subscribe మరియు unsubscribe

1 view
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Nov 9, 2009, 8:58:11 PM11/9/09
to తెలుగుపదం
subscribeకి చందాచేరు అంటున్నాం.

unsubscribeకి చందా విరమించు అనొచ్చా? మరేమైనా నిష్పాదనలుంటే తెలియజేయండి.


నెనర్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 9, 2009, 10:09:24 PM11/9/09
to telug...@googlegroups.com
చందా విరమించు బావుంది. కానీ కాస్త పొడవుగా ఉంది. చందా మాను ?

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

sudhakar valluri

unread,
Nov 11, 2009, 11:38:39 AM11/11/09
to telug...@googlegroups.com
'చందా విడువు' పరిశీలించగలరు.

2009/11/10 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

చందా విరమించు బావుంది. కానీ కాస్త పొడవుగా ఉంది. చందా మాను ?

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

 
--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

Subbachary Pulikonda

unread,
Nov 12, 2009, 1:57:18 AM11/12/09
to telug...@googlegroups.com
సబ్ స్క్రైబ్  అన్ సబ్ స్త్రైబ్ అనే మాటల్ని పత్రికల సందర్భానికి చెందిన భాషలోనుండి అనాలజీ తీసి చందా అనే మాటతో దీనికి పదాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఇమెయిల్ లో చేరడం అందులోనుండి మానేయడం అలాగే ఇలాంటి ఇతర సైట్లలో చేరడం తిరిగి మానేయడం అనే అర్థాలలో ఇవి కొంత వరకు కుదిరే పదాలే. కాని వీటిని గురించి ఇంకా ఆలోచించవలసి ఉంది. అసలు చందా అనే మాటకు తెలుగులో ఇంకా విస్తృతార్థం ఉంది కదా. దాన్నే తెలుగు పత్రికల వాళ్ళు వాడుకున్నారు. కాని అక్కడ ఏదో రూపంలో చెల్లింపు ఉంది. చెల్లించి పత్రికలను వినియోగించుకుంటున్నాము. చందా కట్టడం అనే మాటకు చెల్లింపుని విడిచి అర్థం చెప్పడం కుదరదు. కాని ఇక్కడ కంప్యూటర్ పరిభాషలో అధికాధిక సందర్భాలలో చెల్లింపు ప్రస్తావన ఉండదు. అందువల్ల చందాచేరు చందా మాను వంటి పదాలు కాక మరేదైనా ఆలోచిస్తే బాగుంటుందేమో. నేను కూడా ఇంకా ఆలోచిస్తూ ఉంటాను. మిత్రులూ ఇంకా ఆలోచించండి. అంతే కాదు ఇంగ్లీషులో subscribe అనే మాటకు చాలా విస్తృతార్థాలు ఉన్నాయి. He is a regular subscriber to this journal అంటే అతను  ఆ పత్రికకు రెగ్యులర్ గా చందా కడతాడు అని అర్థం మాత్రమే కాదు. అతను ఆ పత్రికకు రెగ్యులర్ గా రచనలు పంపుతాడు అనే అర్థం కూడా ఉంది. I do not subscribe to your ideas. or I do not subscribe to your theory అనే వాక్యాలకు ఉన్న అర్థాలు చూడండి మీ ఆలోచనలను నేను సమర్థించను అని నీ సిద్ధాంతాన్ని నేను అంగీకరించను అని అర్థాలు వస్తాయి. వీటన్నింటిని గమనించి మనం పదాలు వెదకవలసి ఉంది.  
 
పులికొండ సుబ్బాచారి.

 


Dravidian University
Kuppam 517425
A.P

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 12, 2009, 2:10:27 AM11/12/09
to telug...@googlegroups.com
ఎన్ని ప్రత్యామ్నాయ పదాలుంటే అంత మంచిది. కాబట్టి అందఱూ ఆలోచించాల్సిందే.

కానీ ఒక పదానికి ఆయా సందర్భాల్ని బట్టి మాత్రమే అర్థం చెప్పుకోగలం, అనువదించగలం. ఆ పదానికి ఆ భాషలో ఉన్న అన్ని అర్థచ్ఛాయలూ అంతర్భవించే అచ్చమైన సరిదాటి సమానార్థక పదాన్ని ఈ భాషలో వెతికి పట్టుకోబూనడం మాత్రం సఫలప్రయత్నం కాదు. ఆ అర్థచ్ఛాయల్ని అనువదించడానికి తప్పనిసరిగా విభిన్నపదాల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 12, 2009, 2:20:49 AM11/12/09
to telug...@googlegroups.com
పై వేగులోని రెండవ గద్య (paragraph) లో "సరిసాటి సమానార్థక పదాన్ని" అని సవరించుకొని చదవవలసిందిగా ప్రార్థన.
Reply all
Reply to author
Forward
0 new messages