తెలుగు ఫైర్ ఫాక్స్ కోసం తెలుగు పదాలు

48 views
Skip to first unread message

షణ్ముఖన్

unread,
Dec 2, 2011, 7:13:55 AM12/2/11
to telug...@googlegroups.com
అందరికీ నమస్కారములు,

గత రెండు నెలలుగా నేను తెలుగు ఫైర్ ఫాక్స్ (http://download.mozilla.org/?product=firefox-8.0.1&os=win&lang=te) వాడుతున్నాను.
అందులో ఎక్కువ పదాలు ఆంగ్లంలోనే(తెలుగు లిపి) వున్నాయి. వీటికి తెలుగు పదాలు(తెలుగు పదం లో వున్నవి బ్రాకెట్లో వుంచాను) తెలియజేయగలరు.

ఫైల్ (కవిలె)
- కొత్త విండో - new window
- కొత్త టాబ్ -new tab (కన్నడంలో tab  కి హూణ అని వాడుతున్నారు)
- ఫైల్ తెరుపు - open file (కవిలె తెరువు - మెరుగైన వాక్యం కావాలి)

సరిచేయు - edit

- చేయవద్దు - Undo
- ఇప్పుడు సింక్ అవుము - Sync now

తెలియని సమయం మిగిలి వుంది - Unknown time remaining - download window
లింకుని పంపు - Send link
పేజీని యిలా భద్రపరచు - Save page as (పుటని యిలా భద్రపరచు)
మునుపటి సెషన్ ను తిరిగివుంచుము - restore previous session
డౌనులోడులు - Downloads
యాడ్-ఆన్స్ - Add-ons
మెనూ - Menu
నెవిగేషన్ సాధనముల పట్టీ - Navigation Bar

ఎన్క్రిప్షను - Encryption (నిగూహనం)
ప్రైవసి - Privacy (గుహ్య/గోప్య)
నెట్వర్క్ - Network
ముందస్తు దర్శనములను -- bug - Preview
పాప్-అప్ విండోలను బ్లాకు చేయి - విషయసంగ్రహం - block pop-up windows
ఫాంట్స్ - విషయసంగ్రహం - fonts (ఖతులు)
ఎక్సెప్షన్లు -  - విషయసంగ్రహం - exceptions

మీ క్యాచీ ప్రస్తుతం డిస్క్ జాగా నందు
ఆఫ్ లైన్ వినియోగం
వెబ్ అభివృద్ధికారి
- అక్షరపు ఎన్కోడింగు
- స్క్రాచ్ పాడ్
- వెబ్ కన్సోల్
- ఆటో డిటెక్టు
  

    ఇట్లు


షణ్ముఖన్

unread,
Dec 2, 2011, 7:32:20 AM12/2/11
to telug...@googlegroups.com
Load(లోడ్), Undo - Cancel(ప్రస్తుతం రెంటికీ 'రద్దుచేయు' అని వాడుతున్నారు) ల కి కూడా తెలుగుపదాలు తెలియజేయగలరు.
  

    ఇట్లు




2011/12/2 షణ్ముఖన్ <shanm...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

