FUEL Telugu Evaluation completed and released

15 views
Skip to first unread message

Krishnababu Krothapalli

unread,
Nov 23, 2010, 7:15:18 AM11/23/10
to fuel-d...@lists.fedorahosted.org, indlinu...@lists.sourceforge.net, తెలుగుపదం
Hi,

   Fuel Telugu evaluation process successfully completed and 578 words Fuel-Telugu word list released
and available in three formats .ods, .pdf and .po

   Please go through the evaluated terms and provide your feedback. Find more details here.

Thanks & Regards,
Krishna.

Kiran Kumar Chava

unread,
Nov 23, 2010, 8:31:48 AM11/23/10
to telug...@googlegroups.com, fuel-d...@lists.fedorahosted.org, indlinu...@lists.sourceforge.net

Alignment హద్దుకనుగుణంగా (మరీ అంత బాగోలేదు, ఇంకా కొంచెం మంచి పదం కావాలి, పదంలా లేదు, ఏదో అర్థం వివరిస్తున్నట్టు ఉంది)

Applications అనువర్తనాలు నుండి అనువర్తనములుగా మార్చారు. ఎందుకలా? వ్యాకరణ పరంగా ఏది ఒప్పు??

Apply filters వడపోతలను అమలుపరుచు (మరీ మక్కీకి మక్కీగా ఉంది, సింపుల్గా వడకట్టు అనవచ్చు కదా)

bookmark ఇష్టాంశము (సృజనశీలులెవరో పేజీక అని మంచి పదం నిష్పాదించిన గుర్తు, అదే వాడితే ఎలా ఉంటుంది?)

Calculator - దీనికి కాలుక్యులేటర్ అనే వాడితే బాగుంటుంది. గణణపరికరం కంటే. కాలుక్యులేటర్ ఇప్పటికే బాగా పాపులర్ అయి జనాల్లోకి చొచ్చుకోని వెళ్లిన పదం కదా. కొన్ని సార్లు గుండె రాయి చేసుకోని పాపులర్ అయిన ఆంగ్ల పదాలు అట్టే పెట్టేయటమే మంచిది. కనీసం కొత్త తెలుగు పదాలు ఇతర చోట్ల పాపులర్ అయ్యేంత వరకు.

క్యాలాండర్ - దీనికి పంచాంగం అని వాడవచ్చు కదా.

కాన్సెల్ - దీనికి రద్దుచేయు అని ఇచ్చారు సింపుల్గా రద్దు అనవచ్చు కదా.

చార్ట్ - పట్టిక అని మనకో పదం ఉంది కదా , చార్ట్ అని వాడే కంటే పట్టిక అని వాడటమే సులబం.

క్లియర్ - దీనికి శుబ్రంచేయు కంటే చివరలో ఈ చేయు ఎత్తేసి మరేదన్నా పదం పెడితే బాగుంటుందేమో. ఉదాహరణకు శుబ్రించు - ?

కాలం - దీనికి నిలువ వరుస అని అన్నారు, కాని అది మరీ పెద్దగా బొత్తిగా అసృజనాత్మకంగా ఉంది. మరేదన్నా మంచి పదం దొరకవచ్చు వెతికితే.

కన్సాలిడేట్ - దీనికి ఒకటిగా చేర్చు అని అన్నారు. దానికంటే మూటకట్టు అనే తెలుగు పదం బాగా నప్పుతుంది కదా.

Datapilot - బహురాప దత్తాంశ సౌలభ్యం (దేవుడా! ఇంత కంటే మంచి పదం ఈ తెలుగు వాళ్లకు ప్రసాదించు మంచి దేవుడా)

డెస్క్ టాప్  - రంగస్థలం (అద్భుతంగా ఉంది

Detective ప్రస్తావనలు చూపు సౌలభ్యం (దేవుడా ఇంత కంటే మంచి పదం ఈ తెలుగు వాళ్లకు ప్రసాదించు మంచి దేవుడా)

Edit - సరిచేయు (దీనికంటే మార్చు , సింపుల్గా బాగుంది కదా)

Expunge  శాస్వత తొలగింపు (దీనికంటే గెంటివేయు అంటే బాగుంటుంది కదా)

Extensions విస్తరింపులు (విస్తరింపులు బాగానే ఉంది కానీ పొడిగింతలు ఇంకా బాగున్నట్టు లేదు)

ఫైల్ (ఫైలు బాగానే ఉంది కానీ దస్త్రం ఎలా ఉంటుంది)

ఫాంట్స్ (అక్షరశైలులు , దీని కంటే ఖతులు ఎలా ఉంటుంది, సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది కదా)

ఫుటర్  - దిగువసూచీ (దిగువ సూచీ కంటే , పాదసూచీ బాగుంది కదా)

Freeze - చలరహిత (దీన్ని స్థంబన నుండి చలరహిత కు మార్చారు, కానీ నాకు అయితే స్థంబనే కరక్టుగా ఉందేమో అనిపిస్తుంది)

గ్యాలరీ - ప్రదర్శనశాల (గ్యాలరీ కూడా బాగానే పాపులర్ కదా వాడెయ్యవచ్చేమో)

గ్రూప్ - సమూహం (గుంపు బాగుంది కదా)

హెడర్ - ఎగువ సూచీ (పీఠిక నుండి ఎగువ సూచీకి మార్చారు, కాని పీఠికే బాగుంది కదా)

హైపర్ లింక్ - దీన్ని హైపర్ లింకు అనే తర్జుమా చేశారు మహాలంకె ఎలా ఉంటుంది?

