ఈరోజు మరపురాని రోజు. మహేష్ (లండన్) గారితో పరిచయమైన రోజు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి బర్మాలో నేను చేసిన రాసిన వీడియోలు పుస్తకాలను ఒక క్రమ పద్ధతిలో పెట్టి పవర్ ప్రజెంటేషన్ చేయాలి. అది నాకు చేయడం రాదు. కోదండ రామయ్య గారు తెలుగు కూటమి సభ్యులలో ఎవరైనా చేస్తారా అని ఒక ఊసుపెట్టారు. దానికి మహేష్ గారు ఎవరు చేయకపోతే నేను చేస్తానని అయితే వారితో నాకు పరిచయం లేదని ఊసుపెట్టారు. నేను వారికి వాట్సాప్ లో నా ఫోన్ నెంబరు పంపాను. వారు నాకు ఫోన్ చేసి చాన్నాళ్లుగా మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను పరిచయం లేక మాట్లాడలేకపోయాను అని అన్నారు. నేను కూడా లండన్ లో తెలుగు పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నాను నాకు అనేక సందేహాలు ఉన్నాయి తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. అవి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని చాన్నాళ్లు అనుకుంటున్నాను. ఈరోజు ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. నాకు కూడా ఎగిరి గంతేసినంత పని అయింది. లండన్ లోని తెలుగు పిల్లలకి కూడా ఏదో ఉడతా భక్తిగా సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు మురిసిపోయాను.
--
మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు telugumaata...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugumaata/CAJEjRzmS6113sRjNp%3D%2BqyrxTG4YXrB7UpE0g%3DbWyUP%3DJ1dOTEA%40mail.gmail.com.