కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం

13 views
Skip to first unread message

తెలుగు వీర

unread,
Dec 3, 2013, 9:35:53 PM12/3/13
to telug...@googlegroups.com, telug...@googlegroups.com
తెలుగు నెజ్జనులందరికీ నమస్కారాలు,

వచ్చేవారం తెలుగు వికీపీడియా పదో పుట్టినరోజు. ఈ శుభ సందర్భంగా తెలుగు వికీజనులందరూ కలిసి పండగ చేసుకోవాలని నిశ్చయించడమైనది. ఈ ఉత్సవాలను నిర్వహించడానికి తెవికీ నిర్వాహకుడు, వికీపీడియా అభివృద్ధి ఎంతగానో తోడ్పడిన బి.కె.విశ్వనాధ్ గారు అధ్యక్షుడిగా ఒక ఉత్సవ నిర్వహణా సంఘం ఏర్పడింది. ఈ సంఘానికి ప్రణయ్‌రాజ్ గారు కార్యదర్శిగానూ, పలివెల కశ్యప్ గారు కోశాధికారి గానూ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. వీరితో పాటు తెలుగు వికీమీడియా భారత పర్వం యొక్క నాయకుడు రహ్మానుద్దీన్ గారు, సి.ఐ.ఎస్-ఏ2కె కార్యనిర్దేశకుడు విష్ణువర్ధన్ గారు కూడా ఈ సంఘంలో సభ్యులు. అలాగే పదేళ్ళ తెలుగు మీడియావికీ ప్రస్థానంలో విశేషకృషి చేసిన వారిని గుర్తించి, సత్కరించేందుకు ఒక పురస్కార ఎంపిక సంఘం కూడా ఏర్పడింది. దానికి నేను అధ్యక్షత వహిస్తుండగా, వికీమీడియా భారత చాప్టర్ సహ-స్థాపకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు అర్జునరావు గారు కార్యదర్శి ఎన్నికయ్యారు. ఈ పురస్కార సంఘంలో డా. రాజశేఖర్ గారు, టి.సుజాత గారు మరియు పూర్వ వికీమీడియా భారత చాప్టరు యొక్క బెంగుళూరు ప్రతినిధి అయిన ఏ.రాధాకృష్ణ గారు కూడా ఈ ఎంపిక సంఘంలో సభ్యులు.

ఈ పురస్కారానికి తెలుగు భాషలో తొట్టతొలి (బహుశా భారతీయ భాషలలోనే తొట్టతొలి) ఆధునిక విజ్ఞానసర్వస్వపు కృషికి శ్రీకారం చుట్టిన శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి పేరు మీదగా కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం అనే పేరు ఎంపిక చేయబడింది. 1912-1913 ప్రాంతంలో విజ్ఞానసర్వస్వపు కృషిని ప్రారంభించిన కొమర్రాజు లక్ష్మణరావు, ఆ కృషిని ప్రారంభించి వంద సంవత్సరాలు నిండటం కూడా ఒక విశేషం. ఇలా తెలుగు వికీకి పదేళ్ళు నిండటం, లక్ష్మణరావు గారి విజ్ఞానసర్వస్వానికి వందేళ్ళు ఒకేసారి నిండటం గొప్ప విశేషం. ఈ విధంగా తెలుగు మీడియావికీ ప్రాజెక్టులలో కృషిచేసిన వారిని తలచుకొని వారి సేవలను గుర్తిస్తున్న తరుణంలో కొమర్రాజు లక్ష్మణరావు గారి కృషిని కూడా స్మరించుకోవటానికి చక్కని అవకాశం. ఈ పురస్కారంలో భాగంగా ఒక్కొక్క గ్రహీతకు ఒక ప్రశంసా పత్రంతో పాటు, పదివేల నగదు బహుమతి కూడా ఇవ్వబడుతుంది. పరస్పర వైరుధ్యాసక్తులకు తావు లేకుండా, ఉత్సవాల నిర్వహణా సంఘం సభ్యులు మరియు పురస్కారాల ఎంపిక సంఘం సభ్యులు ఈ పురస్కారాలు అందుకోవటానికి అనర్హులుగా ప్రకటించడమైనది.