Insert - ప్రవేశపెట్టు - (చొప్పించు ఎలా ఉంది?)

మాక్రోస్ - స్థూలములు బాగానే ఉంది కదా, మాక్రేస్ అని ఎందుకు మార్చారు?

Outline - బాహ్యరేఖ , నప్పలేదు ఇంకా మంచి పదం కావాలి.

పేజ్ - దీనికి పుట బాగానే ఉంది కదా పేజీ అని ఎందుకు మార్చారు

పాస్వర్డ్ - సంకేతపదం ఇప్పటికే బాగా వాడుకలోకి వచ్చినా , అనుమతి పదం అని ఎవరు వ్రాశారో కాని అది కూడా బాగానే ఉంది.

ప్లగ్ ఇన్ - పొడిగింత వాడవచ్చు, ప్లగ్గిన్ అనుట కంటే

Protect Cell - మార్పు రహిత అర (రక్షిత అర బాగానే ఉంది కదా , ఎందుకు మార్చారు)

Bug = దోషం అనవచ్చు కదా బగ్ అనుట కంటే

----
~Kiran Kumar Chava

2010/11/23 Krishnababu Krothapalli <k.me...@gmail.com>
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

arjuna rao chavala

unread,
Nov 23, 2010, 8:58:15 PM11/23/10
to indlinu...@lists.sourceforge.net, fuel-d...@lists.fedorahosted.org, తెలుగుపదం
Hi,

2010/11/23 Krishnababu Krothapalli <k.me...@gmail.com>
Telugu blogpost with more details and photos is at
http://teluginux.blogspot.com/2010/11/fuel-telugu-28-29-2010.html

Thanks
Arjun

arjuna rao chavala

unread,
Nov 23, 2010, 8:59:31 PM11/23/10
to telug...@googlegroups.com, fuel-d...@lists.fedorahosted.org, indlinu...@lists.sourceforge.net

2010/11/23 Krishnababu Krothapalli <k.me...@gmail.com>

krishna k

unread,
Nov 25, 2010, 5:07:31 AM11/25/10
to fuel-d...@lists.fedorahosted.org, telug...@googlegroups.com, indlinu...@lists.sourceforge.net
హాయ్,

      కిరణ్ గారు ధన్యవాదములు, నేను మీ పరిశీలనకు వీలుగా వుంటుందని భావించి FUEL పద జాబితాలోని పదముల సందర్భ వివవరణ గల
.ods ఫైలు లంకెను యిక్కడ యిస్తున్నాను గమనించ గలరు.
      https://fedorahosted.org/fuel/attachment/wiki/WikiStart/Fuel_context.ods

     కిందన మీరు యిచ్చిన సూచనలకు కొన్నిటికి నా అభిప్రాయం తెలిపాను. సభ్యుల స్పందన కూడా తెలియజేయండి, మీ సహాయంతో పునఃపరిశీలించి
మార్పులు చేర్పులు చేయవచ్చును.

2010/11/23 Kiran Kumar Chava <chava...@gmail.com>

Alignment హద్దుకనుగుణంగా (మరీ అంత బాగోలేదు, ఇంకా కొంచెం మంచి పదం కావాలి, పదంలా లేదు, ఏదో అర్థం వివరిస్తున్నట్టు ఉంది)

>దీని సందర్భం ఓపెన్ ఆఫీస్ లో  పాఠ్యాన్ని ఎడమవైపు, మధ్యలో, కుడివైపు.. లాగా చేయటం.  దీనికి లీనం అన్న అనువాదం ఉన్నది. నిబంధనకనుగుణంగా అన్నది చర్చకి వచ్చింది. దానికన్న హద్దుకనుగుణంగా మెరుగైనదనిపించి అలా చేశాం. చర్చలొ ఇంకేదైనా సలహాలు వస్తే పరిశీలించవచ్చు.

Applications అనువర్తనాలు నుండి అనువర్తనములుగా మార్చారు. ఎందుకలా? వ్యాకరణ పరంగా ఏది ఒప్పు??

>వ్యవహారికము మరియు క్లుప్తమనిపించింది.

