ఇద్దరు ప్రముఖ తెలంగాణా అవధానులు

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Dec 7, 2025, 9:20:13 PM (5 days ago) Dec 7
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY

ఇద్దరు ప్రముఖ తెలంగాణా అవధానులు

1-తీలంగాణకవి, బహుభాషా కోవిదుడు,ఆకతీయ సభా  సమ్రాట్ -కవికోకిల శ్రీఇందారపు కిషన్ రావు 

ఇందారపు కిషన్ రావు (1941 జూలై 4 - 2017 జూన్ 8) ప్రముఖ అవధానికవి, బహుభాషా కోవిదుడు. ఇతడు 80కి పైగా అష్టావధానాలు చేశాడు.

విశేషాలు

కిషన్‌రావు 1941 జూలై 4 తేదీన కమల, కేశవరావు దంపతులకు రెండో సంతానంగా ఆదిలాబాద్ జిల్లా తాండూరులో జన్మించాడు. ఇతనికి తెలుగుతోపాటు మరాఠీసంస్కృతంఉర్దూ భాషల్లో మంచి పాండిత్యం ఉంది. ఇతడు తాండూరులో ప్రాథమిక విద్యచెన్నూరులో పదో తరగతి వరకువరంగల్‌లో పీయూసీ చదివాడు.1966లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ., 1969లో ఎం.ఎ. డిగ్రీలు పొందాడు. ఆ తర్వాత "శేషాద్రి రమణ కవులు - జీవితం - సాహిత్యం" అనే అంశంపై కేతవరపు రామకోటిశాస్త్రి నిర్దేశకత్వంలో పరిశోధన చేసి 1987లో డాక్టరేట్‌ పట్టాను పొందాడు. కాశీ కృష్ణాచార్యులువానమామలై వరదాచార్యులుదివాకర్ల వెంకటావధానిసి.నారాయణరెడ్డిలకు ఇతడు ప్రియశిష్యుడు. ఇతడు ఉపాధ్యాయుడిగా తాండూరుసిర్పూర్నిర్మల్ లలో పనిచేసి తరువాత 1970లో ఉద్యోగరీత్యా వరంగల్లు జిల్లాహనుమకొండలో స్థిరపడ్డాడు. ఇతడు 1970 నుంచి 1987 వరకు వరంగల్‌లోని ఎల్‌బీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకునిగా, ఆ తర్వాత పదోన్నతిపై రీడర్‌గా పని చేసి 1999లో ఉద్యోగ విరమణ చేశాడు. ఇతని భార్య విమలాబాయి. వీరికి ఇద్దరు కుమారులు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ముగ్గురు కుమార్తెలు కరుణశ్రీ, పద్మశ్రీ, గీతాంజలి ఉన్నారు. ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ 2017జూన్ 8 తేదీన హైదరాబాదులో తన పెద్ద కుమారుడు శ్రీనివాసరావు ఇంటిలో మరణించాడు.[1]

రచనలు

1.    శ్రీనివాస శతకం

2.    ఋతు సంహారం

3.    వసంత సుమనస్సులు

4.    కవితా వసంతం

5.    సరస్వతీ వైభవం

6.    వాణీ విలాసము

7.    శేషాద్రి రమణ కవుల జీవితము - సాహిత్యము (పరిశోధక గ్రంథము)

8.    అవధాన లేఖ

9.    కాకతీయ వైభవం (రూపకం)

10.  ప్రతాప రుద్ర వైభవం (రూపకం)

11.  సామ్రాట్‌ గణపతి దేవ (రూపకం)

12.  రామప్ప (నృత్య రూపకం)

13.  పాటల పల్లకి

14.  భాషా చరిత్ర

15.  ఎం.ఎ. ఫైలాలజీ

16.  నవరస నాట్య గీతాలు

17.  కలిసి ఉంటే కలదు సుఖం (రేడియో నాటిక)

18.  విష్ యూ హ్యపీ న్యూఇయర్ (రేడియో నాటిక)

అవధానాలు

ఇతని అవధానాలలో సమస్య - దత్తపది - నిషిద్ధాక్షరి - వర్ణన - ఆశుకవిత - పురాణము - ఛందోభాషణము - తేదీలకు వారాలు - అప్రస్తుత ప్రశంస మొదలైన అంశాలు ఉన్నాయి. ఇతడు తాండూరు, ఖమ్మం, హైదరాబాదు, చెన్నూరు, హనుమకొండ, వర్ధన్నపేట, కాజీపేట, మంచిర్యాల, ఎల్కుర్తి, వరంగల్లు మొదలైన చోట్లే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలలా, అమెరికాలో తానా మహాసభలలోనూ అవధానాలు నిర్వహించాడు.[2] అవధానాలలో ఇతడు పూరించిన కొన్ని పద్యాలు :

·         సమస్య:

ఏడవ భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్

పూరణ :

కూడని కోర్కెయే మగని గోరుట యో యమధర్మరాజ! పూ
బోడి సుమంగళిత్వమునఁ బొల్పు వహించు ధరిత్రిలోన, నే
మేడలు మిద్దెలున్ నిధులు మెచ్చను, రాజ్యము లేదటంటు నే
నేడవ, భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్

·         దత్తపది:

కొంప - చెంప - కంప - రొంప పదాలతో వరకట్న దురాచారం గురించి.