ఈ పురస్కారాలకు అర్హులైన సభ్యులకై ప్రతిపాదనలు[2] ఆహ్వనిస్తున్నాము. ప్రతిపాదనలు దాఖలు చేయవలసిన గడువు డిసెంబరు 9, 2013 సమయం 23:59  (గ్రీ.ప్రా.కా). వికీమీడియా కృషి చేసిన సభ్యులెవరైనా ఈ పురస్కారాలకు తమ పేరును స్వయంగా ప్రతిపాదించుకోవచ్చు లేదా ఇతరులచే ప్రతిపాదించబడవచ్చు. ఎంపిక సంఘం అన్ని ప్రతిపాదనలను పరిశీలించి పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది. ప్రతిపాదనా పద్ధతిని 2011 NWRలో అప్పటి కార్యనిర్వహణా సంఘం అధ్యక్షుడు అరుణ్‌రాం రూపొందించి, అమలుపరచిన ప్రతిపాదనా పద్ధతిని[3] మరింత మెరుగుపరచి అర్జున గారు రూపొందించారు. నగదు బహుమతి ప్రోత్సాహకంగా ఇవ్వటం భారతీయ వికీల్లో ఇదే ప్రథమం. ఇప్పటికి వరకు ఉన్న ప్రోత్సాహకాలతో ఇది మరింత మంది క్రియాశీలక సభ్యులను, కొత్తసభ్యులను ఉత్సాహపరుస్తుందని ఆశిస్తున్నాం. సభాముఖంగా మీరు ఈ పురస్కారాలకు అర్హులనీ భావించిన సభ్యులను పురస్కారానికై ప్రతిపాదించాలని కోరుతున్నాను.

అంతేకాక ఈ శుభసమయంలో మా ప్రయత్నం జయప్రదం అయ్యేందుకు మీరు ఆశీస్సులు కోరుతున్నాము. ముందు ముందు తెవికీలో జరుగుతున్న విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకొనే ప్రయత్నం చేస్తాము.

భవదీయుడు,

రవి వైజాసత్య,

తెలుగు వికీపీడియా సంపాదకుడు.

మూలాలు
1. తెలుగు వికీలో కొమర్రాజు లక్ష్మణరావు పేజీ https://te.wikipedia.org/wiki/కొమర్రాజు_వెంకట_లక్ష్మణరావు

2. పురస్కార వివరాలు, నియమ నిబంధనలు https://te.wikipedia.org/wiki/WP:KLRWP

3.  ప్రతిపాదనల పేజీ https://te.wikipedia.org/wiki/Wikipedia:Komarraju_LakshmanaRao_Wikimedia_Award_Proposals

Arjuna Rao Chavala

unread,
Dec 3, 2013, 9:39:41 PM12/3/13
to telug...@googlegroups.com, telugublog
రవి గారికి,

తెలుగువీర పేరు మీదేనని ఇంతవరకు తెలియలేదు సుమా.
ఇచ్చిన లింకులో తెలుగు లింకు విరిగినందును  సరి లింకు క్రింద చేరుస్తున్నాను.
ధన్యవాదాలు
అర్జున


4 డిసెంబర్ 2013 8:05 AM న, తెలుగు వీర <telug...@gmail.com> ఇలా రాసారు :

--
--
"తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది.
ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, teluguwiki-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగువికీ" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to teluguwiki+...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.

Arjuna Rao Chavala

unread,
Dec 10, 2013, 12:42:39 AM12/10/13
to telug...@googlegroups.com, telugublog, తెవికి telugu wiki


నమస్తే,

వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/నాలుగవ స్కైప్ సమావేశం నివేదిక ప్రకారం ప్రతిపాదనల గడువు 16 డిసెంబరు గా పొడిగించడానికి మండలి నిర్ణయించింది. సముదాయం ప్రతిపాదనలను కొలబద్ద ఆధారంగా తగిన వివరణలతో పరిపుష్టం చేయవలసినదిగా మరియు ఇంకా అర్హులైన వారిని ప్రతిపాదించి, వారి అంగీకారం కొరకు ప్రయత్నించవలసిందిగా సముదాయాన్ని కోరుతున్నది. అలాగే కొలబద్దని మెరుగుచేయటానికి ఏమైనాసూచనలుంటే వారంరోజులలోగా చర్చాపేజీలో తెలియచేయమని కోరుతున్నది.

అర్జున


4 డిసెంబర్ 2013 8:05 AM న, తెలుగు వీర <telug...@gmail.com> ఇలా రాసారు :
తెలుగు నెజ్జనులందరికీ నమస్కారాలు,
Reply all
Reply to author
Forward
0 new messages