Apply filters వడపోతలను అమలుపరుచు (మరీ మక్కీకి మక్కీగా ఉంది, సింపుల్గా వడకట్టు అనవచ్చు కదా)

>చర్చనీయమే

bookmark ఇష్టాంశము (సృజనశీలులెవరో పేజీక అని మంచి పదం నిష్పాదించిన గుర్తు, అదే వాడితే ఎలా ఉంటుంది?)

    >ఇది మైక్రోసాఫ్ట్ IE లో చూచినట్లు గుర్తు. ఫైర్‌ఫాక్స్ నందు కూడా గలదు, చర్చనీయమే

Calculator - దీనికి కాలుక్యులేటర్ అనే వాడితే బాగుంటుంది. గణణపరికరం కంటే. కాలుక్యులేటర్ ఇప్పటికే బాగా పాపులర్ అయి జనాల్లోకి చొచ్చుకోని వెళ్లిన పదం కదా. కొన్ని సార్లు గుండె రాయి చేసుకోని పాపులర్ అయిన ఆంగ్ల పదాలు అట్టే పెట్టేయటమే మంచిది. కనీసం కొత్త తెలుగు పదాలు ఇతర చోట్ల పాపులర్ అయ్యేంత వరకు. 

క్యాలాండర్ - దీనికి పంచాంగం అని వాడవచ్చు కదా.

కాన్సెల్ - దీనికి రద్దుచేయు అని ఇచ్చారు సింపుల్గా రద్దు అనవచ్చు కదా. 

చార్ట్ - పట్టిక అని మనకో పదం ఉంది కదా , చార్ట్ అని వాడే కంటే పట్టిక అని వాడటమే సులబం.

    >చార్ట్, టేబుల్ , గ్రిడ్ యివి వోకే చోట వాడినప్పుడు table = ప్టటిక అంటే మిగలిన వాటికి పద సూచన కావాలి

క్లియర్ - దీనికి శుబ్రంచేయు కంటే చివరలో ఈ చేయు ఎత్తేసి మరేదన్నా పదం పెడితే బాగుంటుందేమో. ఉదాహరణకు శుబ్రించు - ?

    > శుబ్రించు... చర్చనీయమే

కాలం - దీనికి నిలువ వరుస అని అన్నారు, కాని అది మరీ పెద్దగా బొత్తిగా అసృజనాత్మకంగా ఉంది. మరేదన్నా మంచి పదం దొరకవచ్చు వెతికితే.

కన్సాలిడేట్ - దీనికి ఒకటిగా చేర్చు అని అన్నారు. దానికంటే మూటకట్టు అనే తెలుగు పదం బాగా నప్పుతుంది కదా.

Datapilot - బహురాప దత్తాంశ సౌలభ్యం (దేవుడా! ఇంత కంటే మంచి పదం ఈ తెలుగు వాళ్లకు ప్రసాదించు మంచి దేవుడా)

డెస్క్ టాప్  - రంగస్థలం (అద్భుతంగా ఉంది

Detective ప్రస్తావనలు చూపు సౌలభ్యం (దేవుడా ఇంత కంటే మంచి పదం ఈ తెలుగు వాళ్లకు ప్రసాదించు మంచి దేవుడా)

Edit - సరిచేయు (దీనికంటే మార్చు , సింపుల్గా బాగుంది కదా)

   > change, revert గురించిన చర్చ వచ్చినప్పుడు యిదే అనువాదము సూచించారు. Edit - సరిచేయు అనువాదము వుపయోగంలో వుంది.

Expunge  శాస్వత తొలగింపు (దీనికంటే గెంటివేయు అంటే బాగుంటుంది కదా)

Extensions విస్తరింపులు (విస్తరింపులు బాగానే ఉంది కానీ పొడిగింతలు ఇంకా బాగున్నట్టు లేదు)

   > పొడిగింత బాగుంది

ఫైల్ (ఫైలు బాగానే ఉంది కానీ దస్త్రం ఎలా ఉంటుంది)

   > మీరు క్యాల్కులేటర్ కు సూచించిన విధంగానే, పైలు కూడా వ్యావహారికంగా బాగా వినియోగంలోనే వుంది అనే ఆలోచన

ఫాంట్స్ (అక్షరశైలులు , దీని కంటే ఖతులు ఎలా ఉంటుంది, సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది కదా)

  > బాగుంది

ఫుటర్  - దిగువసూచీ (దిగువ సూచీ కంటే , పాదసూచీ బాగుంది కదా)

Freeze - చలరహిత (దీన్ని స్థంబన నుండి చలరహిత కు మార్చారు, కానీ నాకు అయితే స్థంబనే కరక్టుగా ఉందేమో అనిపిస్తుంది)

గ్యాలరీ - ప్రదర్శనశాల (గ్యాలరీ కూడా బాగానే పాపులర్ కదా వాడెయ్యవచ్చేమో)

గ్రూప్ - సమూహం (గుంపు బాగుంది కదా)

హెడర్ - ఎగువ సూచీ (పీఠిక నుండి ఎగువ సూచీకి మార్చారు, కాని పీఠికే బాగుంది కదా)

హైపర్ లింక్ - దీన్ని హైపర్ లింకు అనే తర్జుమా చేశారు మహాలంకె ఎలా ఉంటుంది?

