తెలుగుపదాల్ని సంస్కృతంలోకి తీసుకెళ్ళినప్పుడు తెలుగు ఉకారాంతాల్ని సంస్కృత అకారాంతాలుగా మార్చవచ్చు. అది ఉచ్చారణ సౌలభ్యం.
మనం సృష్టించుకోబేయే పదాన్ని దేశి ప్రత్యయంతో చేద్దామా? లేక సంస్కృత
ప్రత్యయంతోనా? అనేది మొదట నిర్ధారణ చేసుకుందాం.
ఒకవేళ తెలుగు ప్రత్యయమైతే మరీ మంచిది అని అనుకుంటే నాదో ప్రతిపాదన.
తెలుగులో -ఇడి అనే తద్ధితప్రత్యయం (నామవాచకాలపై చేరే నిష్పాదకప్రత్యయం)
ఉంది. అది భావార్థంలోను, అభావార్థంలోనూ ఉంది.
ఉదా:-
ముక్కు+ఇడి>ముక్కిడి`ముక్కు లేనివాడు' అటువంటిదే.
దీని ఆధారంగా తెలుగు+ఇడి> తెలుగిడి అంటే ఎలా ఉంటుందంటారు?
కాస్తా దేశీయంగానూ ఉంటుంది. శ్రవణసుభగంగానూ ఉంటుంది. మీ అభిప్రాయాలు
చెప్పండి.