Account Options

  1. Sign in
The old Google Groups will be going away soon, but your browser is incompatible with the new version.
Google Groups Home
« Groups Home
import, export vs. download, upload
There are currently too many topics in this group that display first. To make this topic appear first, remove this option from another topic.
There was an error processing your request. Please try again.
flag
  7 messages - Expand all  -  Translate all to Translated (View all originals)
The group you are posting to is a Usenet group. Messages posted to this group will make your email address visible to anyone on the Internet.
Your reply message has not been sent.
Your post was successful
 
From:
To:
Cc:
Followup To:
Add Cc | Add Followup-to | Edit Subject
Subject:
Validation:
For verification purposes please type the characters you see in the picture below or the numbers you hear by clicking the accessibility icon. Listen and type the numbers you hear
 
వీవెన్ Veeven  
View profile  
 More options Mar 8 2009, 12:29 pm
From: Veeven (వీవెన్) <vee...@gmail.com>
Date: Sun, 8 Mar 2009 21:59:03 +0530
Local: Sun, Mar 8 2009 12:29 pm
Subject: import, export vs. download, upload

import, export:
వీటికి దిగుమతి, ఎగుమతులని పర్యాయ పదాలుగా ఎప్పటి నుండో వాడుకలో ఉన్నాయి.

download, upload
జాలానికి సంబంధం ఉన్న ఈ పదాలకి కొన్నిసార్లు (వివిధ ఉపకరణాల స్థానికీకరణలో)
దిగుమతి ఎగుమతులనే వాడేసాం. జాల ఉపకరణాలలో download, upload కాకుండా వేరే
విధంగా import, export అనే వాడుకలు కూడా ఉంటున్నాయి. నేను మరిన్ని ఉపకరణాల
స్థానికీకరణలో పాలుపంచుకుంటున్న కొద్దీ importకి, downloadకీ మరియు exportకి
మరియు uploadకి తేడాలు స్పష్టమవుతున్నాయి. (క్రింది వివరణ మరియు ఉదాహరణలు
చూడండి.) అందుకని download మరియు upload లకు ప్రత్యామ్నాయ పదాలు వెతికే ఈ
ప్రయత్నం.

ముందుగా ఈ పదాల వాడుక చూద్దాం:

*import*:
ఒక ఉపకరణం (లేదా ఉపకరణ వ్యవస్థ) *లోనికి* భోగట్టాని దిగుమతి చేయడం. జాల
ఉపకరణమైతే మొదట మన భోగట్టాని ఎక్కించాలి (upload).

*export*:
ఒక ఉపకరణం *నుండి* భోగట్టాని బయటి వాడుక కోసం ఎగుమతి చేయడం. జాల ఉపకరణమైతే
ఎగుమతైన భోగట్టాని మనం దింపుకోవాలి (download).

*download*:
ఒక జాల గూడు నుండి ఫైళ్ళని మన కలనయంత్రం లోనికి దింపుకోవడం.

*upload*:
మన కలనయంత్రం నుండి ఫైళ్ళని జాల గూడులోనికి ఎక్కించడం.

ఉదాహరణలు:

