ప్రపంచ భాషల పరిరక్షణ పై వారు ప్రచురించిన
స్వేత పత్రాన్ని మనం సులభంగా గూగిలించచ్చు, ఓపిక వీలు ఉంటే చదవచ్చు కూడా.
నేను ఆ పత్రాన్ని పూర్తిగా చదివాను. " 30%కన్నా ఎక్కువ విద్యార్థులు మాతృభాష చదవకపోతే ఆ భాష అంతరించిపోతుంది" అని ఎక్కడా రాయక పోడమే కాదు, తెలుగుకి ఆ పరిస్తితి ఉన్నది అని ఎక్కడా పేర్కొనలేదు కూడా. ఆ మాటకొస్తే, తెలుగు గురించి ఎక్కడా ఏ రూపములో, ఏ విధంగానైనా వారు ప్రస్తావించలేదు.
No single factor is sufficient to assess the state of a community’s language. However, taken together, these nine factors can determine the viability of a language, its function in society and the type of measures required for its maintenance or revitalization. (emphasis mine)
I repeat: no. single. factor.
ఇక్కడ గణాంక విశ్లేషణ (statistical analysis) చాలా అవసరం. తెలుగుని మాతృ భాషగా భావించే విద్యార్థులు ఎంత మందో కొత్త surveyలు లేకుండా తెలుసుకోవడం అసాధ్యం. ఆ గణాంకం మాట పక్కన పెట్టితే, ఈ క్రింది ప్రశ్నలకు జవాబు తెలిస్తే మన విశ్లేషణ ఇంకా మెరుగుపడగలదు:
1) ఏటేటా, ఎంత మంది SSC పరీక్షలను ఇస్తున్నారు? వారిలో తెలుగు మాధ్యములో ఇస్తున్న వారు ఎంతమంది?
2) ఇంగ్లీషు మాధ్యమంలో చదివేవారిలో ఎంత మంది తెలుగుని second languageగా తీసుకుంటున్నారు?
3) అలాగే, cbse, icseలలో చదివేవారిలో ఎంత మంది తెలుగు చదువుతున్నారు?
4) పొరుగు రాష్ట్రాలైన తమిళ నాడు, కర్ణాటక, ఒరిస్సాలలో పదవ తరగతిలో తెలుగు చదువుకునే వారు ఎంత మంది?
ఈ గణాంకాలు గుగుల్ కి దూరంగా ఉన్నట్టు ఉన్నాయి, నాకు సులభంగా అందలేదు. (ఇంకా వెతికితే దొరకచ్చు, ఆసక్తి ఉన్న వారు RTI దరఖాస్తులతో తెలుసుకోవచ్చు) ఇవన్నీ objective ప్రశ్నలు, వీటికి జవాబులు లేకుండా తెలుగు భాష యొక్క భవిష్యత్తు గురించి మనం స్పష్టంగా ఆలోచించలేము.
--
Akshay Regulagedda | రేగులగెడ్డ అక్షయ్
తెలుగుదేల యెన్న దేశంబు తెలుగేను.