Insert - ప్రవేశపెట్టు - (చొప్పించు ఎలా ఉంది?)

మాక్రోస్ - స్థూలములు బాగానే ఉంది కదా, మాక్రేస్ అని ఎందుకు మార్చారు?

    > యింకా మంచి పదం దొరికితే బాగుండు

Outline - బాహ్యరేఖ , నప్పలేదు ఇంకా మంచి పదం కావాలి.

పేజ్ - దీనికి పుట బాగానే ఉంది కదా పేజీ అని ఎందుకు మార్చారు

పాస్వర్డ్ - సంకేతపదం ఇప్పటికే బాగా వాడుకలోకి వచ్చినా , అనుమతి పదం అని ఎవరు వ్రాశారో కాని అది కూడా బాగానే ఉంది.

ప్లగ్ ఇన్ - పొడిగింత వాడవచ్చు, ప్లగ్గిన్ అనుట కంటే

Protect Cell - మార్పు రహిత అర (రక్షిత అర బాగానే ఉంది కదా , ఎందుకు మార్చారు)

Bug = దోషం అనవచ్చు కదా బగ్ అనుట కంటే

    > error కూడా స్పురించవచ్చునేమో "దోషం"  అంటే

----
~Kiran Kumar Chava

2010/11/23 Krishnababu Krothapalli <k.me...@gmail.com>
Hi,

   Fuel Telugu evaluation process successfully completed and 578 words Fuel-Telugu word list released
and available in three formats .ods, .pdf and .po

   Please go through the evaluated terms and provide your feedback. Find more details here.

Thanks & Regards,
Krishna.

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

_______________________________________________
fuel-discuss mailing list
fuel-d...@lists.fedorahosted.org
https://fedorahosted.org/mailman/listinfo/fuel-discuss

ధన్యవాదములు,
కృష్ణ.

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Nov 25, 2010, 11:40:18 AM11/25/10
to telug...@googlegroups.com
నా అభిప్రాయాలు:
 
