తెలుగులో క్తాంతాలు - చరిత్ర, కల్పన

Visto 8 veces
Saltar al primer mensaje no leído

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

no leída,
25 nov 2009, 23:40:2425/11/09
a telug...@googlegroups.com
’క్త’ ప్రత్యయం ఒక పదనిష్పాదన సాధనం. దీన్ని కలిగి ఉన్న క్రియాధాతువు కర్తని కాక కర్మను ఉద్దేశిస్తుంది. క్తాంతాల ఉపయోగాన్ని మనం సంస్కృతం ద్వారా గ్రహించాం. ఉదాహరణకి--

పాలకుడు - కర్తని సూచిస్తే
పాలితుడు - కర్మని సూచిస్తుంది.
ప్రభావకుడు - కర్తని సూచిస్తే
ప్రభావితుడు - కర్మని సూచిస్తుంది.

ఇక్కడి పదాంత తకారానికే ’క్” ప్రత్యయం అని పేరు. ఇలాంటివే మఱికొన్ని పదాలు :

వచనం - ఉక్తం
పరిశోధన - పరిశుద్ధం
ప్రబోధ - ప్రబుద్ధం
ఉపదేశం - ఉపదిష్టం
దర్శనం - దృష్టం
స్పర్శనం - స్పృష్టం
కరణం - కృతం
భరణం - భృతం
హరణం - హౄతం
ఆహ్వానం - ఆహూతం
నయనం (నడిపించడం) - నీతం
జయం - జితం
గమనం (పోవడం) -గతం
నమనం - నతం
మననం - మతం
హననం - హతం
రమణం - రతం
శ్రవణం - శ్రుతం
హవనం - హుతం మొ||

ఇలాంటివి ఇంగ్లీషులోను, ఫ్రెంచిలోను కూడా చాలా విఱివిగా వాడబడతాయి. ఇంగ్లీషులో ఈ నిర్మాణాలకి past participles అని పేరు. ఉదాహరణకి -

prove - proven
sink - sunken
drink - drunken మొ||

ఫ్రెంచి క్తాంతాలు ఇంగ్లీషు ద్వారా మనకి పరిచయమయ్యాయి. అచ్చ ఇంగ్లీషు క్రియాధాతువులక్కూడా ఫ్రెంచి ’క్త”ప్రత్యయాన్ని (ee) తగిలించి వ్యవహరించడం సమకాలీన విలాసం (contemporary fashion). ఉదాహరణకి :-

lease - lessee
donor - donee
retirement - retiree మొ||

అచ్చతెలుగులో కూడా ఇలాంటి నిర్మాణాలు చెయ్యడానికి అవకాశం ఉందని కొన్ని పదాల ద్వారా తెలుస్తోంది. కానీ అలాంటి నిర్మాణాల సూత్రీకరణకి సాంప్రదాయిక తెలుగు వ్యాకరణాల్లో స్థానమివ్వడం జఱగలేదు. కారణం - ఒకటి, ఈ అవకాశం ఉన్నట్లు మన పూర్వీకులు గ్రహించక పోవడం. గ్రహించక పోవడానికి కారణం - ఆ పదాల మార్గంలో నూతనపదాల కల్పన అప్పటికే స్తంభించిపోయి ఉండడం. సంస్కృతం నుంచి అన్ని పదాల్నీ యథాతథంగా దిగుమతి చేసుకోవడానికి అలవాటుపడి ఉండడం. రెండోది, మన పూర్వుల్లో అధికసంఖ్యాకులు వల్లమాలిన సంస్కృతాభిమానం చేత అంధీకృతులు. ఈ పిచ్చి అభిమానం మాతృభాషని ఇతోఽధికంగా పరిశోధించడానికి అప్పట్లో ఒక పెద్ద మానసిక ఆటంకం (mental barrier) గా మారింది. ఆ శోధించిన కొద్దిపాటి భాషని కూడా సంస్కృత పద్ధతుల్లోనే శోధించడానికి మొగ్గుచూపారు. తెలుగుని ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్న భాషగా వారు పరిగణించలేదు. తెలుగుభాషకే సొంతమైన, విలక్షణమైన అనేక విషయాలు సంస్కృత వైయాకరణ పరిభాషతో వివరించడానికి సాధ్యం కాకపోవడంతో అవి అపరిష్కృతంగా, అసూత్రీకృతంగా మిగిలిపోయాయి. తత్‌ఫలితంగా ఆంధ్రభాషాభూషణం ఒక్కటి మినహాయిస్తే అహోబలపండితీయము మొ||న మన ప్రాచీన వ్యాకరణాలు సైతం సంస్కృతంలోనే సంస్కృత పద్ధతుల్లో వ్రాయబడ్డాయి.

