scalable కి తెలుగు వదం?

5 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Dec 29, 2009, 9:57:41 PM12/29/09
to తెలుగుపదం
The ability for a business or technology to accept increased volume without impacting the contribution margin.

References:
* http://www.w3.org/TR/SVG/concepts.html
* http://en.wikipedia.org/wiki/Scalability

ఇవీ నా ఆలోచనలు:
  • తాళత (ఎంత భారాన్ని లేదా ఎంత పరిమాణం వరకు తాళగలదు/తట్టుకొనగలదు).
    • ఈ వ్యవస్థ యొక్క తాళత: 1,000 వాడుకరులు • ఈ వ్యవస్థ 1,000 వాడుకరుల వరకు తాళగలదు/తాళిస్తుంది.
    • తాళిక(?) సదిశ రేఖాచిత్రాలు (Scalable Vector Graphics)

లేదా, ఈ పదానికి వ్యుత్పత్తి 'scale' ఆధారంగా కూడా ప్రయత్నించవచ్చేమో.

మరేమైనా?

నెనర్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 30, 2009, 4:54:28 AM12/30/09
to telug...@googlegroups.com
తాళు సంస్కృతం కాదు కనుక ఆ భాషాప్రత్యయాలన్నీ తెలుగుమాటలకి తగిలించలేం.
తెలుగులో లేదు గానీ, దీనికి సంస్కృతంలో ఒక Direct equivalent ఇప్పటికే ఉంది.

క్షమం - తట్టుకోగలది
క్షమత/ క్షమత్వం - (మీరు తెలియజేసిన) scalability.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

గోపాల్(Gopal Koduri)

unread,
Dec 30, 2009, 5:12:48 AM12/30/09
to telug...@googlegroups.com
మరి తాళు అంటే ఏ భాష లో పదం?
--
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in


30 డిసెంబర్ 2009 3:24 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

ANANDASWARUP GADDE

unread,
Dec 30, 2009, 5:40:17 AM12/30/09
to telug...@googlegroups.com
గిరాకికి సర్దుబాటు ఇలాంటివి ఏమైనా కుదురుతుయ్యేమో
swarup

2009/12/30 Veeven (వీవెన్) <vee...@gmail.com>:

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 30, 2009, 9:06:35 AM12/30/09
to telug...@googlegroups.com
కేవలం తెలుగుపదమే కావాలంటే
తాళుబాటు అనవచ్చు.

kv ramana

unread,
Dec 30, 2009, 9:19:26 AM12/30/09
to telug...@googlegroups.com
క్షమత చాలా మంచి పదం.  కెపాసిటీకి  ఒరియాలో విస్తృతంగా వాడుతున్నారు.

2009/12/30 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

Subbachary Pulikonda

unread,
Dec 31, 2009, 5:59:24 AM12/31/09
to telug...@googlegroups.com
అవును క్షమత అనే సంస్కృత పదం బాగుంది. అలాగే తాడేపల్లి వారు సూచించినదే తెలుగుపదం తాళుబాటు (కొత్తగా ఉన్నా) బాగుంది. దీనికి పాతది సరిపోయేది మరొక మంచి తెలుగు మాట ఉంది. అదేమంటే ఓరిమి. కాని మరీ ఇంత తెలుగుతనాన్ని తెలుగు వారు తట్టుకోలేరోమోనని నా అనుమానం. ఓరిమి అంటే ఇంకా వేరే అర్థాలు కూడా ఉన్నాయి. కాని ఇక్కడ బాగా సరిపోతుంది. అంతే కాదు తెలుగు వారు చాలా మంది మర్చిపోయిన మరొక మంచి తెలుగు పదం దీనికి సరిపోయేది ఉంది. అది ఓటు ఇది మనం ఎన్నికల్లో వేసే ఇంగ్లీషు పదమైన వోటు vote కాదు. కొంత మంది తెలుగు వారికి ఇది గుర్తుండి ఉంటుంది. ఈ పదం ఓటు అంటే తట్టుకునే శక్తి అని క్షమత అని స్పష్టమైన అర్థాలు ఉన్నాయి. ఇక మన వెసులుబాటు....
 
పులికొండ సుబ్బాచారి.