alignment = OpenOffice పాఠ్యం విషయంలో కనుక... "హద్దుకనుగుణంగా" అన్నది సరిపోయినా పదంలా కాక వివరణలా ఉంది. సంస్కృతాంగ్ల నిఘంటువులులో "పక్తిబద్ధం" అన్న పదముంది align అన్నదానికి. ఇదేదో బాగానే ఉన్నట్టుంది. లేదంటే దుష్టసమాసమైనా వినటానికి బాగుంటే చాలన్న సూత్రం ప్రకారం "హద్దుబద్ధం" అనవచ్చేమో.
applications = "అనువర్తనములు" అన్నది వ్యాకరణసూత్రాల ప్రకారం ఒప్పు. కానీ, వ్యవహారంలో "అనువర్తనాలు" అనే అంటున్నాము కదా.
apply filters = "వడకట్టు"కే నా వోటు.
calculator = "గణనముట్టు" అంటే ఎలా ఉంటుంది? బారెడు పదమూ కాక భాషాదారిద్ర్యమూ కాక... దుష్టసమాసమైనా ఆంగ్లికాంధ్రం కన్నా మంచిదేగా?
calendar = క్యాలెండరు అన్న ఆంగ్లికాంధ్రం చాలేమో. (పంచాంగం వేఱు... ఈ సందర్భంలో పూర్తిగా వేఱేనేమోనని నా అనుమానం. ఇక్కడ calendar అంటే తిథివారనక్షత్రాలను చూపేది కాక ఎవఱికి వాళ్ళు తాము చేయవలసిన పనుల చిట్టా వ్రాసుకునేది కావచ్చు, కదా?)
cancel = రద్దు బాగానే ఉంది.
chart = పట్టిక (తక్కిన పదాలకి తెలుగు దొఱికేదాకా ఉన్న తెలుగు పదాన్ని వదిలేస్తే ఆనక మార్చేది ఎవఱు!?)
clear = చెఱుపు? తుడుపు? (చెఱిపెయ్/తుడిపెయ్?) "శుభ్రించు" అన్నది వ్యాకరణదోషమే కాదు, వినటానికి చాలా ఇబ్బందిగా ఉంది (నాకు). "శుభ్రం చెయ్యి" అంటే క్లుప్తంగా లేద్దన్నది వాస్తవమైనా అది వాడుకలో ఉన్న పదమేనని, ఆంగ్లంలోనూ అన్ని పదాలూ క్లుప్తంగానే లేవని ఒప్పుకుంటే సరిపోతుందిగా.
column = నిలువు వరుస అన్నదే బాగుంది నాకు. అడ్డవరుస, నిలువువరుస అన్నవి ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నవే కదా.
consolidate = "మూటకట్టు" బాగుంది.
data pilot = "దత్తసారథి" అనే యథాతథానువాదంతో యిబ్బంది ఏముంది? (data అంటే "దత్తం"అనే కాకపోయినా అది వాడుకలోకి వచ్చేసిన మాటే కదానని "యథాతథ"మనన్నాను.)
desktop = "రంగస్థలం" బాగుంది.
Detective = OpenOffice Calcలో Detective వల్ల "ప్రస్తావనలు (precedents?) చూడటం" మాత్రమే కాక ఇంకా చాలా చేయవచ్చని తెలిసింది కాస్త వెతికితే. అటువంటప్పుడు "సంశోధకం" అంటే ఎలా ఉంటుంది? (నిజానికి యీ మాటకి సంస్కృతాంగ్ల నిఘంటువు చూపించిన అర్థం corrector అని. కానీ తెలుగువాఱికి తెలిసిన "శోధన" వెతుకులాటకి సంబంధించినదే కదా.)
edit = "దిద్దు" అంటే బాగుంటుందేమో?
expunge = "గెంటివేయు" బాగుంది. (గెంటెయ్?)
extensions = "పొడిగింతలు" చక్కగా ఉంది.
file = "దస్త్రం" అన్నది బహుళప్రాచుర్యం పొందిన పదమే కదా.
footer = "పాదసూచి" బాగుంది (చివఱన దీర్ఘమెందుకు?)
freeze = "స్తంభన" ("స్థంబన" కాదు) బాగుంది.
gallery = "ప్రదర్శనశాల" బాగానే ఉంది.
group = నేను సాధారణంగా "కూటమి" అని వాడతాను, "గుంపు" అన్న పదానికి వ్యవహారంలో విస్తృతి ఎక్కువ కనుక. (క్రియగా వాడవలసి వస్తే "గుంపు కట్టు" అన్నదే మంచిదేమో.)
header = శీర్షిక (పీఠిక అంటే పాదపీఠిక కూడా కావచ్చునేమో?)
hyperlink = linkకీ, hyperlinkకీ ఖచ్చితమైన తేడా ఏమీ లేనప్పుడు "లంకె" అని వదిలేయచ్చు కదా? (చూ. Andy Dingley's post @ <http://www.velocityreviews.com/forums/t162430-link-vs-hyperlink.html>. "మహా"లంకె కాదన్న అభిప్రాయం సబబేననిపిస్తోంది.)
insert = "చొప్పించు"కే నా వోటు.
macro = "స్థూలము" అన్న మాట వాడుకలో ఉందా? ఉంటే సరే కానీ ఆ పదం భావస్ఫోరకంగా (intuitive) లేదు.
outline = బరి? ఎల్ల? (ఈ మాటకి సందర్భాన్ని బట్టి మాఱుతుంది కదా.)
page = పుట అన్న తెలుగు పదం కనీసం ఒక శతాబ్దంగా ఉన్నదే కదా?
password = సంకేతపదం, అనుమతిపదం రెండూ బాగానే ఉన్నాయి. "సంకేతపదం" అన్నదే మఱింత అర్థవంతంగా ఉంది.
plugin = "అంతరముట్టు" అంటే ఎలా ఉంటుంది? ("పొడిగింత" అన్నది extensionకి వాడుతున్నాం కదా. రెండూ యించుమించుగా ఒకటే అయినా... వేఱే పదముంటే బాగుంటుందేమోనని నా ఊహ.)
protect cell = "రక్షిత అర" బాగానే ఉంది.
bug = "నలక" అంటే బాగుంటుందేమో?
 
పరిశీలించగలరు.
నచకి
 
--
http://forthesociety.blogspot.com/
http://nachaki.wordpress.com/
http://kirandotc.blogspot.com/

"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"

– Young Oxfam Poster

Kiran Kumar Chava

unread,
Nov 25, 2010, 12:53:34 PM11/25/10
to telug...@googlegroups.com
>> ఆంగ్లంలోనూ అన్ని పదాలూ క్లుప్తంగానే లేవని ఒప్పుకుంటే సరిపోతుందిగా
We have a problem with this argument. The problem, unique to Telugu translations, is these translations, words (new or old) are going to directly compete with counter-parts from English words. So if Telugu word is made difficult when compared to same English word - in the end English word is going to win the race and that's it. That is why we need beautiful, creative, meaningful, elegant Telugu translations for all words. As said Rome is not built in a day, so let us move in to the right direction and probably our next generation Telugu people may be fortunate enough to have alternative Telugu words in place, ready to use. 

----------------

Looks like we are going to be un-manageable with discussions in this amass of multiple words.  Is there any better way to track discussion of every word? Does FUEL provide some framework?  (it should be integrated with e-mail, not something like wiki discussions; From our experience unless people get a mail they are not going to reply, not going to participate in discussions. The little sparks, the little ideas, the little replies saying yes, no, are really helpful, useful to Telugu translation discussions) If there is no such thing, I will start mail discussion for every word in FULE list! 