SuNaMu

unread,
Dec 2, 2011, 9:20:47 AM12/2/11
to telug...@googlegroups.com
ఆర్యా,

నాకు తెలిసిన మేరకు ఈ క్రిందివి ప్రతిపాదిస్తున్నాను. విజ్ఞులు ఆలోచించగలరు:
------------------------------------------
New Window కి కొత్త కిటికీ అన్న పదం బాగానే ఉంటుంది. ఇది నాది కాదు. ఎక్కడో చదివినది.
Open అన్న మాటకి  "తెరువు" అన్నది "తెరుచు" నుండి వచ్చినా,  కవిలె తెరువు అని చదివినప్పుడు, తెరువు అన్న మాటకు ఉన్న "మార్గము" అన్న అర్థమే ఛప్పున స్ఫురణకు వస్తుంది గాని, తెరుచు అన్న క్రియాపదం గుర్తుకు రాదు. కనుక దాన్ని ఆ అర్థం లో వాడాలంటే, కవిలె తెరు అనిగాని, పూర్తిగా అయితే, కవిలె తెరువుము అని గాని ఉండాలని నా అభిప్రాయం.
undo అన్న సందర్భంలో ముందు చేసిన పని వెనక్కి తీసుకోవడం గనుక, దానికి "ఒక అడుగు వెనక్కి" అని వాడొచ్చేమో పరిశీలించండి.
unknown time remaining కి తెలియని సమయం మిగిలి ఉంది అనే కంటే,  "శేష సమయం తెలీదు / సమయ శేషం తెలీదు"  అంటే బాగుంటుందేమో.
Save page as కి "పుటని ఇలా భద్ర పరచు"  నాకు బాగుంది.
restore previous session కి  పాత సమావేశం ఆగినచోటునుండి  ప్రారంభించు / సమావేశం పునః ప్రారంభించు అనొచ్చునేమో చూడండి.  సెషన్ అన్నది అందరికి తెలిసినా, సమావేశం అన్నది sessionకి అనువాదంగా పత్రికలద్వారా ప్రాచుర్యం లో ఉన్నదే.
Upload, Download లకు బహుశా మనం export, import పదాల అర్థాలను సమానార్థకంలో వాడుకోవచ్చేమో. అందువల్ల ఎగుమతి (ఎగుమతులు) , దిగుమతి (దిగుమతులు) అన్న పదాలను పరీక్షించగలరు.
adds-on అన్నవి కొత్తగా చేరే అనుబంధాలు గనుక, వాటిని "అనుబంధాలు" అంటే బాగుంటుందా?
encryption కి గుహ్యీకరణము అనీ, encrypted కి గుహ్యీకరించబడినదనీ encrypt అన్న క్రియాపదానికి గుహ్యీకరించు అని అనవచ్చుననిపిస్తోంది.
privacy లో వ్యక్తిగతమైన అన్న భావనకే ప్రాధాన్యం గనుక దాన్ని  "వ్యక్తిగతము" అనొచ్చా? అలాఅయితే public అన్నచోట సామాజిక (ము) అని అనొచ్చు. 
network కి "వల అల్లిక" ఎలా ఉంటుంది?
font అన్నది రేఖా రూపక మైన వ్రాలు కనుక ఆ మాటకు లిపి, వ్రాలు అన్న శబ్దాలతో ముడుపడిఉండే మాటలు వాడితే  బాగుంటుంది. కనుక "వ్రాళులు" అనో, "యంత్ర లిపులు" అనో అనొచ్చా?
exceptions" కి మినహాయింపులు / ప్రత్యేకములు సరిపోతుంది.
 compact disc (CD) కి "వృత్త ఫలకం" అనవచ్చా?
"auto detect" కి స్వయంశోధన  ఎలా ఉంటుంది?
-----------------------
అభివాదములతో,
మూర్తి. NS

2011/12/2 షణ్ముఖన్ <shanm...@gmail.com>
అందరికీ నమస్కారములు,

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Dear
 
 
 
 
 
With Regards
N S Murty
Support Wikipedia
http://sunamu.wordpress.com
 

 

devi దేవి

unread,
Dec 2, 2011, 9:50:03 AM12/2/11
to telug...@googlegroups.com
లింక్ కు లంకె అనే పదము బాగానే వాడుకలో ఉందండి.

2 డిసెంబర్ 2011 5:43 సా న, షణ్ముఖన్ <shanm...@gmail.com> ఇలా రాసారు :

రమణా రావు ముద్దు

unread,
Dec 2, 2011, 12:15:05 PM12/2/11
to telug...@googlegroups.com
సునాము గారి సూచనలు అన్నీ బాగున్నాయి.అనుసరించవచ్చును.ప్రైవసీ కి గోప్యము ,గోప్యత అంటే బాగుంటుంది అనుకొంటున్నాను.లింక్ కి లంకె సరిపోతుంది.

2011/12/2 devi దేవి <devi...@gmail.com>

kv ramana

unread,
Dec 2, 2011, 8:36:52 PM12/2/11
to telug...@googlegroups.com
పరిశీలించగలరు:
ఎడిట్ - సరిదిద్దు
add-on - చేర్పులు   (అనుబంధాలు - annexure/appendix కి వాడుకలో ఉంది.
సందర్భం వచ్చింది గనక చెబుతున్నాను. షరా అంటే అనుబంధం. కాని విచిత్రంగా నిబంధన అనే  అర్థంలో వాడుతున్నారు).
--
కిల్లంసెట్టి వెంకటరమణ

