*”తరగని రసాయనశాస్త్ర పరిశోధనల కడలి - ప్రగతికి పస గల ప్రాథమిక విద్యయే కీలకం అంటున్న కొడాలి”*
__________________
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ తెలుగు రసాయన శాస్త్రవేత్త గారు , అంతగా అవకాశాలు లేనివారు కూడా అవకాశాలు అందిపుచ్చుకుని పైకి రావాలంటే వారికి ప్రాథమిక విద్య సరియైన తీరులో అందాలని అంటారు.
ఆంగ్ల మాధ్యమంలో చదువు నేర్వడానికి, ఆంగ్ల భాషను నేర్వడానికి గల తేడాలను జనాలు తెలుసుకుని చైతన్యవంతులు అవ్వాలని వీరి గట్టి కోరిక.
_____________________
లిపిడ్స్ (lipids) రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ‘*AOCS సుపెల్కో/నికోలస్ పెలిక్ రీసెర్చ్ అవార్డు'* ని
2024లో ఆయన పొంది, ఈ గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయ సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించడం తెలుగువారు అందరికీ గర్వ కారణం.
ఈ 'లైఫ్ టైమ్ అచీవ్మెంట్' అవార్డును 1964 నుండి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 62 మంది శాస్త్రవేత్తలు మాత్రమే అందుకున్నారు. వీరు 60వ వ్యక్తి. వీరిలో ముగ్గురు నొబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఉన్నారు.
_______________________
అంతర్జాతీయ శాస్త్రపరిశోధన రంగంలో తన పేరు మీద 30 పేటెంట్లు కలిగిన వీరు, 80కి పైగా ప్రచురణలు, పుస్తక అధ్యాయాల రచన , ‘ట్రాన్స్ ఫ్యాట్స్' (trans fats) పై రెండు పుస్తకాల సంకలనం
మొదలైనవి చేశారు.
_________________________
ఈ మిన్నియాపాలిస్ (అమెరికా) నివాసి కి రన్నింగ్, బైసైక్లింగ్, కానోయింగ్ (పడవ ప్రయాణం) మరియు హైకింగ్ (పర్వతారోహణ) వంటి వ్యాపకాలపై
మంచి ఆసక్తి. జ్ఞాన సముపార్జన, ఉల్లాసాల కోసం ప్రపంచవ్యాప్తంగా బాగా పర్యటిస్తుంటారు కూడా,
చేవ కలిగిన ఈ 74 సం.ల తెలుగాయన.
——————————————-
ప్రపంచ ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త, అమెరికా లోని మిన్నెసోటా విశ్వవిద్యాలయము (యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా)లో జీవ ఉత్పత్తులు(బయోప్రొడక్ట్స్),
జీవ వ్యవస్థల (బయోసిస్టమ్స్) సాంకేతిక యంత్రశాస్త్ర (ఇంజినీరింగ్) విభాగంలో అనుబంధ ఆచార్యులు (అడ్జంక్ట్ ప్రొఫెసర్) అయిన *డా.ధర్మ కొడాలి గారు,* *”ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక విద్య - కష్టనష్టాలు”* అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం, 11-04-2026, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు.
కార్యక్రమంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs ______________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================