క్రియాధాతువు చివఱ ’అ’ అనే ప్రత్యయాన్ని చేర్చడం ద్వారా తెలుగులో క్తాంతాలేర్పడతాయి. కొన్ని క్తాంతాల ద్వారా వాటికి మూలమైన ప్రాచీన క్రియాపదాన్ని పునరుద్ధరించవచ్చు కూడా. ఉదాహరణకి :-

తెలియు - తెల్ల (తెల్లము)
వెలియు - వెల్ల
పులియు - పుల్ల

పళియు (అర్థం తెలియదు. లభ్య నిఘంటువుల్లో లేదు. బహుశా ప్రవహించడం, జాఱడం, పడడం కావచ్చు) - పడియ (puddle)
పల్లం

పెళియు (అర్థం తెలియదు. లభ్య నిఘంటువుల్లో లేదు. బహుశా గట్టిపడడం, దగ్గఱదగ్గఱగా అవ్వడం, అతకడం కావచ్చు) - పెళ్ళ

నలియు - నల్ల
ఎఱియు (బాధపడు) - ఎఱ్ఱ
మొఱయు (మ్రోయు) - మొఱ్ఱ (మొఱ)

తెలుగులో 'సు' అనే కృత్‌ప్రత్యయం కూడా ఉన్నట్లు కనిపిస్తున్నది.

పులియు - పులుసు (ఇదే రాయలసీమలో ’పులుచు”. బహుశా పులుచు సాధురూపం)

తెలియు - తెలుసు
పెళియు - పెళుసు (brittle)
ఇఱియు -ఇఱుసు (axis)

గుడియు (అర్థం తెలియదు. లభ్య నిఘంటువుల్లో లేదు. పరివేష్టించడం, చుట్టుముట్టడం కావచ్చు) - గుడుసు
 
అడియు (అర్థం తెలియదు. లభ్య నిఘంటువుల్లో లేదు. తొక్కడం కావచ్చు) - అడుసు (బుఱద slush).



నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

no leída,
25 nov 2009, 23:44:1625/11/09
a తెలుగుపదం
”ఇక్కడి పదాంత తకారానికే ’క్త” ప్రత్యయం అని పేరు.’’

అని సవరించుకొని చదవగలరు.

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

no leída,
26 nov 2009, 0:10:5826/11/09
a తెలుగుపదం
మఱికొన్ని తెలుగు క్తాంతాలు

పాయు (విడిపోవు, వీడిపోవు) - పాయ
కాఁచు - కాయ
ప్రేలు - ప్రేలాలు
కట్టు - కట్ట
కోయు - కోయ (కొయ్య)
చెక్కు - చెక్క

బహుశా ఆధునిక కర్మార్థక వాడుకలకీ వీటికీ ఏదో సంబంధం ఉండొచ్చునని కూడా నా అనుకోలు. ఉదాహరణకి తెలుగులో కర్మార్థకంలో వాడే ’బడు/ పడు" కి అక్కడ సాందర్భికమైన అర్థం ’అవ్వడం/ కావడం” అని.

