పిలుపు / తెలుగు కూటమి - రచ్చబండ / 14-03-2026

10 views
Skip to first unread message

రామప్రసాద్ పురాణం

unread,
Mar 11, 2026, 1:14:57 PM (3 days ago) Mar 11
to తెలుగు మాట
ప్రియమైన నేస్తాలకు, 

*”ప్రగతిశీల భావజాల సాహిత్య భాస్కరుడు ”*
__________________
మనుగడకై సాగే పోరాటాలు ఎవరికివారు ముక్కలు ముక్కలుగా కాకుండా కలిసికట్టుగా ముందుకు సాగితేనే పీడనను అరికట్టి, మెరుగైన బతుకు బతుకవచ్చని వీరి గట్టి నమ్మకం.
__________________
తెలుగు జానపద కళలు , సాహిత్యము , సంగీతము , సంగీత వాద్యాలపై వీరికి మక్కువ ఎక్కువ. “తెలుగులో మాండలిక కథాసాహిత్యం” పై పరిశోధన చేసి , అదే పేరుతో పుస్తకం గా ప్రచురించారు.
_____________________
*ఆకాశపు దారులెంట* అన్న కవితల సంకలనం,
జానపద చారిత్రిక గేయ గాథలు, తొవ్వ ముచ్చట్లు - ఏడు భాగాలు(జయధీర్ తిరుమలరావు), యుద్ధ వచనం (జూలూరి గౌరీశంకర్),రాయలసీమ:సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), అగమ్య గమ్యాలు : ఒప్పంద కార్మికుల వలసల చరిత్ర (ముకుంద రామారావు) మొదలైన పలు ప్రఖ్యాత రచయితల సంచలనాత్మక పుస్తకాలకు సంపాదకత్వం చేశారు.
_______________________
ఎంపిక చేసిన వేమన పద్యాలపై వ్యాఖ్యానం,”వేమన దారిలో,” “సమకాలీనం” పేరుతో కథా విమర్శపై వ్యాస సంపుటి , వీరి ఎన్నదగిన రచనలు.
——————————————-
తమ స్వీయ సంపాదకత్వంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని 25 మంది ప్రముఖ విమర్శకులతో *బహుళ (సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు)* , పలు ప్రజాసంఘాలకు చెందిన 33 మంది బుద్ధిజీవులతో వ్యాసాలు రాయించి *యాభై ఏళ్ళ విరసం పయనం - ప్రభావం* అన్న రెండు పుస్తకాలు వెలువరించడం వెనుక వీరి రెండు సంవత్సరాల అవిరళ కృషి ఉన్నది.
—————————————
తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో 35 సం.లు సంస్కృతం , తెలుగు పాఠాలు చెప్పిన విశ్రాంత ఆచార్యులు,
*ఎ.కె.ప్రభాకర్ గారు,* *” ముందు తరాలకు తరగని తెలుగు ”* అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం, 14-03-2026, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు.

కార్యక్రమంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs
______________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================


Murthy krishnalanka

unread,
Mar 11, 2026, 8:54:57 PM (2 days ago) Mar 11
to రామప్రసాద్ పురాణం, తెలుగు మాట

అయ్యా,
పొన్నరం (వీడియొ) కూడ పెట్టండి.

మీ,
కె. మూర్తి. 


--
మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది
 
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు telugumaata...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.
 
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugumaata/CALD8AKKCYNRX2t-TAhXoi8xmC0ATYWD2MOSurijw0gMsUe7yMw%40mail.gmail.com.

రామప్రసాద్ పురాణం

unread,
Mar 11, 2026, 11:15:04 PM (2 days ago) Mar 11
to Murthy krishnalanka, తెలుగు మాట
అయ్యా, 

తప్పకుండా. అది కుదింపులో ఉన్నది. 

మీ 
పురాణం రామప్రసాద్
Reply all
Reply to author
Forward
0 new messages