Arjuna Rao Chavala

unread,
Dec 2, 2011, 10:14:51 PM12/2/11
to telug...@googlegroups.com
మీ స్పందనలకు ధన్యవాదాలు.
ఈ ఫైర్ఫాక్స్ ఆదేశాల తెలుగు అనువాదాలలో, కృష్ణబాబు, నేను చాలా కాలం క్రిందట పనిచేశాము. దీనిలో వచ్చే కొన్ని పదాలు, కంప్యూటర్ పరిభాషలో భాగం కాబట్టి, ఒక ప్రామాణిక అనువాద జాబితా కొరకు  FUEL ప్రాజెక్టులో చర్చించటం జరిగింది. దాని ఫలితాలు, మీ సలహాలతో సమీక్షించి ముందు ముందు ఫైర్ఫాక్స్ మరియు ఇతర అనువర్తనాలలో మార్పులు చేయాలి. ఆసక్తి గలవారు ఆ ప్రాజెక్టులో పాల్గొనమని మనవి.

అర్జున


2011/12/3 kv ramana <kvje...@gmail.com>

SuNaMu

unread,
Dec 3, 2011, 12:09:24 AM12/3/11
to telug...@googlegroups.com
ఆర్యా,
నేను శ్రీ రమణగారు చెప్పిన అనుబంధాలు అన్న పదం Annexure/ Appendix లకు వాడుకలో ఉన్నదన్న విషయం లో ఏకీభవిస్తున్నాను.  కాని Edit అన్నది సరిదిద్దడం (Correction) కంటే భిన్నమైన చర్య అని నా అభిప్రాయం. పరిహరణ అని తోస్తోంది, అది కాని అదికూడా సరిదిద్దడం కంటే పెద్దదీ, Edit కంటే చిన్నదీ  అయి పూర్తిగా భావాన్ని అందించడం లేదు.
షరా విషయం లో దాని అర్థం "గమనిక" అని నా అభిప్రాయం.  నాకు తెలిసి  షరా అంటే అనుబంధం అన్న అర్థంలో మా ప్రాంతాల్లో (ఉత్తరాంధ్రలో) వాడుకలో లేదు.
భవదీయ,


2011/12/3 kv ramana <kvje...@gmail.com>

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Dec 3, 2011, 12:58:43 AM12/3/11
to telug...@googlegroups.com
నాకు తెలిసినంతలో, షరా అంటే post script. అంటే అనుబంధమే. నిఘంట్వర్థం కూడా ఇదే అనుకుంటాను.

షణ్ముఖన్

unread,
Dec 3, 2011, 2:17:11 AM12/3/11
to telug...@googlegroups.com
>Edit అన్నది సరిదిద్దడం (Correction) కంటే భిన్నమైన చర్య అని నా అభిప్రాయం
మీ విశ్లేషణ బాగుంది.
  

    ఇట్లు




2011/12/3 SuNaMu <murty....@gmail.com>

kv ramana

unread,
Dec 3, 2011, 6:02:51 AM12/3/11
to telug...@googlegroups.com
షరా
శర్మ గారు అన్నట్లు పోస్ట్ స్క్రిప్ట్ కి దగ్గరి మాటే ఐనా అనుబంధం అనడమే ఉచితం. షరా ఉర్దూ నుంచి మనకు చేరింది. పొరబాటున ఎన్ బీ (లాటిన్ నోట బీని) లాంటిది అనుకుని ష.రా. అని తప్పుగా చుక్కలు పెట్టి రాయడం కనిపిస్తోంది.

రమణా రావు ముద్దు

unread,
Dec 3, 2011, 8:47:49 AM12/3/11
to telug...@googlegroups.com
 1, షరా అంటే నిఘంటువులో అనుబంధం అని ఉన్నా వాడుకలో మాత్రం షరతు, నిబంధన
అనే అర్థం వాడుకలో ఉంది.  2,ఎడిటర్, ,ఎడిటోరియల్ అంటే సంపాదకుడు,
సంపాదకీయం,అనే అర్థంలో రూఢిగా వాడుతున్నాము కదా.
2011/12/3 kv ramana <kvje...@gmail.com>:

ANANDASWARUP GADDE

unread,
Dec 3, 2011, 4:40:07 PM12/3/11
to telug...@googlegroups.com
2011/12/4 రమణా రావు ముద్దు <ramanar...@gmail.com>:

>  1, షరా అంటే నిఘంటువులో అనుబంధం అని ఉన్నా వాడుకలో మాత్రం షరతు, నిబంధన
> అనే అర్థం వాడుకలో ఉంది.