చెప్పు అనే క్రియాధాతువు నుంచి పై మార్గంలో క్తాంతాన్ని నిష్పన్నం కావిస్తే--
’చెప్ప” అవుతుంది. అంటే ఏదైతే చెప్పడం జఱిగిందో ఆ మాట చెప్ప.
దాని ’పడు’ (అవ్వడం) చేర్చగా--
చెప్పన్ + పడింది = చెప్పబడింది. చెప్పబడిన మాటగా అయినది.
 
ఇవి ప్రస్తుతం నామవాచకాలు (nouns) గా వ్యవహారంలో ఉన్నాయి. కానీ వీటి మార్గంలోనే ఆధునిక అచ్చతెలుగు క్రియాధాతువుల నుంచి సరికొత్త క్తాంత విశేషణాల్ని (adjectives) కూడా కల్పించడానికి ప్రయత్నించాల్సి ఉంది. ఈ ప్రక్రియని ఇతోఽధికంగా ప్రోత్సహించి రచయితల్లో విశేష ప్రాచుర్యాన్ని కల్పించాల్సి ఉంది.  అప్పుడు మనం ప్రతి పదానికీ సంస్కృతం మొహమో, ఇంగ్లీషు మొహమో చూసే పని తగ్గుతుంది.

ఉదాహరణకి ఇలా కల్పించవచ్చు.

పోవు - పోవ (గమ్యం, destination) మొ||

kiran chittella

no leída,
26 nov 2009, 8:45:3226/11/09
a telug...@googlegroups.com
చాలా మంచి సమాచారం. ఆ మధ్య ఒబామా ప్రెసిడెంట్-ఎలెక్ట్ గా ఉన్నప్పుడు అధ్యక్ష-ఎన్నితుడు లాంటి  ప్రయోగం ఎవరన్నా చేస్తారేమో చూసాను. ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి అయిపోయి అధ్యక్షుడు అన్నదే వాడకపోతే ఇంకా పైన  చెప్పినలాంటి  ప్రయోగం చేస్తారనుకోవడం అత్యాశేనేమో.

2009/11/26 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

no leída,
26 nov 2009, 21:25:2426/11/09
a telug...@googlegroups.com
నేను పైన వ్రాసినదాన్ని బట్టి ’ఎన్నితుడు” అవసరం లేదనుకుంటా. ఎన్న సరిపోతుంది.

ఎన్న - n. & adj. ఎన్నికైనవాడు/ ఎన్నికైన స్త్రీ

Veeven (వీవెన్)

no leída,
26 nov 2009, 21:36:3026/11/09
a telug...@googlegroups.com

27 నవంబర్ 2009 7:55 am న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :

నేను పైన వ్రాసినదాన్ని బట్టి ’ఎన్నితుడు” అవసరం లేదనుకుంటా. ఎన్న సరిపోతుంది.

ఎన్న - n. & adj. ఎన్నికైనవాడు/ ఎన్నికైన స్త్రీ

ఎన్నిత కాస్త వివరంగా ఉంటుందేమో.

--
Read Telugu blogs @ koodali.org

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

no leída,
27 nov 2009, 2:52:2127/11/09
a telug...@googlegroups.com
దేనికి ఏ పదం కావాలని చర్చించడం లేదు. ఇక్కడ ఒక అచ్చతెలుగు ప్రత్యయాన్ని వెలికి తీయడం జఱిగింది. దాన్ని ఎలా ఉపయోగించాలో చర్చిస్తున్నాం.

ANANDASWARUP GADDE

no leída,
28 nov 2009, 4:29:1728/11/09
a telug...@googlegroups.com
2009/11/26 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:

ఆంధ్రభాషాభూషణం ఒక్కటి మినహాయిస్తే అహోబలపండితీయము
> మొ||న మన ప్రాచీన వ్యాకరణాలు సైతం సంస్కృతంలోనే సంస్కృత పద్ధతుల్లో
> వ్రాయబడ్డాయి.
>

ఇలాంటి విషయాలకి ఈమధ్య వచ్చిన మూలాధారాలు (resources) ఏమైనా ఉన్నయ్యా? నెనర్లు.
Swarup

Responder a todos
Responder al autor
Reenviar
0 mensajes nuevos