లో - జాతీయస్థాయిలో - పరిశోధనారంగంలో ప్రస్తుతం కీలకమైన పాత్రపోషిస్తున్న అంశాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
UGC-CARE listed Journal -అనే పదబంధానికి తెలుగు సమానార్థకాన్ని ఉపయోగించాలని ప్రయత్నం.
నా ప్రయత్నం:
UGC (University Grants Commission) = "విశ్వవిద్యాలయనిధుల సంస్థ"
CARE (Consortium of Academic and Research Ethics) = "విద్యా మరియు పరిశోధన విషయక నైతికనియమావళీ సహయతాసంఘం"
List = వారి "జాబితా"
Journal = పరిశోధన పత్రిక
"విశ్వవిద్యాలయనిధుల సంస్థ - విద్యా మరియు పరిశోధన విషయక నైతికనియమావళీ సహయతాసంఘం" వారి జాబితాలో చేరిన పరిశోధనపత్రిక
సూచనలు తెలియజేయగలరు.