Sri Suresh Kolichala, my friend, also a member of BVP shared the following with me as part of the (Y)ugaadi /Samvatsaraadi greetings he sent to me.
Yesterday was (Y)ugaadi /Samvatsaraadi , the beginning of Chaitra maasa and Vasnta ritu also called as madhu maasa .
The text below the Youtube link is as follows :
Very proud to present the famous poem from Vasu Charitra, a much celebrated literary work of 16th Century by Sri Ramaraja Bhushanudu (Bhattumoorti).
A great concept to present it like a song, indeed!
Music arranged by my friend & composer GP Raviin, elevated the presentation setting a natural soothing mood to my tune which I set in Madhyamavati Raga.
Have a blessed Ugadi, everyone! Let this be a great new beginning in your life! Best wishes.
Here's the text of the Padyam along with word meanings & a summary.
లలనా జనాపాంగ వలనా వసదనంగ
తులనాభికాభంగ దోఃప్రసంగ
మలసానిల విలోలదళ సాసవ రసాల
ఫల సాదర శుకాలపన విశాల
మలినీ గరుదనీక మలినీకృత ధునీ క-
మలినీ సుఖిత కోకకులవధూక
మతికాంత సలతాంత లతికాంతర నితాంత
రతికాంత రణతాంత సుతనుకాంత
మకృత కామోద కురవ కావికల వకుల
ముకుల సకల వనాంత ప్రమోద చలిత
కలిత కలకంఠకుల కంఠకాకలీ వి-
భాసురము వొల్చు మధుమాస వాసరంబు!
వసంత ఋతువులోని ఒకానొక రోజు ఎలా ఉందో కవి రామరాజ భూషణుడు వసు చరిత్రలో వర్ణించిన విధం -
లలనాజన = స్త్రీజనం యొక్క / అపాంగ = క్రీగంటి చూపుల / వలన = చలనంలో / అవసత్ = నివసించే / అనంగ = మన్మథునితో / తులన = సమానమైనవారైన / అభిక = కాముకుల యొక్క / అభంగ = అంతరాయం లేని / దోఃప్రసంగము = కౌగిలింతల ముచ్చట్లు కలదీ
అలస = మెల్లగా వీచే / అనిల = గాలిచేత ( మందమారుతం చేత ) / విలోల = బాగా కదులుతున్న / దళ = చిగురాకులు కలవీ / స + ఆసవ = మకరందంతో కూడినవీ అయిన / రసాల = తియ్య మామిడి చెట్ల / సాదర = ఆదరంతో కూడిన / శుక = చిలుకల / ఆలాపన = ఆలాపాల చేత / విశాలము = విస్తారమైనదీ
అలినీ = ఆడ తుమ్మెదల / గరుత్ = రెక్కల / అనీక = సమూహం చేత / మలినీకృత = నల్లగా చేయబడిన / ధునీ = నదీ సంబంధమైన / కమలినీ = తామర తీగల్లో / సుఖిత = సుఖంగా ఉన్న / కోకకుల వధూకము = చక్రవాక స్త్రీలు కలదీ
అతికాంత = మిక్కిలి మనోహరాలైన /సలతాంత = పూలతో కూడిన / లతిక = తీగల / అంతర = లోపల / నితాంత = ఎడతెగని / రతికాంత = రతి భర్త ఐన మన్మథుని / రణ = యుద్ధంలో / తాంత = అలసిన / సుతనుకాంతము = స్త్రీ పురుషులు కలదీ
అకృతక = సహజమైన / ఆమోద = పరిమళం కల / కురవక = గోరంట పువ్వులు కలవీ / అవికల = విచ్చిన్నం కాని / వకుళ = పొగడ చెట్ల / ముకుళ = మొగ్గలు కలవీ అయిన / సకల = సమస్త / వనాంత = వన మధ్యంలో / ప్రమోద = సంతోషంతో / చలిత = సంచరిస్తున్న / కలిత = ఒప్పుగా ఉన్న / కలకంట = కోయిలల / కుల = సమూహం యొక్క / కంట కాకలీ = కంఠంనుండి వెలువడే మధుర ధ్వని చేత / భాసురము = ప్రకాశిస్తున్న / మధుమాస వసరంబు = వసంత ఋతువులోని ఒక దినం / పొల్చున్ = విలసిల్లుతున్నది.
వసంత ఋతువులోని ఒకానొక రోజు స్త్రీల కడగంటి చూపులు శృంగార రస ప్రేరితాలూ మన్మథోద్దీపకాలూ అయ్యాయి. కాముకులు స్వేచ్చగా క్రీడించారు. తియ్య మామిడి చిగురించి పండ్లు పండి ఫలరసాలు దొరికాయి. ఆ పండ్లను తిని చిలుకలు పలికాయి. నదులలో తమర తీగలు బాగ పూచాయి. వాటిని తుమ్మెదలు గుంపుగా కమ్ముకొన్నాయి. ఆ తమర తీగల్లో చక్రవాకాలు సుఖంగా ఉన్నాయి. పూ పొదరిండ్లలో స్త్రీ పురుషులు వినోదిస్తున్నారు. గోరంటలు పూచాయి. పొగడలు మొగ్గ తొడిగాయి. కోయిలలు మధుర ధ్వనులు చేసాయి.