ఈ పదాల వాడుక సందర్భం ఇదీ:
మనం ఒక జాల పుటని సందర్శిస్తున్నామనుకోండి. ఆ పుటని సేవకి తయారు చేసి మన విహారిణికి పంపిస్తుంది. అయితే, ఆ తయారు చేయడమన్న ప్రక్రియ కొన్ని సార్లు వ్యయభరితం. ఆ పుటని ప్రతీసారీ తయారు చెయ్యకుండా, మొదటి సారి అభ్యర్థనకి తయారు చేసి కోశం (cache) లో పెట్టుకుంటుంది. ఆ పుట కోసం ఆ తర్వాత ఏదైనా అభ్యర్ధన వచ్చినప్పుడు ఆ పుటని మళ్ళీ తయారు చెయ్యకుండా, కోశం నుండి తీసి విహారిణికి పంపిస్తుంది. దీన్ని (అంటే కోశానికి తగలడాన్ని/కొట్టడాన్ని) hit అంటారు..అయితే, కోశంలో భద్రపరిచే పుటలకి కాల పరిమితి ఉంటుంది. ఆయా పుటలకి కోశంలో కాలం చెల్లిన తర్వాత వాటిని మళ్ళీ తయారుచేయాల్సి ఉంటుంది. ఒక పుట కోసం ఏదైనా అభ్యర్థన వచ్చినప్పుడు కోశం లోని కాపీ కనుక కాలంచెల్లి ఉంటే (అంటే, కోశాన్ని తప్పించుకుంది కాబట్టి) దాన్ని miss అంటారు.
ఇట్లు,
వీవెన్.