   - మీరు ఒక విహారిణిని మరో విహారిణికి మారుతుంటే, సాధారణంగా మీ పాత
   విహారిణిలోని పేజీకలు (bookmarks) గట్రా రెండవ విహారిణిలోనికి దిగుమతి (import)
   చేసుకుంటారు.
   - జాల ఉపకరణాలకి వస్తే, మీరు యాహూ నుండి జీమెయిలుకి మారితే, మీ యాహూ
   ఖాతాలోని పరిచయాల(contacts)ని మీ జీమెయిల్ ఖాతాలోనికి దిగుమతి (import)
   చేసుకుంటారు.
   - బ్లాగర్ నుండి వర్డుప్రెస్సుకి బ్లాగుని మారిస్తే, (నేరుగా జాలం ద్వారా
   వర్డుప్రెస్ లోనికి దిగుమతి చేసుకోవచ్చు కానీ ఇలా చూద్దాం.) బ్లాగర్ నుండి మొదట
   మన టపాలని ఎగుమతి (export) చేసుకోవాలి. ఆ ఎగుమతైన టపాల భండారపు ఫైలుని
   దింపుకోవాలి (download). దీన్ని వర్డుప్రెస్ లోనికి దిగుమతి (import) చేసుకునే
   పద్ధతిలో భాగంగా మొదట దాన్ని వర్డుప్రెస్ లోనికి ఎక్కించాలి (upload). ఆ
   ఎక్కించిన ఫైలునుండి వర్డుప్రెస్ టపాలను దిగుమతి చేసుకుంటుంది.
   - మన బ్లాగులోని టపాలని మన కలనయంత్రంలో భద్రపరచుకోవాలన్నా మన బ్లాగునుండి
   వాటిని ఎగుమతి (export) చేసుకోవాలి

మామూలు ఉపకరణాల (మన కలనయంత్రంలో జాల సంధానం అవసరం లేకుండా నడిచేవి) లో upload
మరియు download ఉండే ప్రసక్తి లేదు. కానీ జాల ఉపకరణలలో (జాల సంధానంతో
వ్యవహరించే విహారిణుల లాంటి ఉపకరణాలలో) ఇవి import మరియు exportలతో కలిసిపోయి
అనువాదాలలో అయోమయాన్ని నెలకొల్పే అవకాశం ఉంది.

సంక్షిప్తంగా, ఎగుమతి (export) అనేది ఉపకరణంలోని భోగట్టాని మనం దింపుకోగలిగే
(download-able) విధంగా మార్చి అందిస్తుంది. జాల ఉపకరణంలోనికి భోగట్టాని
పెద్దమొత్తంలో దిగుమతి (import) చేయాలంటే అది మనం ఫైలుని ఎక్కించడం (upload)
ద్వారా మొదలుపెడతాం. ఈ ఆధారంగా, download, upload లకి తెలుగు పదాలకి వద్దాం:

   - *download*: *క్రియ* దింపుకొను; *నామవాచకం* దింపుకోలు (*బహువచనం*దింపుకోళ్ళు)
   - *upload*: *క్రియ* ఎక్కించు; *నామ.* ఎక్కింపు (*బహు*. ఎక్కింపులు)

downloadకి మరియు importకి uploadకి మరియు exportకి మధ్య (సున్నితమైన) తేడాని
కొనసాగించడానికి దిగుమతి మరియు ఎగుమతి అన్న పదాలని download మరియు uploadలకి
సమానార్థకాలుగా వాడకుండా ఉంటే మేలని అనుకుంటున్నాను.

అదీ సంగతి! మీ సలహాలూ, సూచనలూ తెలియజేయండి.

--
Read Telugu blogs @ koodali.org

You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli  
View profile  
 More options Mar 8 2009, 3:22 pm
From: తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <subtadepa...@gmail.com>
Date: Mon, 9 Mar 2009 00:52:59 +0530
Local: Sun, Mar 8 2009 3:22 pm
Subject: Re: [తెలుగుపదం] import, export vs. download, upload

Upload, download కి నేను మొదట్లో "ఎక్కింపు, దింపుకోలు" అనే వాడేవాణ్ణి. నా
బ్లాగు <http://www.tadepally.com>లో ఇచ్చిన తెలుగు పదజాలంలో కూడా అవే
పెట్టాను. ఆ తరువాత బహుజన వ్యవహార ప్రాబల్యానికి తలొగ్గి నేను కూడా ఎగుమతులూ,
దిగుమతులూ అని వాడ్డం మొదలుపెట్టాను. కానీ నాకు లోలోపల తెలుసు - impotr, export
అనే వాటికి కంప్యూటర్ ప్రపంచంలో వేరే అర్థాలున్నాయని, ఈ రకమైన వాడుక మనల్ని ఏదో
ఒకరోజున గొప్ప అయోమయంలోకి నెడుతుందనీ ! సరిగ్గా మీరూ అదే వక్కాణిస్తున్నారు.
సంతోషం.

