import, export vs. download, upload

43 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Mar 8, 2009, 12:29:03 PM3/8/09
to తెలుగుపదం
import, export:
వీటికి దిగుమతి, ఎగుమతులని పర్యాయ పదాలుగా ఎప్పటి నుండో వాడుకలో ఉన్నాయి.

download, upload
జాలానికి సంబంధం ఉన్న ఈ పదాలకి కొన్నిసార్లు (వివిధ ఉపకరణాల స్థానికీకరణలో) దిగుమతి ఎగుమతులనే వాడేసాం. జాల ఉపకరణాలలో download, upload కాకుండా వేరే విధంగా import, export అనే వాడుకలు కూడా ఉంటున్నాయి. నేను మరిన్ని ఉపకరణాల స్థానికీకరణలో పాలుపంచుకుంటున్న కొద్దీ importకి, downloadకీ మరియు exportకి మరియు uploadకి తేడాలు స్పష్టమవుతున్నాయి. (క్రింది వివరణ మరియు ఉదాహరణలు చూడండి.) అందుకని download మరియు upload లకు ప్రత్యామ్నాయ పదాలు వెతికే ఈ ప్రయత్నం.

ముందుగా ఈ పదాల వాడుక చూద్దాం:

import:
ఒక ఉపకరణం (లేదా ఉపకరణ వ్యవస్థ) లోనికి భోగట్టాని దిగుమతి చేయడం. జాల ఉపకరణమైతే మొదట మన భోగట్టాని ఎక్కించాలి (upload).

export:
ఒక ఉపకరణం నుండి భోగట్టాని బయటి వాడుక కోసం ఎగుమతి చేయడం. జాల ఉపకరణమైతే ఎగుమతైన భోగట్టాని మనం దింపుకోవాలి (download).

download:
ఒక జాల గూడు నుండి ఫైళ్ళని మన కలనయంత్రం లోనికి దింపుకోవడం.

upload:
మన కలనయంత్రం నుండి ఫైళ్ళని జాల గూడులోనికి ఎక్కించడం.

ఉదాహరణలు:
  • మీరు ఒక విహారిణిని మరో విహారిణికి మారుతుంటే, సాధారణంగా మీ పాత విహారిణిలోని పేజీకలు (bookmarks) గట్రా రెండవ విహారిణిలోనికి దిగుమతి (import) చేసుకుంటారు.
  • జాల ఉపకరణాలకి వస్తే, మీరు యాహూ నుండి జీమెయిలుకి మారితే, మీ యాహూ ఖాతాలోని పరిచయాల(contacts)ని మీ జీమెయిల్ ఖాతాలోనికి దిగుమతి (import) చేసుకుంటారు.
  • బ్లాగర్ నుండి వర్డుప్రెస్సుకి బ్లాగుని మారిస్తే, (నేరుగా జాలం ద్వారా వర్డుప్రెస్ లోనికి దిగుమతి చేసుకోవచ్చు కానీ ఇలా చూద్దాం.) బ్లాగర్ నుండి మొదట మన టపాలని ఎగుమతి (export) చేసుకోవాలి. ఆ ఎగుమతైన టపాల భండారపు ఫైలుని దింపుకోవాలి (download). దీన్ని వర్డుప్రెస్ లోనికి దిగుమతి (import) చేసుకునే పద్ధతిలో భాగంగా మొదట దాన్ని వర్డుప్రెస్ లోనికి ఎక్కించాలి (upload). ఆ ఎక్కించిన ఫైలునుండి వర్డుప్రెస్ టపాలను దిగుమతి చేసుకుంటుంది.
  • మన బ్లాగులోని టపాలని మన కలనయంత్రంలో భద్రపరచుకోవాలన్నా మన బ్లాగునుండి వాటిని ఎగుమతి (export) చేసుకోవాలి
మామూలు ఉపకరణాల (మన కలనయంత్రంలో జాల సంధానం అవసరం లేకుండా నడిచేవి) లో upload మరియు download ఉండే ప్రసక్తి లేదు. కానీ జాల ఉపకరణలలో (జాల సంధానంతో వ్యవహరించే విహారిణుల లాంటి ఉపకరణాలలో) ఇవి import మరియు exportలతో కలిసిపోయి అనువాదాలలో అయోమయాన్ని నెలకొల్పే అవకాశం ఉంది.

