కంపాషన్

2 views
Skip to first unread message

Sirish Kumar Tummala

unread,
Jan 29, 2009, 5:00:12 AM1/29/09
to telug...@googlegroups.com
compassion కు తెలుగు మాట సూచించండి. సహానుభూతి అని వాడొచ్చా?
passion కు కూడా సూచించండి.
- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org

Veeven (వీవెన్)

unread,
Jan 29, 2009, 5:10:18 AM1/29/09
to telug...@googlegroups.com

2009/1/29 Sirish Kumar Tummala <sirish...@gmail.com>


compassion కు తెలుగు మాట సూచించండి. సహానుభూతి అని వాడొచ్చా?

వాడొచ్చు కానీ ఇది పూర్తి అర్ధమివ్వట్లేదు. (Deep awareness of the suffering of another, coupled with the wish to relieve it)
 
passion కు కూడా సూచించండి.

దీని ఇంగ్లీషు అర్థాలు చూసాకా కసి దీనికి సరైన తెలుగు పదం అనిపిస్తుంది.

ఇట్లు,
వీవెన్.
--
Read Telugu blogs @ koodali.org

Sirish Kumar Tummala

unread,
Jan 29, 2009, 5:13:05 AM1/29/09
to telug...@googlegroups.com
కసా? :)
మోజు అని అనొచ్చేమో అనుకున్నాను.


- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org


2009/1/29 Veeven (వీవెన్) <vee...@gmail.com>

Veeven (వీవెన్)

unread,
Jan 29, 2009, 5:26:52 AM1/29/09
to telug...@googlegroups.com
2009/1/29 Sirish Kumar Tummala <sirish...@gmail.com>
కసా? :)

మోజు అని అనొచ్చేమో అనుకున్నాను.

మోహం, యావ, కసి, మోజు ఇలా చాలా పదాలకి passion ని అర్థంగా ఇచ్చారు: http://dsal.uchicago.edu/cgi-bin/philologic/search3advanced?dbname=gwynn&query=passion&matchtype=exact&display=utf8

సమయానుకూలంగా వాడుకోవడమే.

Ki NaCha

unread,
Jan 29, 2009, 5:26:45 AM1/29/09
to telug...@googlegroups.com
నాకు passion అన్న మాట వినగానే తోచే పదం "రంధి". J.P.L. Gwynn Dictionaryలో కూడా ఈ పదానికి ఇచ్చిన ఆంగ్ల-సమానార్థకాలలో passion అన్నది కనిపిస్తుంది: <http://dsal.uchicago.edu/cgi-bin/philologic/search3advanced?dbname=gwynnquery=randhimatchtype=exactdisplay=utf8>. కానీ, compassion అన్న అర్థం ఈ పదం నుంచి వ్యుత్పత్తి చేయవచ్చా అన్నది నాకు తెలియదు. అలాగే, passions అంటే "రంధులు" అనటం సరియేనా?
 
నచకి

Ki NaCha

unread,
Jan 29, 2009, 5:31:23 AM1/29/09
to telug...@googlegroups.com
<< 
compassion కు తెలుగు మాట సూచించండి. సహానుభూతి అని వాడొచ్చా?

వాడొచ్చు కానీ ఇది పూర్తి అర్ధమివ్వట్లేదు. (Deep awareness of the suffering of another, coupled with the wish to relieve it)
>>
 
J.P.L. Gwynn నిఘంటువులో కనిపించిన పదాలు: అనుక్రూశం, కరుణ, కృప, జాలి, దాక్షిణ్యం. వీటిలో "అనుక్రూశం" తప్పించి మిగతావి అన్నీ వేరు వేరు అర్థాల్లో వాడుతున్నాము కనుక "compassion = అనుక్రూశం" అనుకుందామా? ఈ పదానికి వ్యుత్పత్తి ఏమిటి?
 
నచకి

Sent: Thursday, January 29, 2009 04:10
Subject: [తెలుగుపదం] Re: కంపాషన్


2009/1/29 Sirish Kumar Tummala <sirish...@gmail.com>

 
passion కు కూడా సూచించండి.

దీని ఇంగ్లీషు అర్థాలు చూసాకా కసి దీనికి సరైన తెలుగు పదం అనిపిస్తుంది.

భైరవభట్ల కామేశ్వర రావు

unread,
Jan 29, 2009, 8:59:35 AM1/29/09
to తెలుగుపదం
Compassionకి నేనెప్పుడూ వాడే పదం "అనుకంప".
Passionకి నానార్థాలున్నాయి కాబట్టి సందర్భానికి తగిన పదం వాడుకోవాలి.
"తమి", "మోహము" అన్నవి strong desire అన్న అర్థంలో వాడుకోవచ్చు.

- కామేశ్వర రావు

On Jan 29, 3:00 pm, Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>
wrote:

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Jan 29, 2009, 10:34:41 AM1/29/09
to telug...@googlegroups.com
"అనుకంప" కే నా మొదటి వోటు. సహానుభూతి కూడా ఫర్వాలేదు.

౨౦౦౯ జనవరి ౨౯ ౧౯:౨౯ న, భైరవభట్ల కామేశ్వర రావు <kame...@yahoo.com> ఇలా రాసారు :



--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

గోపాల్(Gopal Koduri)

unread,
Feb 23, 2009, 1:17:28 PM2/23/09
to తెలుగుపదం
సంవేదన అని కూడా అనొచ్చు.
compassion అంటే అవతలి వారి బాధని మన బాధగా అనుకోవడం. కనుక దీనికి సంవేదన
సరిగ్గా సరిపోతుందని అనుకుంటాను.

--
గోపాల్

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Feb 23, 2009, 1:55:12 PM2/23/09
to telug...@googlegroups.com
తెలుగువాళ్ళ చెవులు వేదనకీ సంవేదనకీ భేదాన్ని గుర్తించజాలవు. అయినా అనుకంప లాంటి అద్భుతమైన పదాన్ని ఎవరో ఇప్పటికే సూచించగా మనకింకా పక్కచూపులేల ?

౨౦౦౯ ఫిబ్రవరి ౨౩ ౨౩:౪౭ న, గోపాల్(Gopal Koduri) <gopal...@gmail.com> ఇలా రాసారు :
Reply all
Reply to author
Forward
0 new messages