[chavakiran] Rest inline [/chavakiran] 

ps: Looks like I am in high  today, writing more detailed lines than usually, probably you have to bear me for now :-) 

----
~Kiran Kumar Chava

2010/11/25 NaChaKi (Kiran Chakravarthula) <email4...@gmail.com>

నా అభిప్రాయాలు:
 
alignment = OpenOffice పాఠ్యం విషయంలో కనుక... "హద్దుకనుగుణంగా" అన్నది సరిపోయినా పదంలా కాక వివరణలా ఉంది. సంస్కృతాంగ్ల నిఘంటువులులో "పక్తిబద్ధం" అన్న పదముంది align అన్నదానికి. ఇదేదో బాగానే ఉన్నట్టుంది. లేదంటే దుష్టసమాసమైనా వినటానికి బాగుంటే చాలన్న సూత్రం ప్రకారం "హద్దుబద్ధం" అనవచ్చేమో.
applications = "అనువర్తనములు" అన్నది వ్యాకరణసూత్రాల ప్రకారం ఒప్పు. కానీ, వ్యవహారంలో "అనువర్తనాలు" అనే అంటున్నాము కదా.
apply filters = "వడకట్టు"కే నా వోటు.
calculator = "గణనముట్టు" అంటే ఎలా ఉంటుంది? బారెడు పదమూ కాక భాషాదారిద్ర్యమూ కాక... దుష్టసమాసమైనా ఆంగ్లికాంధ్రం కన్నా మంచిదేగా?
[chavakiran] 
ముట్టు అనే పదం మనం కొంచెం అవాయిడ్ చెయ్యాలేమో. ముట్టు అంటే స్ర్లీలు నెలవారీ మూడు రోజులకు వాడతారు అనుకుంటాను. పని ముట్టు ఉందనుకోండి. ముట్టు, అంటు అనే పదాలు కూడా ఈ సంధర్భంలో నేను  విన్నాను. 
[/chavakiran]  
calendar = క్యాలెండరు అన్న ఆంగ్లికాంధ్రం చాలేమో. (పంచాంగం వేఱు... ఈ సందర్భంలో పూర్తిగా వేఱేనేమోనని నా అనుమానం. ఇక్కడ calendar అంటే తిథివారనక్షత్రాలను చూపేది కాక ఎవఱికి వాళ్ళు తాము చేయవలసిన పనుల చిట్టా వ్రాసుకునేది కావచ్చు, కదా?)
[chavakiran] If Calendar can be overloaded, పంచాంగం can be overloaded. Also if Calendar is duel to English cultures' panchaMgaM is due to Telugu culture. Probably we can use it. I still vote for పంచాంగం. And it is apt. Now define those five tasks we can do with calendar? clue 1. remember meetings, 2. remember birth days ... [/chavakiran]  
cancel = రద్దు బాగానే ఉంది.
chart = పట్టిక (తక్కిన పదాలకి తెలుగు దొఱికేదాకా ఉన్న తెలుగు పదాన్ని వదిలేస్తే ఆనక మార్చేది ఎవఱు!?)
clear = చెఱుపు? తుడుపు? (చెఱిపెయ్/తుడిపెయ్?) "శుభ్రించు" అన్నది వ్యాకరణదోషమే కాదు, వినటానికి చాలా ఇబ్బందిగా ఉంది (నాకు). "శుభ్రం చెయ్యి" అంటే క్లుప్తంగా లేద్దన్నది వాస్తవమైనా అది వాడుకలో ఉన్న పదమేనని, ఆంగ్లంలోనూ అన్ని పదాలూ క్లుప్తంగానే లేవని ఒప్పుకుంటే సరిపోతుందిగా.
column = నిలువు వరుస అన్నదే బాగుంది నాకు. అడ్డవరుస, నిలువువరుస అన్నవి ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నవే కదా.
consolidate = "మూటకట్టు" బాగుంది.
data pilot = "దత్తసారథి" అనే యథాతథానువాదంతో యిబ్బంది ఏముంది? (data అంటే "దత్తం"అనే కాకపోయినా అది వాడుకలోకి వచ్చేసిన మాటే కదానని "యథాతథ"మనన్నాను.)
desktop = "రంగస్థలం" బాగుంది.
Detective = OpenOffice Calcలో Detective వల్ల "ప్రస్తావనలు (precedents?) చూడటం" మాత్రమే కాక ఇంకా చాలా చేయవచ్చని తెలిసింది కాస్త వెతికితే. అటువంటప్పుడు "సంశోధకం" అంటే ఎలా ఉంటుంది? (నిజానికి యీ మాటకి సంస్కృతాంగ్ల నిఘంటువు చూపించిన అర్థం corrector అని. కానీ తెలుగువాఱికి తెలిసిన "శోధన" వెతుకులాటకి సంబంధించినదే కదా.)
edit = "దిద్దు" అంటే బాగుంటుందేమో?
expunge = "గెంటివేయు" బాగుంది. (గెంటెయ్?)
extensions = "పొడిగింతలు" చక్కగా ఉంది.
file = "దస్త్రం" అన్నది బహుళప్రాచుర్యం పొందిన పదమే కదా.
footer = "పాదసూచి" బాగుంది (చివఱన దీర్ఘమెందుకు?)
freeze = "స్తంభన" ("స్థంబన" కాదు) బాగుంది.
gallery = "ప్రదర్శనశాల" బాగానే ఉంది.
group = నేను సాధారణంగా "కూటమి" అని వాడతాను, "గుంపు" అన్న పదానికి వ్యవహారంలో విస్తృతి ఎక్కువ కనుక. (క్రియగా వాడవలసి వస్తే "గుంపు కట్టు" అన్నదే మంచిదేమో.)
header = శీర్షిక (పీఠిక అంటే పాదపీఠిక కూడా కావచ్చునేమో?)
hyperlink = linkకీ, hyperlinkకీ ఖచ్చితమైన తేడా ఏమీ లేనప్పుడు "లంకె" అని వదిలేయచ్చు కదా? (చూ. Andy Dingley's post @ <http://www.velocityreviews.com/forums/t162430-link-vs-hyperlink.html>. "మహా"లంకె కాదన్న అభిప్రాయం సబబేననిపిస్తోంది.)
[chavakiran] Agree we can use లంకె even for hyperlink. [/chavakiran]  
insert = "చొప్పించు"కే నా వోటు.
macro = "స్థూలము" అన్న మాట వాడుకలో ఉందా? ఉంటే సరే కానీ ఆ పదం భావస్ఫోరకంగా (intuitive) లేదు.