'షరా మామూలే ' అన్న వాడకం ఉన్నట్లు గుర్తు. దీని అర్థమేమిటి?

kv ramana

unread,
Dec 3, 2011, 9:37:58 PM12/3/11
to telug...@googlegroups.com

షరా అంటే  వాడుకలో షరతు, నిబంధన ఉంది - పొరబాటున ఇలా అర్థం తీసుకుంటున్నారు. అలాగే గమనిక అని కూడా పొరబాటున అనుకుంటున్నారు.
౨. భవంతి అనే పదం ఒకటి పుట్టుకొచ్చింది - పెద్ద భవనం అనే అర్థంతో. ఇది బవంతి (వత్తులేని బ) కి వచ్చిన మార్పు. చుట్టూ విశాలంగా  స్థలం గల  ఇల్లు.
౩. వెల అనే అర్థంతో ధర అని రాస్తున్నాం. డకు వత్తు రాయకూడదు. దర అనాలి.
౪. ఉచ్ఛారణకు వత్తు రాయడం కనిపిస్తున్నది - ఉచ్చారణ అనాలి.

షణ్ముఖన్

unread,
Dec 9, 2011, 4:41:03 PM12/9/11
to telug...@googlegroups.com
Firefox->Navigation Tool Bar కి 'గమన సూచి పట్టీ' అనేది పరిశీలించగలరు
  

    ఇట్లు




2011/12/4 kv ramana <kvje...@gmail.com>

SuNaMu

unread,
Dec 9, 2011, 11:05:04 PM12/9/11
to telug...@googlegroups.com
"tools" అన్నవి ప్రాథమికముగా ఉపకరణాలు. గమన అన్నపదం  సాధారణం గా speed ను సూచిస్తుంది... గజగమన, మంద గమన.. అన్న వ్యవహారాలను బట్టి. కానీ, యానము అన్న మాట ప్రయాణాన్ని సూచిస్తుంది... నౌకాయానము, విమానయానము అన్న వాడుకల బట్టి.  కనుక ఈ వాడుకలు దృష్టిలో ఉంచుకుని "యాన ఉపకరణ పట్టీ" అంటే బాగుంటుందేమో!.

2011/12/10 షణ్ముఖన్ <shanm...@gmail.com>

షణ్ముఖన్

unread,
Dec 9, 2011, 11:57:05 PM12/9/11
to telug...@googlegroups.com
నమస్కారములు,
గమనము అన్న పదానికి బ్రౌణ్య నిఘంటువులో ఈ క్రింది అర్థాలు వున్నాయి, పరిశీలించగలరు.
  • 1. పోక;
  • 2. ప్రయాణము;
  • 3. తలఁపు.

  

    ఇట్లు




2011/12/10 SuNaMu <murty....@gmail.com>

షణ్ముఖన్

unread,
Jan 31, 2012, 1:07:36 AM1/31/12
to telug...@googlegroups.com

Tab కి - చిన్న కిటిటీ / చికి (సంక్షిప్త రూపం) ఎలా వుందంటారు?
చికి = చిన్న అని అర్థం (http://www.andhrabharati.com/dictionary/)
New Tab -> కొత్త చికి
Open Link in new Tab -> లంకెను కొత్త చికిలో తెరువుము

పరిశీలించగలరు.

    ఇట్లు

Praveen Illa

unread,
Jan 31, 2012, 1:19:30 AM1/31/12
to telug...@googlegroups.com
Tab కి - నెట్టు అని కూడా వాడారా ఇది సరైనదేనా...

ఇట్లు,
ప్రవీణ్ ఇళ్ళ

రమణా రావు ముద్దు

unread,
Jan 31, 2012, 10:20:47 AM1/31/12
to telug...@googlegroups.com
 ఇంగ్లిష్ లో కూడా కంప్యుటర్ భాష ,పదాలు కొత్తగా
సృష్టించుకొంటున్నవే.అందువలన తెలుగులో కూడా మనం కొత్తగా ఏర్పాటు చేసుకో
వచ్చును.TABకి చికి ' అంటే తప్పులేదు.కాని పటకా' అంటే ఇంకా సరిగా
ఉంటుందనుకొంటాను.nano కి శతకోటి అని అర్థం ఉన్నా ,నానో' అనే పదాన్నే
యథాతథంగా తీసుకొంటే బాగుంటుంది.

