Re: [తెలుగుబ్లాగు:15088] సంపర్కాలు

2 views
Skip to first unread message

Pradeep Makineni

unread,
Sep 26, 2008, 11:06:52 PM9/26/08
to telug...@googlegroups.com, తెలుగు పదం గుంపు
http://www.google.co.in/search?q=సంప్రదింపులు
గూగుల్‌లో సంప్రదింపులు అనే పదాన్ని వెతికితే వచ్చిన ఫలితాలన్నీ అన్నీ సంభాషనలు ( dialog, delegation etc.) అనే అర్థాన్ని ఇస్తున్నాయి :)

http://www.google.co.in/search?q=సంపర్కాలు
కానీ సంపర్కాలు అనే పదాన్ని ఆంగ్లంలో ఉన్న contacts/links అనే పదాలకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నట్లు తెలుస్తుంది.

ఏ అవసరానికి ఏ పదం వాడాలి, వగైరా చర్చలను తెలుగుపదం (telug...@googlegroups.com) అనే గుంపులో చేయాలని మనవి.

--
మాకినేని ప్రదీపు


2008/9/27 nanda kumar <nandayar...@gmail.com>
గుంపులోని మితృలందరికీ వందనాలు,
   సంపర్కాలుకు ప్రతిగా సంప్రదింపులు వాడవచ్చేమో ఆలోచించండి



Veeven (వీవెన్)

unread,
Sep 27, 2008, 10:04:21 PM9/27/08
to తెలుగుపదం

౨౦౦౮ సెప్టెంబర్ ౨౭ ౨౧:౪౨ న, తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <subtad...@gmail.com> ఇలా రాసారు :
సంపర్కాలు అనే శుభ్రమైన మంచి పదం ఉండగా బొత్తిగా సంబంధం లేని ఏవో ఇతర పదాల్ని contacts కి సమానార్థకాలుగా భావించ యత్నించడం వివారకరం.

మీ వేగులోని మిగతా విషయాలన్నీ వదిలేని, పరిచయం అన్నదానిపై నేను స్పందిస్తున్నాను..
 
పరిచయం - బొత్తిగా పొసగని వాడుక.

Contactsకి పరిచయాలు అని ఎలా సూచించా(నం)మంటే

జీమెయిలు అనువాదాలకి మనక్కావలసిన సందర్భం ఇదీ:
Contact (noun)
Chambers (sense 3): an acquaintance whose influence or knowledge may prove useful, especially in business
Oxford Advanced Learner's (sense 5): a person that you know, especially sb who can be helpful to you in your work: social / personal contacts * I've made some useful contacts in journalism. * She has several contacts in New York.

తెలుగులో సబంధింత వాడుక: ఆయనకి విజయవాడలో బాగా పరిచయాలున్నాయి.

Now, I am out of contact with him.

దీన్నెలా అనువదిస్తారు ? "నాకిప్పుడు అతనితో పరిచయం లేదు" అనా ?

contact అన్న పదం సూచించే ఎన్నో అర్థాలలో ఒక్క దానికి పరిచయాలు అని వాడాం. మిగతా వాటికి దీన్నే ఎలా వాడతాం? ఒకసారి పరిచయం అంటూ ఏర్పడ్డాక ఇక లేకపోవడం ఎలా జరుగుతుంది, [...]

పైనది Oxford ప్రకారం మొదటి అర్థం:
the act of communicating with somebody, especially regularly: I don't have much contact with my uncle. * There is little contact between the two organizations. * Have you kept in contact with any of your friends from college (= do you still see them or speak or write to them)?

ఈ అర్థంలో సరైన పదం పట్టుకోవాలి. పరిచయాలు అన్నది (సంప్రదింపులు కూడా) ఈ అర్థంలో సరిపోదు.
 


--
http://veeven.com/

Veeven (వీవెన్)

unread,
Sep 27, 2008, 10:08:00 PM9/27/08
to తెలుగుపదం

౨౦౦౮ సెప్టెంబర్ ౨౮ ౦౭:౩౪ న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :

౨౦౦౮ సెప్టెంబర్ ౨౭ ౨౧:౪౨ న, తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <subtad...@gmail.com> ఇలా రాసారు :

Now, I am out of contact with him.

దీన్నెలా అనువదిస్తారు ? "నాకిప్పుడు అతనితో పరిచయం లేదు" అనా ? ఒకసారి పరిచయం అంటూ ఏర్పడ్డాక ఇక లేకపోవడం ఎలా జరుగుతుంది, [...]

contact అన్న పదం సూచించే ఎన్నో అర్థాలలో ఒక్క దానికి పరిచయాలు అని వాడాం. మిగతా వాటికి దీన్నే ఎలా వాడతాం? ఒకసారి పరిచయం అంటూ ఏర్పడ్డాక ఇక లేకపోవడం ఎలా జరుగుతుంది, [...]

ఎర్ర రంగులో పాఠ్యాన్ని  తప్పుగా ఇక్కడ అతికించా. దాని అసలు స్థానం ఆ పై పేరాలో.
 

--
http://veeven.com/

రానారె

unread,
Oct 10, 2008, 5:21:05 PM10/10/08
to తెలుగుపదం

> Now, I am out of contact with him.
> దీన్నెలా అనువదిస్తారు ? "నాకిప్పుడు అతనితో పరిచయం లేదు" అనా ?

ఉన్నదున్నట్టుగా అనువదించడం నావల్ల కాలేదుగానీ (అసలా అవసరమేముందీ!),
"చాన్నాళ్లుగా నాకతని సమాచారం లేదు" అనే మాటతో ఆంగ్ల వాక్యంలో
చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పవచ్చనుకుంటాను. చాన్నాళ్లుగా ఒక మనిషితో
సంపర్కం లేదు అంటే ఇప్పుడు కూడా లేదు అనే అర్థం వస్తుంది కదా.
Reply all
Reply to author
Forward
0 new messages