పూరణ :

కొంపల్ గోడలు పుస్తె లమ్మి తుదకున్ గోచీయె దక్కంగ హృ
త్కంపంబందగ కూతుపెళ్ళి యగునో కాదో యటంచున్ మదిన్
చెంపల్ వేసుకొనేరు చూడ జనకుల్ ఛీఛీ భవం బేల పె
న్రొంపయ్యెన్ బ్రతుకెల్ల నిక్కము కుమారుల్ గాక కూతుళ్ళుగా

·         వర్ణన:

వసంతఋతువులో ప్రేయసీ వియోగాతురుని మనఃస్థితి

పూరణ :

శ్రీలు చిందెడి యీ వసంతము చింత గూర్చునె సుందరీ
బాలచంద్రుని దర్శనమ్మది బాణమై వెతగూర్చెడిన్
తాళలేనిక కోకిలమ్మల దౌష్ట్యకూజితముల్ వినన్
జాలమున్ విడనాడి వేగమె సౌఖ్య మీయగ చేరవే.

·         ఆశువు:

కృష్ణునికి, కృష్ణదేవరాయలకు పోలిక

పూరణ :

అష్టభార్యల పోషించె నపుడు శౌరి
రాయ లష్టదిగ్గజముల రమణ బ్రోచె
అతడు చక్రమ్ము చేబట్టి అరుల ద్రుంచె
రాజచక్రము తలవంచె రాయలకును

పురస్కారాలు , గుర్తింపులు

·         వరంగల్ జిల్లా అధికార భాషా సంఘం సభ్యుడు

·         వరంగల్ జిల్లా సాంస్కృతిక మండలి సభ్యుడు

·         తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక అవార్డు

·         తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం

బిరుదులు

·         కవికోకిల

·         కాకతీయ సభాసమ్రాట్

·         సాహితీ కిరీటి

·         శబ్దశిల్పి

2-అష్టావధాని,శతక రచయిత -శ్రీ  గండ్ర లక్ష్మణరావు

ఆధునిక తెలుగు సాహిత్య ప్రపంచంలో లబ్ధప్రతిష్ఠులైన తెలంగాణ సాహిత్యవేత్తలలో గండ్ర లక్ష్మణరావు ఒకడు. అష్టావధాని.

సాహిత్య సేవ

ఇతడు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహింపబడిన ప్రపంచ తెలుగు మహాసభలలో నిర్వాహక మండలి సభ్యునిగా పనిచేశాడు. విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభించిన జయంతిపత్రిక వెలిచాల కొండలరావు సంపాదకత్వంలో పునః ప్రారంభింపబడిన నాటినుండి సంపాదక మండలి సభ్యునిగా ఉన్నాడు. శ్రీభాష్యం పార్థసారథి స్థాపించిన కరీంనగర్ ఆది వరాహక్షేత్రసంబంధమైన సాహిత్య సేవలో పాలు పంచుకుంటున్నాడు. కరీంనగర్ సాహితీ గౌతమిసంస్థ వ్యవస్థాపకులలో ఒకడు. సినారె అవార్డుల కమిటీ సభ్యుడు. వేయిపడగలుపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందాడు. సాహితీరత్నబిరుదాంచితుడు.

రచనలు

·         నీవు (ఆదిపాద మకుట శతకము)

·         వర్తమాన సంధ్య (కవితా సంపుటి)

·         సాహితీ వనమాలి (సాహిత్య వ్యాసాలు)

·         ఒక పద్యం నేర్చుకుందాం (100 పద్యాలకు వ్యాఖ్యానం)

·         శివా! (శతకము)

·         శతద్రు (వచనకవిత్వము)

·         శ్రీ లక్ష్మీనరసింహ శతకము

·         భువన విజయము (రూపకము)

·         వెఱ్ఱిమానవుడు (ఖలీల్ జిబ్రాన్ కవిత అనువాదం)

·         ప్రస్తావన (పీఠికల సంపుటి)

·         పెగడపల్లి శ్రీరాజరాజేశ్వరా (శతకము)

·         తెలంగాణ పద్య కవితా వైభవం (తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ)

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-25-ఉయ్యూరు 

--
g2.jpg
i.jpg

SriRangaSwamy Thirukovaluru

unread,
Dec 7, 2025, 10:45:36 PM (5 days ago) Dec 7
to sahiti...@googlegroups.com
గండ్ర లక్ష్మణరావు - వరాహస్వామి క్షేత్రం నిర్మించినవారు శ్రీమాన్ శ్రీ భాష్యం విజయసారథి గారు. వీరు ప్రముఖ సంస్కృత పండితులు. ఆయన సంస్కృత కావ్యాలు బాగా గుర్తింపు పొందాయి. నేను కూడా వీరు స్థాపించిన పురస్కారాన్ని అందుకున్నాను. గండ్ర లక్ష్మణరావు గారు విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యంలో పరిశోధన చేశారు. ఆయన గత మూడు సంవత్సరాలనుండి అవధానం చేస్తున్నారు. 
ఇందారపు కిషన్ రావు గారు తమ పరిశోధన గ్రంథాన్ని సగమే ప్రచురించారు. 

--
You received this message because you are subscribed to the Google Groups "సరసభారతి సాహితీ బంధు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z9%2BF2Ai9Q25%3DK864NKd6%2BxrscDotCmRqSK3RvZGbpgY6g%40mail.gmail.com.

gabbita prasad

unread,
Dec 8, 2025, 6:19:20 AM (4 days ago) Dec 8
to sahiti...@googlegroups.com
గొప్ప సమాచారం 

Reply all
Reply to author
Forward
0 new messages