సంక్షిప్తంగా, ఎగుమతి (export) అనేది ఉపకరణంలోని భోగట్టాని మనం దింపుకోగలిగే (download-able) విధంగా మార్చి అందిస్తుంది. జాల ఉపకరణంలోనికి భోగట్టాని పెద్దమొత్తంలో దిగుమతి (import) చేయాలంటే అది మనం ఫైలుని ఎక్కించడం (upload) ద్వారా మొదలుపెడతాం. ఈ ఆధారంగా, download, upload లకి తెలుగు పదాలకి వద్దాం:
  • download: క్రియ దింపుకొను; నామవాచకం దింపుకోలు (బహువచనం దింపుకోళ్ళు)
  • upload: క్రియ ఎక్కించు; నామ. ఎక్కింపు (బహు. ఎక్కింపులు)
downloadకి మరియు importకి uploadకి మరియు exportకి మధ్య (సున్నితమైన) తేడాని కొనసాగించడానికి దిగుమతి మరియు ఎగుమతి అన్న పదాలని download మరియు uploadలకి సమానార్థకాలుగా వాడకుండా ఉంటే మేలని అనుకుంటున్నాను.

అదీ సంగతి! మీ సలహాలూ, సూచనలూ తెలియజేయండి.


--
Read Telugu blogs @ koodali.org

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Mar 8, 2009, 3:22:59 PM3/8/09
to telug...@googlegroups.com
Upload, download కి నేను మొదట్లో "ఎక్కింపు, దింపుకోలు" అనే వాడేవాణ్ణి. నా బ్లాగులో ఇచ్చిన తెలుగు పదజాలంలో కూడా అవే పెట్టాను. ఆ తరువాత బహుజన వ్యవహార ప్రాబల్యానికి తలొగ్గి నేను కూడా ఎగుమతులూ, దిగుమతులూ అని వాడ్డం మొదలుపెట్టాను. కానీ నాకు లోలోపల తెలుసు - impotr, export అనే వాటికి కంప్యూటర్ ప్రపంచంలో వేరే అర్థాలున్నాయని, ఈ రకమైన వాడుక మనల్ని ఏదో ఒకరోజున గొప్ప అయోమయంలోకి నెడుతుందనీ ! సరిగ్గా మీరూ అదే వక్కాణిస్తున్నారు. సంతోషం.

౨౦౦౯ మార్చి ౮ ౨౧:౫౯ న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :



--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Praveen Garlapati

unread,
Mar 8, 2009, 3:34:36 PM3/8/09
to telug...@googlegroups.com



2009/3/8 Veeven (వీవెన్) <vee...@gmail.com>

import, export:
వీటికి దిగుమతి, ఎగుమతులని పర్యాయ పదాలుగా ఎప్పటి నుండో వాడుకలో ఉన్నాయి.

download, upload
జాలానికి సంబంధం ఉన్న ఈ పదాలకి కొన్నిసార్లు (వివిధ ఉపకరణాల స్థానికీకరణలో) దిగుమతి ఎగుమతులనే వాడేసాం. జాల ఉపకరణాలలో download, upload కాకుండా వేరే విధంగా import, export అనే వాడుకలు కూడా ఉంటున్నాయి. నేను మరిన్ని ఉపకరణాల స్థానికీకరణలో పాలుపంచుకుంటున్న కొద్దీ importకి, downloadకీ మరియు exportకి మరియు uploadకి తేడాలు స్పష్టమవుతున్నాయి. (క్రింది వివరణ మరియు ఉదాహరణలు చూడండి.) అందుకని download మరియు upload లకు ప్రత్యామ్నాయ పదాలు వెతికే ఈ ప్రయత్నం.

నిజమే నాకూ ఎన్నో సార్లు స్థానికీకరణలో ఈ విషయంలో సందిగ్ధం ఎదురయింది.
విడిగా పదాలు సృష్టించాల్సిందే.


--
- ప్రవీణ్ గార్లపాటి

నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com
ఈ-తెలుగు సహాయకేంద్రం |  http://wiki.etelugu.org/helpcenter

radhamadhav

unread,
Mar 23, 2009, 7:31:14 AM3/23/09
to తెలుగుపదం
"ఇంపొ్‌ర్ట్,ఎక్స్‌పోర్ట్" వర్సెస్ " డౌన్‌లోడ్, అప్‌లోడ్ ":ఆంగ్ల
పదాలకు "తెలుగు పదాలు"

ఈ క్రింది పదాలను పరిశీలించగలరు:

దిగుమతి --- ఎగుమతి

1. "అవరోహణ" --- "ఆరోహణ"
(పై నుంచి క్రిందుకు) --- (క్రింది నుంచి పైకి)
(సంగీతంలో:స,ని,ద,ప,మ,గ,రి,స.) (సంగీతంలో:స,రి,గ,మ,ప,ద,ని,స.)

