abandon

4 views
Skip to first unread message

త్రివిక్రమ్

unread,
Jun 17, 2007, 3:59:12 AM6/17/07
to telug...@googlegroups.com
abandon = ?
abandoned (adj) = అనాథ? (abandoned blogs=అనాథ బ్లాగులు)

--
త్రివిక్రమ్
"It is not how old you are, but how you are old."

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Jun 17, 2007, 4:49:49 AM6/17/07
to telug...@googlegroups.com
abondaon అంటే చేసే పనిని ఆపేయడం కదా..
 
http://www.answers.com/abandon ఇది చూశాక త్యజించు అనే పదం సరిపోతుందని పిస్తుంది.

 

Veeven (వీవెన్)

unread,
Jun 17, 2007, 4:55:42 AM6/17/07
to telug...@googlegroups.com
On 6/17/07, వెంకట రమణ (Venkata Ramana) <uvra...@gmail.com> wrote:
> http://www.answers.com/abandon ఇది చూశాక త్యజించు అనే పదం సరిపోతుందని
> పిస్తుంది.
కూల్. వదిలేసినకి మంచి పదం తట్టక చస్తున్నా.

ఐతే విశేషణంగా వాడేటప్పుడు "త్యజించిన బ్లాగులు" కంటే "త్యజించబడిన
బ్లాగులు" అన్నది రైటేమో?

swathi

unread,
Jun 18, 2007, 1:58:11 AM6/18/07
to telug...@googlegroups.com
త్యజించిన కి, త్యజించబడిన కి
abandon and abandoned కి మధ్య ఉన్నంత తేడా ఉంది.
కబట్టి రెండోదే సరైనది.


--
http://swathikumari.wordpress.com
Regards,
Swathi.

Tummala Sirish Kumar

unread,
Jun 20, 2007, 2:40:30 AM6/20/07
to telug...@googlegroups.com
నిజానికిది నేను రాయాల్సింది కాదు. రాయాల్సిన వాళ్ళు రాయకపోయే సరికి నేను సాహసిస్తున్నా!

ఈ బడు అనేది  - కర్మణి ప్రయోగం - మనకతకదు. మాట్లాడేటపుడు అసలే వాడం. రాసేటపుడు కూడా ఎక్కడో  తప్ప వాడం. చదివేందుకు ఎబ్బెట్టుగా ఉంటది. "విజయవాడ, బెజవాడ అని కూడా అనబడుతుంది", "విజయవాడను బెజవాడ అనీ అంటారు" - ఈ రెంటి లోని తేడా మనకు తెలీంది కాదు. ఎబాండన్‌డ్ విలేజ్ ను త్యజించబడిన గ్రామం అనే దానికన్నా త్యజించిన గ్రామం అంటేనే బాగుంటుందనుకుంటా. సూటి అర్థంలో "గ్రామమే దేన్నో త్యజించినట్టుగా" ధ్వనించినా సందర్భోచిత అర్థం తీసుకోవాలనుకుంటా. "ప్రజలు వదలిపెట్టిన గ్రామం" అని అంటే బాగుంటుంది గానీ, "ప్రజలచే వదలిపెట్టబడిన గ్రామం" అంటే బాలేదు కదా!
-శిరీష్

Veeven (వీవెన్)

unread,
Jun 20, 2007, 3:03:34 AM6/20/07
to telug...@googlegroups.com
On 6/20/07, Tummala Sirish Kumar <sirish...@gmail.com> wrote:
> ఈ బడు అనేది - కర్మణి ప్రయోగం - మనకతకదు. మాట్లాడేటపుడు అసలే వాడం. రాసేటపుడు
> కూడా ఎక్కడో తప్ప వాడం. చదివేందుకు ఎబ్బెట్టుగా ఉంటది. "విజయవాడ, బెజవాడ అని
> కూడా అనబడుతుంది", "విజయవాడను బెజవాడ అనీ అంటారు" - ఈ రెంటి లోని తేడా మనకు
> తెలీంది కాదు. ఎబాండన్‌డ్ విలేజ్ ను త్యజించబడిన గ్రామం అనే దానికన్నా
> త్యజించిన గ్రామం అంటేనే బాగుంటుందనుకుంటా. సూటి అర్థంలో "గ్రామమే దేన్నో
> త్యజించినట్టుగా" ధ్వనించినా సందర్భోచిత అర్థం తీసుకోవాలనుకుంటా. "ప్రజలు
> వదలిపెట్టిన గ్రామం" అని అంటే బాగుంటుంది గానీ, "ప్రజలచే వదలిపెట్టబడిన గ్రామం"
> అంటే బాలేదు కదా!

'బడిన'కి చిన్నరూపం 'బడ్డ' కూడా ఉంది. త్యజించబడ్డ గ్రామం. మీరు
సూచించినట్టు వీటిని వాడకపోతేనే మంచిది.

ఈ 'బడిన' బారిన పడకుండా ఉండటానికి ఇలా అనువదిస్తున్నాం:

You message has been sent. = 'మీ సందేశం పంపించాం.'
Preferences saved. = అభిరుచులు భద్రపరిచాం.
Updated! = తాజాకరించాం!

ఈ మెయిలు రాస్తున్నప్పుడు జీమెయిలు ఆటోసేవ్ చేసి ఈ సందేశం చూపించింది:
"Draft autosaved at 12:31 pm"

దీన్ని తెలుగులో, నా ప్రయత్నం:

* డ్రాఫ్టుని 12:31 pm కి భద్రపరిచాం.

మరింత మెరుగైన అనువాదాలకు ఆహ్వానం.

Veeven (వీవెన్)

unread,
Jun 20, 2007, 3:22:06 AM6/20/07
to telug...@googlegroups.com
ఈ 'బడిన' లేకుండా మరో అనువాదం చేసా:

English: Mail (will not be published)
Telugu: మెయిలు (బయటకు చూపించం)

http://translate.wordpress.com/trans.php?string_id=7af3bdd384397a94072a10a3b4b304ea&local_id=te

Tummala Sirish Kumar

unread,
Jun 20, 2007, 3:35:47 AM6/20/07
to telug...@googlegroups.com
తెవికీలో ఈ పని (బడులు తొలగించబడుట) ఇదివరకే జరిగింది. ఇతర అనువాదాల కోసం అక్కడి ఉదాహరణలు తీసుకోవచ్చు, అలాగే గూగుల్ గుంపుల అనువాదాలు కూడా!

Tummala Sirish Kumar

unread,
Jun 20, 2007, 4:06:49 AM6/20/07
to telug...@googlegroups.com
తెవికీలో ఇంకా కొన్ని బడులు మిగిలి ఉన్నట్టుగా చూసాను.

On 6/20/07, Tummala Sirish Kumar <sirish...@gmail.com > wrote:

రాకేశ్ ఆచంట

unread,
Jun 20, 2007, 12:12:16 PM6/20/07
to తెలుగుపదం
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=abandon&display=utf8&table=brown

బ్రౌను నిఘంటువు ఉందిగా..

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jun 23, 2007, 3:01:26 PM6/23/07
to తెలుగుపదం
మక్కికి మక్కి అనువాదాలు మంచివి కావు. అవీ బడుల్లాంటివే. abandoned blogs
కి విరమించిన బ్లాగులంటే బావుంటేదేమో ! (సమాస రూపంలో విరమిత బ్లాగులు)

రాకేశ్ ఆచంట Vraasenu:

Reply all
Reply to author
Forward
0 new messages