౨౦౦౯ మార్చి ౮ ౨౧:౫౯ న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :

--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable
to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
writing in Telugu, use http://lekhini.org

You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Praveen Garlapati  
View profile  
 More options Mar 8 2009, 3:34 pm
From: Praveen Garlapati <praveengarlap...@gmail.com>
Date: Mon, 9 Mar 2009 01:04:36 +0530
Local: Sun, Mar 8 2009 3:34 pm
Subject: Re: [తెలుగుపదం] import, export vs. download, upload

2009/3/8 Veeven (వీవెన్) <vee...@gmail.com>

> import, export:
> వీటికి దిగుమతి, ఎగుమతులని పర్యాయ పదాలుగా ఎప్పటి నుండో వాడుకలో ఉన్నాయి.

> download, upload
> జాలానికి సంబంధం ఉన్న ఈ పదాలకి కొన్నిసార్లు (వివిధ ఉపకరణాల స్థానికీకరణలో)
> దిగుమతి ఎగుమతులనే వాడేసాం. జాల ఉపకరణాలలో download, upload కాకుండా వేరే
> విధంగా import, export అనే వాడుకలు కూడా ఉంటున్నాయి. నేను మరిన్ని ఉపకరణాల
> స్థానికీకరణలో పాలుపంచుకుంటున్న కొద్దీ importకి, downloadకీ మరియు exportకి
> మరియు uploadకి తేడాలు స్పష్టమవుతున్నాయి. (క్రింది వివరణ మరియు ఉదాహరణలు
> చూడండి.) అందుకని download మరియు upload లకు ప్రత్యామ్నాయ పదాలు వెతికే ఈ
> ప్రయత్నం.

నిజమే నాకూ ఎన్నో సార్లు స్థానికీకరణలో ఈ విషయంలో సందిగ్ధం ఎదురయింది.
విడిగా పదాలు సృష్టించాల్సిందే.

--
- ప్రవీణ్ గార్లపాటి

నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com
ఈ-తెలుగు సహాయకేంద్రం |  http://wiki.etelugu.org/helpcenter

You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
radhamadhav  
View profile  
 More options Mar 23 2009, 7:31 am
From: radhamadhav <madhavarao.pabbar...@gmail.com>
Date: Mon, 23 Mar 2009 04:31:14 -0700 (PDT)
Local: Mon, Mar 23 2009 7:31 am
Subject: Re: import, export vs. download, upload
"ఇంపొ్‌ర్ట్,ఎక్స్‌పోర్ట్"  వర్సెస్  " డౌన్‌లోడ్, అప్‌లోడ్ ":ఆంగ్ల
పదాలకు "తెలుగు పదాలు"

ఈ క్రింది పదాలను పరిశీలించగలరు:

   దిగుమతి                    ---                       ఎగుమతి

 1.  "అవరోహణ"               ---              "ఆరోహణ"
(పై నుంచి క్రిందుకు)           ---              (క్రింది నుంచి పైకి)
(సంగీతంలో:స,ని,ద,ప,మ,గ,రి,స.)       (సంగీతంలో:స,రి,గ,మ,ప,ద,ని,స.)