2. "విలోమము" --- "అనులోమము"
(గణితములో:విలోమానుపాతం) (గణితములో: అనులోమానుపాతము)

ఒక ఉదాహరణ: నేను నా కంప్యూటర్లో వున్న ఫొటోల్న్ని, ఇంటర్నెట్ ద్వారా
మరివొకరికి పంపిస్తే, వారు వాటిని తమ కంప్యూటర్లోకి తీసుకోవాలి. అంటే, 1.
నా కంప్యూటర్లో వున్న ఫొటోస్ ను మొట్టమొదట ఇంటర్నెట్ లోకి
"అప్‌లోడ్" ( ఆరోహణ ) చేయాలి;
2. ఇంటర్నెట్ నుంచి ఎవరికి ఇంటర్నెట్ ద్వారానే పంపించాలో , ఆ చిరునామాకు
ఫొటోస్ ను "ఎగుమతి" ( ఎక్స్‌పోర్ట్ ) చేయాలి;
3. ఫొటోస్ ని అందుకున్నవారు, మొట్టమొదటగా, ఇంటర్నెట్ లో వున్న ఫొటోస్ ని,
( పంపేవారి అకౌట్నుంచి ), ఇంటర్నెట్ లో తమ అకౌంట్ కి
"డౌన్‌లోడ్" ( అవరోహణ )చేసుకొని, తరువాత, అక్కడనుంచి తమ కంప్యూటర్ లోని
ఫైలుకు "దిగుమతి" ( ఇంపోర్ట్ ) చేసుకోవాలి.

గమనిక: శ్రీ వీవెన్ గారి వివరణ చాల చక్కగా వున్నది.


On Mar 8, 9:29 pm, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> import, export:
> వీటికి దిగుమతి, ఎగుమతులని పర్యాయ పదాలుగా ఎప్పటి నుండో వాడుకలో ఉన్నాయి.
>
> download, upload
> జాలానికి సంబంధం ఉన్న ఈ పదాలకి కొన్నిసార్లు (వివిధ ఉపకరణాల స్థానికీకరణలో)
> దిగుమతి ఎగుమతులనే వాడేసాం. జాల ఉపకరణాలలో download, upload కాకుండా వేరే
> విధంగా import, export అనే వాడుకలు కూడా ఉంటున్నాయి. నేను మరిన్ని ఉపకరణాల
> స్థానికీకరణలో పాలుపంచుకుంటున్న కొద్దీ importకి, downloadకీ మరియు exportకి
> మరియు uploadకి తేడాలు స్పష్టమవుతున్నాయి. (క్రింది వివరణ మరియు ఉదాహరణలు
> చూడండి.) అందుకని download మరియు upload లకు ప్రత్యామ్నాయ పదాలు వెతికే ఈ
> ప్రయత్నం.
>
> ముందుగా ఈ పదాల వాడుక చూద్దాం:
>

> *import*:
> ఒక ఉపకరణం (లేదా ఉపకరణ వ్యవస్థ) *లోనికి* భోగట్టాని దిగుమతి చేయడం. జాల


> ఉపకరణమైతే మొదట మన భోగట్టాని ఎక్కించాలి (upload).
>

> *export*:
> ఒక ఉపకరణం *నుండి* భోగట్టాని బయటి వాడుక కోసం ఎగుమతి చేయడం. జాల ఉపకరణమైతే


> ఎగుమతైన భోగట్టాని మనం దింపుకోవాలి (download).
>

> *download*:


> ఒక జాల గూడు నుండి ఫైళ్ళని మన కలనయంత్రం లోనికి దింపుకోవడం.
>

> *upload*:


> మన కలనయంత్రం నుండి ఫైళ్ళని జాల గూడులోనికి ఎక్కించడం.
>
> ఉదాహరణలు:
>

>    - మీరు ఒక విహారిణిని మరో విహారిణికి మారుతుంటే, సాధారణంగా మీ పాత


>    విహారిణిలోని పేజీకలు (bookmarks) గట్రా రెండవ విహారిణిలోనికి దిగుమతి (import)
>    చేసుకుంటారు.

>    - జాల ఉపకరణాలకి వస్తే, మీరు యాహూ నుండి జీమెయిలుకి మారితే, మీ యాహూ


>    ఖాతాలోని పరిచయాల(contacts)ని మీ జీమెయిల్ ఖాతాలోనికి దిగుమతి (import)
>    చేసుకుంటారు.