2012/1/31 Praveen Illa <mail...@gmail.com>:


> Tab కి - నెట్టు అని కూడా వాడారా ఇది సరైనదేనా...
>
> ఇట్లు,
> ప్రవీణ్ ఇళ్ళ
>

kv ramana

unread,
Jan 31, 2012, 7:33:34 PM1/31/12
to telug...@googlegroups.com
షణ్ముఖ గారు చెప్పినట్లు నానో అనడమే బాగు. 
శతకోటో భాగానికి నానో అంటున్నారు. నానో, పీకో, మైక్రో - వీటి;అర్థం చిన్న లేదా సూక్ష్మం. చక్కగా పరిమాణం సూచించే ఉపసర్గలుగా వాడకానికి వచ్చాయి. 

షణ్ముఖన్

unread,
Feb 17, 2012, 6:31:25 AM2/17/12
to telug...@googlegroups.com
off-line = త్యజ-వల (network నుంచి విడివడిన)
on-line = పరివల (network లో వున్న)


పరిశీలించగలరు.
  

    ఇట్లు




2012/2/1 kv ramana <kvje...@gmail.com>

Pulikonda

unread,
Feb 17, 2012, 8:04:13 AM2/17/12
to telug...@googlegroups.com

మిత్రులారా
వల అనేది తెలుగు పదం మిగతావి సంస్కృత పదాలు. వైరి  సమాసాలు దుష్టసమాసాలు ఇలా చేయకూడదు అని ఇక్కడ నేను వక్కాణించడం లేదు. కాని ఈ రెండు అటు  అర్థవంతంగా కాని వినసొంపుగా కాని లేవు. 
ఆన్ లైన్ అని అనడానికి జాలస్థిత లేదా జాలనిహిత అని అనవచ్చు. అలాగే ఆఫ్ లైన్ అంటే నెట్ తో సంబంధం లోకుండా విడిగా ఉన్నది అనడానికి  జాలత్యజిత అని అనవచ్చు లేదా జాలరహిత అని కూడా అనవచ్చు. ఇక్కడ జాలరహిత అనగానే ఆ కంప్యూటర్ కు అంతర్జాల సంబంధం లేదు అనే అర్థం బాగా స్ఫురిస్తుంది. 
తర్వాత జాలనిహిత జాలరహిత అనే సమాసాలు ఏక రూపంలో ఉండి ఇంగ్లీషులోని off-line, on-line అనే ఇంగ్లీషు కాంపౌండ్ లకు సమానంగా తుల్యంగా ఉంటాయి. రూపం లో కూడా ఈ రెండు ఇంగ్లీషు పదాలు సమతూకంలో ఉన్నాయి. తెలుగులో మనం చెప్పేవి కూడా అలాగే ఉంటాయి. 
మిత్రులూ ఇంకా ఆలోచించండి.

భవదీయుడు
పులికొండ సుబ్బాచారి.

2012/2/17 షణ్ముఖన్ <shanm...@gmail.com>



--
Prof. P.  Subbachary
Chairman BOS
Department of Folklore & Tribal Studies
Dravidian University
Kuppam 517425
A.P