[chavakiran] it is like this Micro కి సూక్ష్మం అనే పదం బహుళ ప్రచారంలో ఉంది. సూక్ష్మం, స్థూలం మనకు జంట పదాలు కదా. [/chavakiran]  

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Nov 25, 2010, 1:02:37 PM11/25/10
to telug...@googlegroups.com
I agree, regarding a discussion that’s more focused on a word-to-word basis. (I admit that the delay in my response was because there was a huge list of words to consider and think about and comment.)
 
I’ll withhold my comments on the words themselves for the discussion to proceed further.
 
Kiran/NaChaKi
--
http://forthesociety.blogspot.com/
http://nachaki.wordpress.com/
http://kirandotc.blogspot.com/

"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"

– Young Oxfam Poster

sudhir kumar

unread,
Nov 26, 2010, 10:54:20 PM11/26/10
to telug...@googlegroups.com
నమస్కారము
calendar = ' దిన సూచి ' లేదా 'దిన దర్శిని' అందము బాగుంటుందేమో ఆలోచించగోరుతున్నాను
 
రామానుజం సుధీర్ కుమార్

Krishnababu Krothapalli

unread,
Jan 4, 2011, 7:19:45 AM1/4/11
to తెలుగుపదం, Kiran Kumar Chava, fuel-d...@lists.fedorahosted.org, indlinu...@lists.sourceforge.net, అర్జున్ రావు చవల
FUEL పదజాబితా పై తెలుగుపదం నందు వచ్చిన సూచనలకు స్పందిస్తూ అర్జున రావుగాను నేను ఆయా పదములకు అనువాదములు చేసి, అలా చేయుటకు కారణములు వివరించుతూ
యిక్కడ తెలుపడం జరిగింది, గమనించగలరు...
Fuel Term               Evaluated Translation                Current Translation                     Reson for current decision
Alignment               హద్దుకనుగుణంగా                                      అనుగుణం                                దీనితో మిగతా వ్యుత్పత్తి సులభమవుతంది, ఎడమ అనుగుణం, ఎగువ అనుగుణం
Bookmark                ఇష్టాంశము                                               ఇష్టాంశము                                పేజిక నేరు అనువాదం లా వుంది. తెలుగు వాడుకలోలేదు. ఇష్టాంశము అన్ని మాధ్యమాలకు
                                                                                                                                        అనువైనది.
Calculator             గణనపరికరం                                              కేల్క్యులేటర్                               సరియైన ఉచ్ఛారణ (dictionary.com)
Calender               క్యాలెండరు                                                 క్యాలెండరు                                కంప్యూటర్ లో చూపేది నెల, తేది, వారం మాత్రమే అందువలన పంచాంగం సరిపోదు.
Cancel                   రద్దుచేయు                                                 రద్దు
Chart                     చార్టు                                                       చార్ట్                                        టేబుల్ కి కూడా పట్టిక అని వస్తుంది. చార్ట్ తెలుగు వాడుకలోకి వచ్చింది
Clear                     శుభ్రంచేయు                                               తుడిపేయి                                  అన్ని సందర్భములలోను సరిపోతుంది.
Consolidate          ఒకటిగాకూర్చు                                            ఒకటిగాచేర్చు                              అనువర్తనంలో రెండు మాత్రికలను కావాలసిన లెక్క ద్వారా ఒక చోటకు చేర్చుట
DataPilot              బహురూపదత్తాంశ సౌలభ్యం                               దత్తాంశ చుక్కాణి
Edit                      సరిచేయు                                                   సరిచేయు                                  Modify అన్న అదేనేమోకదా?, change కీ కూడా “మార్చు” వాడుతున్నాము కదా?
Expunge              శాశ్వత తొలగింపు                                           శాశ్వత తొలగింపు                          దత్తాంశానికి గెంటివేయటం సరిపోలేదు
Fonts                   అక్షరశైలులు                                                 అక్షరశైలులు                                ఖతులు అంత వాడుకలోలేదు
Footer                  దిగువ సూచి                                                దిగువసూచి                                 కొన్ని పుస్తకములలో పీఠిక అన్నది ప్రవేశిక లా  వాడారు కనుక Header ని ఎగువ సూచి గా