--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P

ANANDASWARUP GADDE

unread,
Dec 31, 2009, 8:31:16 PM12/31/09
to telug...@googlegroups.com
2009/12/30 గోపాల్(Gopal Koduri) <gopal...@gmail.com>:

> మరి తాళు అంటే ఏ భాష లో పదం?
> --.
It seems to be a Dravidian word used in different languages
http://dsal.uchicago.edu/cgi-bin/philologic/showrest_?kwic.6.1.14936.0.5.burrow
But I did not learn how to use this dictionary carefully.
Swarup

chavakiran

unread,
Dec 31, 2009, 8:52:56 PM12/31/09
to telug...@googlegroups.com
లావు
లావు పాటి
లావుదనం
ఎంత లావు


----
ఎలా ఉన్నాయి.

Subbachary Pulikonda

unread,
Jan 1, 2010, 12:22:56 AM1/1/10
to telug...@googlegroups.com
నా చర్చను మరింత పొడిగిస్తాను. తాళుబాటు అనే కొత్త పదకల్పనతో నామవాచక రూపాన్ని నిష్పాదించవచ్చు. ఇంత శ్రమ కూడా అక్కరలేకుండా దీనికు తుల్యమైన నామవాచక రూపం మరొకటి మనకు ఉండనే ఉంది. తాలిమి. తాలిమి అంటే క్షమత అనే తత్సమ శబ్దానికి సరైన తెలుగు పదం.
తాలిమి, కూరిమి, ఓరిమి, లేమి, లేమిడి, కలిమి, చెలిమి వంటి మంచి తెలుగు పదాల్ని తెలుగు జాతి మర్చి పోతూ ఉండడం నిజంగా బాధాకరం తెలంగాణాలోని మారుమూల గ్రామాలలో ఇంకా పెద్దవాళ్ళ వాడుకలో ఇవి ఇంకా వినిపిస్తూ ఉండడం కొంత సంతోషించదగ్గ విషయం. క్షేత్రపరిశోధనలో ఇలాంటి మాటలు చెవిని పడినప్పుడు తేనెచినుకులు నాలుకమీద పడ్డట్టు ఉంటుంది.
 
అందరికీ కొత్త ఏడాది ఓగుమాటలు
 
భవదీయుడు
 
పులికొండ సుబ్బాచారి.

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

Subbachary Pulikonda

unread,
Jan 1, 2010, 12:44:58 AM1/1/10
to telug...@googlegroups.com
అన్నన్నా ఓగు మాటలు కాదు బాగు బాగు మాటలు.
సుబ్బాచారి

 

ANANDASWARUP GADDE

unread,
Jan 1, 2010, 2:17:30 AM1/1/10
to telug...@googlegroups.com
2010/1/1 Subbachary Pulikonda <psubb...@gmail.com>:

> నా చర్చను మరింత పొడిగిస్తాను. తాళుబాటు అనే కొత్త పదకల్పనతో నామవాచక రూపాన్ని
> నిష్పాదించవచ్చు. ఇంత శ్రమ కూడా అక్కరలేకుండా దీనికు తుల్యమైన నామవాచక రూపం
> మరొకటి మనకు ఉండనే ఉంది. తాలిమి. తాలిమి అంటే క్షమత అనే తత్సమ శబ్దానికి సరైన
> తెలుగు పదం.
> తాలిమి, కూరిమి, ఓరిమి, లేమి, లేమిడి, కలిమి, చెలిమి వంటి మంచి తెలుగు పదాల్ని
> తెలుగు జాతి మర్చి పోతూ ఉండడం నిజంగా బాధాకరం తెలంగాణాలోని మారుమూల గ్రామాలలో
> ఇంకా పెద్దవాళ్ళ వాడుకలో ఇవి ఇంకా వినిపిస్తూ ఉండడం కొంత సంతోషించదగ్గ విషయం.
> క్షేత్రపరిశోధనలో ఇలాంటి మాటలు చెవిని పడినప్పుడు తేనెచినుకులు నాలుకమీద
> పడ్డట్టు ఉంటుంది.
>
> అందరికీ కొత్త ఏడాది ఓగుమాటలు

నాకూ అలాగే అనిపిస్తుంది. నాకు సంస్కృతం బాగుంటుంది కాని తెలుగు పోకడలు
తేడాగా ఉంటయ్యనిపిస్తుంది. వీలైతే పల్లెటూరి వాళ్ళకు అర్థమయ్యే మాటలకోసం
వెతికితే ఆమాటలు ఎక్కువకాలం నిలవవచ్చు.

kv ramana

unread,
Jan 6, 2010, 9:35:43 AM1/6/10
to telug...@googlegroups.com
'సామర్థ్యం'  వాడుకలో ఉన్న మాట. ఇది సరైనది కాదా?

2010/1/1 ANANDASWARUP GADDE <ananda...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages