ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము (వికీసోర్స్ లో
s:ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము
) దాదాపు 435 పేజీల పాఠ్యీకరణ పూర్తి అయింది. 1910లో ముద్రించబడిన ఈ
పుస్తకం సులభంగా చదువుకోవటానికి, వెతకటానికి, అప్పటి పుస్తక సంబంధిత
సామాజిక పరిస్థితులు అర్థం చేసుకోటానికి (చివరిలోగల ప్రకటనలు) చాలా
వుపయోగపడుతుంది. ఇంకా అచ్చుదిద్దవలసినది, సమస్యాత్మకపేజీలు సరిచూడవలసిన పని
వున్నది. ముందలరోజులలో సహ సభ్యుల సహకారంతో పూర్తవుతుందని ఆశిస్తాను.
దాదాపు 7 నెలలుగా పాఠ్యీకరణలో ప్రముఖంగా సహకరించిన సుజాత గారికి, విక్రమ్
గారికి కృతజ్ఞతలు. దీని స్ఫూర్తితో ఇంకొన్ని పాఠ్యీకరణలు పూర్తయి వికీ
ప్రాజెక్టుల అభ్యున్నతిజరగాలని ఆశిస్తున్నాను--
అర్జున (
చర్చ) 16:16, 16 మార్చి 2013 (UTC)