2.  "విలోమము"                 ---            "అనులోమము"
  (గణితములో:విలోమానుపాతం)     (గణితములో: అనులోమానుపాతము)

ఒక ఉదాహరణ: నేను నా కంప్యూటర్లో వున్న ఫొటోల్న్ని, ఇంటర్నెట్ ద్వారా
మరివొకరికి పంపిస్తే, వారు వాటిని తమ కంప్యూటర్లోకి తీసుకోవాలి. అంటే, 1.
నా కంప్యూటర్లో వున్న ఫొటోస్ ను మొట్టమొదట ఇంటర్నెట్ లోకి
"అప్‌లోడ్" ( ఆరోహణ ) చేయాలి;
2. ఇంటర్నెట్ నుంచి ఎవరికి ఇంటర్నెట్ ద్వారానే పంపించాలో , ఆ చిరునామాకు
ఫొటోస్ ను "ఎగుమతి" ( ఎక్స్‌పోర్ట్ ) చేయాలి;
3. ఫొటోస్ ని అందుకున్నవారు, మొట్టమొదటగా, ఇంటర్నెట్ లో వున్న ఫొటోస్ ని,
( పంపేవారి అకౌట్నుంచి ), ఇంటర్నెట్ లో తమ అకౌంట్ కి
"డౌన్‌లోడ్" ( అవరోహణ )చేసుకొని, తరువాత, అక్కడనుంచి తమ కంప్యూటర్ లోని
ఫైలుకు "దిగుమతి" ( ఇంపోర్ట్ ) చేసుకోవాలి.

గమనిక: శ్రీ వీవెన్ గారి వివరణ చాల చక్కగా వున్నది.

On Mar 8, 9:29 pm, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:

You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
తాడేపల్లి T. L. Bala Subrahmanyam Tadepalli  
View profile  
 More options Mar 23 2009, 8:41 am
From: తాడేపల్లి T.L. Bala Subrahmanyam Tadepalli <subtadepa...@gmail.com>
Date: Mon, 23 Mar 2009 18:11:55 +0530
Local: Mon, Mar 23 2009 8:41 am
Subject: Re: [తెలుగుపదం] Re: import, export vs. download, upload

ఎక్కింపు, దింపుకోలు అనే తెలుగు పదాలు బావున్నాయి. అందరికీ అర్థమవుతాయి. మన
తెలుగుజాలంలో చాలాకాలంగా వాడుకలో ఉన్నాయి కూడా !

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are unable
to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
writing in Telugu, use http://lekhini.org

You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Sirish Kumar Tummala  
View profile  
 More options Mar 23 2009, 9:10 am
From: Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>
Date: Mon, 23 Mar 2009 18:40:07 +0530
Local: Mon, Mar 23 2009 9:10 am
Subject: Re: [తెలుగుపదం] Re: import, export vs. download, upload

ఎక్కింపు, దింపుకోలు చక్కగా ఉన్నాయి.

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org

2009/3/23 తాడేపల్లి T.L. Bala Subrahmanyam Tade <subtadepa...@gmail.com>

You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Subbachary Pulikonda  
View profile  
 More options Mar 23 2009, 11:37 pm
From: Subbachary Pulikonda <psubbach...@gmail.com>
Date: Tue, 24 Mar 2009 09:07:56 +0530
Local: Mon, Mar 23 2009 11:37 pm
Subject: Re: [తెలుగుపదం] Re: import, export vs. download, upload

బాగు బాగు ఇవి నిజ జీవితంలో ఇతర సందర్భాలలో బాగా వాడుకలో ఉన్నాయి. అన్ని రకాల
వారూ వాడే పదాలు ఇవి. ఇలా బయటి సందర్భంలో వాడే వాటిని ఇలా వాడడం చాలా
బాగుంటుంది. ఇలా వీలైనంత వరకు తెలుగు పదాలు వెదుకుదాం.
సుబ్బాచారి.
ఈ చర్చ అంతటినీ ఎవరైనా ఆర్కైవ్ చేస్తున్నారా లేదా. మోడరేట్ చూసుకోవాలి మరి.

On 3/23/09, తాడేపల్లి T.L. Bala Subrahmanyam Tade <subtadepa...@gmail.com>
wrote:

--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean
School of Human and Social Sciences
Dravidian University
Kuppam 517425
A.P

You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
End of messages
« Back to Discussions « Newer topic     Older topic »