e-తెలుగు ఒక స్టాలు -డిసంబరు నెల 17 నుండి 27 వరకు హైదరాబాదు పుస్తక ప్రదర్శన ( నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా , హైదరాబాదు

0 views
Skip to first unread message

Kaśyap కశ్యప్

unread,
Dec 16, 2009, 1:04:40 AM12/16/09
to telug...@googlegroups.com, racch...@yahoogroups.com, telug...@googlegroups.com, telugupr...@googlegroups.com, telugu...@yahoogroups.com

e-తెలుగు, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి చేసేందుకు కొందరు ఔత్సాహికులు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఇందులో అందరూ భాగస్వాము తీసుకొనవచ్చు.   “సగటు తెలుగువాడు, ఇంగ్లీషు రాకపోయినా సరే, తన అవసరాలకు కంప్యూటర్లను మరియు అంతర్జాలాన్ని వాడుకోగలగాలి." అనెది  e-తెలుగు స్వప్నం. ఆ దిశగా e-తెలుగు కృషిచేస్తోంది.   అందులో బాగముగా క్రిందటి సంవత్సరం లాగానే  హైదరాబాదు పుస్తక ప్రదర్శన  డిసంబరు నెల 17 నుండి 27 వరకు నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా హైదరాబాదు   లో e-తెలుగు ఒక స్టాలును  నిర్వహించాలని తలపెట్టింది
  దీని ద్వారా మనతోటి తెలుగు వారికి తెలుగు సాంకెతిక ఉపకణాలగురించి , బ్లాగుల గురించి ,వికీపీడియా గురించి మనము తెలియచెయవచ్చు, దీనికి సంబందించిన కరప్రతములు ఒక స్టాలును ధర్శించిన ప్రతిఒక్కరికీ ఇవ్వబడతాయి ,

మామూలు రోజుల్లో మద్యాహ్నం 2  నుండి రాత్రి 8 గంటల వరకు
శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి  ఉంటుంది.   స్టాలును విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది.కోంత మంది  ఔత్సాహికులు ఇప్పటికే తమపేర్లు ఇచ్ఛివున్నారు వారందరికీ ప్రణాళికను అందచేయగలము , మరికోంత మంది వాలంటీర్ల అవసరం ఉంది  ప్రతి రోజు స్టాలును విజయవంతంగా నడుపుటకు మీ సహకారము అవసరము ,

సూచన: మీకు తెలుగు మీద అభిమానము ఉండి, ఇతర తెలుగు సాంకేతిక అంశాల మీద పూర్తి అవగాహన లేకున్ననూ,  e-తెలుగు స్టాలు నందు మీకు తెలియపరచగలము 

క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా గాని
టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.

పేరు:
టెలిఫోను నంబరు:
ఇమెయిలు చిరునామా:
ఏ తేదీలలో ఏ సమయంలో స్టాలులో ఉండగలరో ఆ వివరాలు:

మీ అందరి సహాయ సహకారాలను ఆకాంక్షిస్తూ, మీ సలహాలు ,సూచనలు మాకు ముఖ్యము ( విరాళాలు కూడా ;))
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
కార్యదర్శి - e-తెలుగు
93965533666
kasy...@gmail.com
--

Reply all
Reply to author
Forward
0 new messages