                                                                                                                                        మార్చాము. అందువలన Footer ని దిగువసూచి గా వాడడమైనది.
Freeze                 చలరహిత                                                   స్తంభించు
Gallery                 ప్రదర్శనశాల                                                గ్యాలరీ                                      ప్రదర్శనశాలలో గ్యాలరీ ఒక భాగంగా గుర్తిద్దాము.
Group                  సమూహం                                                 గుంపు                                       గుంపు కి బుణాత్మక అర్థం వాడుకలో వుంది.(ఉదా: గుంపుని చెల్లా చదరగొట్టారు.)
Header                ఎగువ సూచి                                               ఎగువసూచి                                  (చూడండి  Footer దగ్గర కారణం)
Hyperlink           హెపర్‌లింకు                                                 హైపర్లింకు                                   కంప్యూటర్ శాస్త్రంలో కొన్ని మౌలిక పదాలు లిప్యంతరీకరణంలో వాడితేనే బాగుంటుంది.
Insert                  ప్రవేశపెట్టు                                                   చొప్పించు                                   
Macros                మాక్రోస్                                                     మాక్రోస్                                     మాక్రోస్ అనునవి స్క్రిప్టు అధారంగా ముందుగా నిర్ణయించిన ఆదేశాల వరుసను గూడా నిర్వర్తించును
                                                                                                                                       గనుక, మాక్రోస్ గానే వుంచితే బాగుండును, లిప్యంతరీకరణే బాగుంటుందని అనిపిస్తోంది
Page                     పేజీ                                                         పేజి                                         పుట  పత్రికలలో వాడుకలేదు, పేజి అనునది రోజువారీ వాడుకలో బాగా యిముడుకు పోయింది అదే
                                                                                                                                      బాగుంటుందని అనిపిస్తోంది.
Password             సంకేతపదము                                              సంకేతపదం                                అనుమతిపదంలో అంత స్పష్టమైన  రహస్యమనే భావన లేదు
Plug-in                ప్లగ్-యిన్                                                  ప్లగ్-యిన్                                  Extensionఅన్న పదానికి విస్తరణ వాడుకలోవుంది. Extension officer
                                                                                                                                      Enhancement పొడిగింత, దీనికి దగ్గరగా వుందనిపిస్తోంది
Protect Cell        మార్పురహిత అర                                         రక్షిత అర                                  
Submit Bug Report బగ్ నివేదికను పంపు                                  బగ్                                         వ్యత్పత్తి పదాల అర్థాలకు అనువుగా వుండటానికి  ఇంగ్లిషు పదాన్నే లిప్యంతరీకరిద్దాం.
                                                                                                                                       వుదా: debug కు డీబగ్

                 ఈ అనువాదములను FUEL ప్రోజెక్టు పేజీనందు నమోదుచేసి, దీనిపై వచ్చిన వివరణలను మరియొక విడుదలగా విడుదల చేయవచ్చును.

ధన్యవాదములు,
కృష్ణ.
_______________________________________________ fuel-discuss mailing list fuel-d...@lists.fedorahosted.org https://fedorahosted.org/mailman/listinfo/fuel-discuss

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jan 4, 2011, 7:44:38 AM1/4/11
to తెలుగుపదం
Clear కి పాత తెలుగు పుస్తకాల్లో సరాళము అనే పదం వాడారు. ఉదా : - బాట
సరాళము

To clear - సరాళం చేయు
దీని ప్రాస్తావిక అర్థం "తొలగించు" అయితే అదే వాడ్డం మంచిది.

Alignment - పొందిక/ అమర్పు ?
Right alignment - కుడిచేతివైపు పొందిక ?
Left alignment - ఎడం చేతివైపు పొందిక ?
align - అమర్చు ?

Reply all
Reply to author
Forward
0 new messages