>    - బ్లాగర్ నుండి వర్డుప్రెస్సుకి బ్లాగుని మారిస్తే, (నేరుగా జాలం ద్వారా


>    వర్డుప్రెస్ లోనికి దిగుమతి చేసుకోవచ్చు కానీ ఇలా చూద్దాం.) బ్లాగర్ నుండి మొదట
>    మన టపాలని ఎగుమతి (export) చేసుకోవాలి. ఆ ఎగుమతైన టపాల భండారపు ఫైలుని
>    దింపుకోవాలి (download). దీన్ని వర్డుప్రెస్ లోనికి దిగుమతి (import) చేసుకునే
>    పద్ధతిలో భాగంగా మొదట దాన్ని వర్డుప్రెస్ లోనికి ఎక్కించాలి (upload). ఆ
>    ఎక్కించిన ఫైలునుండి వర్డుప్రెస్ టపాలను దిగుమతి చేసుకుంటుంది.

>    - మన బ్లాగులోని టపాలని మన కలనయంత్రంలో భద్రపరచుకోవాలన్నా మన బ్లాగునుండి


>    వాటిని ఎగుమతి (export) చేసుకోవాలి
>
> మామూలు ఉపకరణాల (మన కలనయంత్రంలో జాల సంధానం అవసరం లేకుండా నడిచేవి) లో upload
> మరియు download ఉండే ప్రసక్తి లేదు. కానీ జాల ఉపకరణలలో (జాల సంధానంతో
> వ్యవహరించే విహారిణుల లాంటి ఉపకరణాలలో) ఇవి import మరియు exportలతో కలిసిపోయి
> అనువాదాలలో అయోమయాన్ని నెలకొల్పే అవకాశం ఉంది.
>
> సంక్షిప్తంగా, ఎగుమతి (export) అనేది ఉపకరణంలోని భోగట్టాని మనం దింపుకోగలిగే
> (download-able) విధంగా మార్చి అందిస్తుంది. జాల ఉపకరణంలోనికి భోగట్టాని
> పెద్దమొత్తంలో దిగుమతి (import) చేయాలంటే అది మనం ఫైలుని ఎక్కించడం (upload)
> ద్వారా మొదలుపెడతాం. ఈ ఆధారంగా, download, upload లకి తెలుగు పదాలకి వద్దాం:
>

>    - *download*: *క్రియ* దింపుకొను; *నామవాచకం* దింపుకోలు (*బహువచనం*దింపుకోళ్ళు)
>    - *upload*: *క్రియ* ఎక్కించు; *నామ.* ఎక్కింపు (*బహు*. ఎక్కింపులు)

తాడేపల్లి T.L. Bala Subrahmanyam Tadepalli

unread,
Mar 23, 2009, 8:41:55 AM3/23/09
to telug...@googlegroups.com
ఎక్కింపు, దింపుకోలు అనే తెలుగు పదాలు బావున్నాయి. అందరికీ అర్థమవుతాయి. మన తెలుగుజాలంలో చాలాకాలంగా వాడుకలో ఉన్నాయి కూడా !



నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com


ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



Sirish Kumar Tummala

unread,
Mar 23, 2009, 9:10:07 AM3/23/09
to telug...@googlegroups.com
ఎక్కింపు, దింపుకోలు చక్కగా ఉన్నాయి.

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org


2009/3/23 తాడేపల్లి T.L. Bala Subrahmanyam Tade <subtad...@gmail.com>

Subbachary Pulikonda

unread,
Mar 23, 2009, 11:37:56 PM3/23/09
to telug...@googlegroups.com
బాగు బాగు ఇవి నిజ జీవితంలో ఇతర సందర్భాలలో బాగా వాడుకలో ఉన్నాయి. అన్ని రకాల వారూ వాడే పదాలు ఇవి. ఇలా బయటి సందర్భంలో వాడే వాటిని ఇలా వాడడం చాలా బాగుంటుంది. ఇలా వీలైనంత వరకు తెలుగు పదాలు వెదుకుదాం.
సుబ్బాచారి.
ఈ చర్చ అంతటినీ ఎవరైనా ఆర్కైవ్ చేస్తున్నారా లేదా. మోడరేట్ చూసుకోవాలి మరి.

 
Dravidian University
Kuppam 517425
A.P
Reply all
Reply to author
Forward
0 new messages