Arjuna Rao Chavala

unread,
Feb 17, 2012, 8:18:19 AM2/17/12
to telug...@googlegroups.com


2012/2/17 Pulikonda <psubb...@gmail.com>


మిత్రులారా
వల అనేది తెలుగు పదం మిగతావి సంస్కృత పదాలు. వైరి  సమాసాలు దుష్టసమాసాలు ఇలా చేయకూడదు అని ఇక్కడ నేను వక్కాణించడం లేదు. కాని ఈ రెండు అటు  అర్థవంతంగా కాని వినసొంపుగా కాని లేవు. 
ఆన్ లైన్ అని అనడానికి జాలస్థిత లేదా జాలనిహిత అని అనవచ్చు. అలాగే ఆఫ్ లైన్ అంటే నెట్ తో సంబంధం లోకుండా విడిగా ఉన్నది అనడానికి  జాలత్యజిత అని అనవచ్చు లేదా జాలరహిత అని కూడా అనవచ్చు. ఇక్కడ జాలరహిత అనగానే ఆ కంప్యూటర్ కు అంతర్జాల సంబంధం లేదు అనే అర్థం బాగా స్ఫురిస్తుంది. 
తర్వాత జాలనిహిత జాలరహిత అనే సమాసాలు ఏక రూపంలో ఉండి ఇంగ్లీషులోని off-line, on-line అనే ఇంగ్లీషు కాంపౌండ్ లకు సమానంగా తుల్యంగా ఉంటాయి. రూపం లో కూడా ఈ రెండు ఇంగ్లీషు పదాలు సమతూకంలో ఉన్నాయి. తెలుగులో మనం చెప్పేవి కూడా అలాగే ఉంటాయి. 

మీ సలహా నాకు నచ్చింది.

ధన్యవాదాలు
అర్జున

కంది శంకరయ్య

unread,
Feb 17, 2012, 9:30:21 AM2/17/12
to telug...@googlegroups.com
‘త్యజ- వల’ అన్నప్పుడు దుష్టసమసం అవుతున్నది.
నేను సూచించేవి....
off_line - వలవిడుపు ; జాలత్యజం/ ద్యుతి
on-line - వలపట్టు; జాలస్థం

2012/2/17 షణ్ముఖన్ <shanm...@gmail.com>
off-line = త్యజ-వల (network నుంచి విడివడిన)

Arun Gaddipati (అచంగ)

unread,
Feb 17, 2012, 9:36:09 AM2/17/12
to telug...@googlegroups.com
కంది శంకరయ్య గారి సూచనలు బావున్నాయి. 

ఇట్లు,
అరుణ్ చంద్ర గడ్డిపాటి,
బ్లాగు (తెలుగు): కృష్ణవేణీతీరం.

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Feb 17, 2012, 4:09:36 PM2/17/12
to telug...@googlegroups.com
శంకరయ్యగారి సూచనలు బావున్నాయి.

నా దో చిన్న అనుమానం, మొదటి సూచనలో చ్యుతి అని వ్రాయబోయి ద్యుతి అని వ్రాసారేమో. ద్యుతి అంటే కాంతి కదా.

భవదీయుడు, గిరి

కంది శంకరయ్య

unread,
Feb 17, 2012, 8:01:31 PM2/17/12
to telug...@googlegroups.com
నిజమే,
d,c లు రెండూ నడిమివ్రేలితోనే టైపు చేస్తాం కదా! అందువల్ల ఆ పొరపాటు జరిగింది.
వెంటనే అది టైపాటని చెప్పి సవరణ చేసాను కూడా. మీరు దానిని చూడలేదనుకుంటా.
..... కంది శంకరయ్య.

2012/2/18 Lanka Giridhar (లంక గిరిధర్) <giridha...@gmail.com>
శంకరయ్యగారి సూచనలు బావున్నాయి.

నా దో చిన్న అనుమానం, మొదటి సూచనలో చ్యుతి అని వ్రాయబోయి ద్యుతి అని వ్రాసారేమో. ద్యుతి అంటే కాంతి కదా.

భవదీయుడు, గిరి

షణ్ముఖన్

unread,
Feb 17, 2012, 11:55:06 PM2/17/12
to telug...@googlegroups.com
వలపట్టు, వలవిడుపు అలాగే జాలనిహిత, జాలరహిత రెండూ చాలా బాగున్నాయి.


    ఇట్లు




2012/2/18 కంది శంకరయ్య <shanka...@gmail.com>

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Feb 24, 2012, 9:08:22 AM2/24/12
to telug...@googlegroups.com
శంకరయ్యగారు, నేను గమనించలేదు మన్నించండి.

18 ఫిబ్రవరి 2012 9:01 ఉ న, కంది శంకరయ్య <shanka...@gmail.com> ఇలా రాసారు :

SuNaMu

unread,
Feb 24, 2012, 10:24:59 AM2/24/12
to telug...@googlegroups.com
"వలపట్టు" ని "వలపన్ను" చేస్తే. వలపన్ను అన్నది instruction గా కూడ వాడవచ్చుగనుక.

2012/2/18 షణ్ముఖన్ <shanm...@gmail.com>



--
Reply all
Reply to author
Forward
0 new messages