Re: (తెలుగుపదం) Prediabetic = ప్రాగ్ మధుమేహి

16 views
Skip to first unread message

kvjeypore

unread,
Mar 12, 2015, 2:35:30 AM3/12/15
to telugupadam
ప్రాగ్ మధుమేహం అనకూడదు. ప్రాఙ్ మధుమేహం అనాలి. మ ముందర కవర్ల అనునాసికం ఙ వస్తుంది. వాఙ్మయంలాగ.


Sent from Samsung Mobile



-------- Original message --------
From: Marripoodi Mahojas <mahojasm...@gmail.com>
Date: 12/03/2015 11:25 (GMT+05:30)
To: telug...@googlegroups.com
Subject: (తెలుగుపదం) Prediabetic = ప్రాగ్ మధుమేహి


ఈ మధ్య ఈనాడు దినపత్రికలోఒకచోట ముందస్తు మధుమేహ స్థితి గలవారు అని వాడారు. వారు ఏం చెప్పదల్చుకున్నారో మొదట అసలేమీ అర్థం కాలేదు. కాసేపు ఆలోచించాక అది Prediabetic కి వచ్చిన తిప్పలని అర్థమైంది. కానీ ముందస్తు మధుమేహం అంటే Juvenile diabetes (బాల్యంలోనే వచ్చే మధుమేహం) అని అర్థం చేసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. Prediabetes ని వికిపీడియా ఇలా నిర్వచిస్తోంది :

Prediabetes is the medical stage in which not all of the symptoms required to label a person as diabetic are present, but blood sugar is abnormally high.[1] This stage is often referred to as the "gray area."

అంటే ఇంకా మధుమేహ లక్షణాలు ఇప్పుడే పూర్తిగా లేకపోయినా రక్తంలోని చక్కెర స్థాయిలు మాత్రం ఆరోగ్యవంతులకు ఉండాల్సినదాని కన్నా చాలా ఎక్కువగా కనిపిస్తూంటే అది మధుమేహానికి పూర్వస్థితి అంటారట.

దీన్ని మనం "మధుమేహ పూర్వస్థితి" లేదా "పూర్వమధుమేహం" అనొచ్చు ననుకుంటా. ఇలా అంటే చాలా బారుగా ఉంది. దీనికన్నా మూలాంగ్లపదమే క్లుప్తంగా ఉంది.

లేకపోతే "పదనిష్పాదన కళ" లో 89 వ పేజీ, 2 లైన్ ని అనుసరించి

ప్రాగ్ మధుమేహం = Prediabetes
ప్రాగ్ మధుమేహి = Prediabetic

అనాలి. అప్పుడు క్లుప్తంగానూ ఉంటుంది.

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Marripoodi Mahojas

unread,
Mar 12, 2015, 5:58:17 AM3/12/15
to telug...@googlegroups.com
@kvjeypore.... ప్రాఙ్మధుమేహం బావుందండీ.

తప్పు సరిద్దినందుకు కృతజ్ఞతలు.

12 మార్చి, 2015 11:53 [AM] న, kvjeypore <kvje...@gmail.com> ఇలా రాసారు :

kvjeypore

unread,
Mar 12, 2015, 12:41:10 PM3/12/15
to telugupadam
నిరాశజనకం తప్పని తెలుసు. 
పర్యటన లాగ పర్యటక అనకూడదా? 
Tourismకి పర్యటకుడు అని బూ.రా.ఆధునిక వ్యవహార కోశంలో ఇచ్చారు. 

Marripoodi Mahojas

unread,
Mar 12, 2015, 1:53:51 PM3/12/15
to telug...@googlegroups.com, kvje...@gmail.com

మా సంస్కృత మిత్రుడికి ఇప్పుడే ఫోన్ చేసి అడిగాను. చేసేవాడు అనే అర్థంలో అక ప్రత్యయం చేరినప్పుడు ఎక్కువశాతం సంస్కృత ధాతువుల పదాది అకారాలు దీర్ఘమవుతాయట. కొన్నిటికి వృద్ధి ఆదేశమవుతుందట. ఆయన ఇచ్చిన ఇతర ఉదాహరణలు :

వద - వాదకుడు
వచ - వాచకుడు
ధృ (ధర్) - ధారకుడు
హృ (హర్) - హారకుడు
తౄ - తారకుడు
దహ - దాహకుడు etc etc.

Venu Ch

unread,
Mar 12, 2015, 10:57:12 PM3/12/15
to telug...@googlegroups.com, kvje...@gmail.com
పర్యటన అనే మాట ఉంది.  ఇది  చేసేవాడు - పర్యటకుడు అవుతాడు కదా?

కానీ  ‘ పర్యాటకుడు’ అనే మాట ఎలా వచ్చిందో!  ఇదెంత ప్రాచుర్యం పొందిందంటే పర్యటకుడు అంటే  తప్పు  పదం అనిపించేంతగా.

--

Marripoodi Mahojas

unread,
Mar 13, 2015, 6:41:38 AM3/13/15
to telug...@googlegroups.com, kvje...@gmail.com
లేదండీ. పర్యాటకుడే కరెక్టు. చేసేవాడు అనే అర్థంలో మొదటి అచ్చు దీర్ఘం అవ్వాలి కనుక! 

Venu Ch

unread,
Mar 13, 2015, 7:00:14 AM3/13/15
to telug...@googlegroups.com, K V Ramana
‘పర్యాటకుడు’ అనే ప్రయోగం ఏ నిఘంటువుల్లోనూ కనపడదు.  ‘పర్యటకుడు’ అనే ఉంటుంది.

 

2015-03-13 16:11 GMT+05:30 Marripoodi Mahojas <mahojasm...@gmail.com>:
లేదండీ. పర్యాటకుడే కరెక్టు. చేసేవాడు అనే అర్థంలో మొదటి అచ్చు దీర్ఘం అవ్వాలి కనుక! 

--

Marripoodi Mahojas

unread,
Mar 13, 2015, 7:21:16 AM3/13/15
to telug...@googlegroups.com, kvje...@gmail.com
బహుసా రెండూ ఉన్నాయేమో! 

Venu Ch

unread,
Mar 13, 2015, 7:42:33 AM3/13/15
to telug...@googlegroups.com
పర్యాటకుడు అనే పదం  పత్రికా భాషానిఘంటువు లో మాత్రమే ఉంది.  ఈ నిఘంటువు
 పత్రికల వార్తల్లో ని  ప్రయోగాలనే  ఇస్తుంటుంది.  అందుకని  దీన్ని ప్రమాణంగా తీసుకోలేము.

కానీ   ప్రామాణిక నిఘంటువుల్లో మాత్రం  ‘పర్యటకుడు’ అనే ప్రయోగమే కనపడుతోంది.
 

On Fri, Mar 13, 2015 at 4:51 PM, Marripoodi Mahojas <mahojasm...@gmail.com> wrote:
బహుసా రెండూ ఉన్నాయేమో! 

--
Reply all
Reply to author
Forward
0 new messages