నేను వాడిన తెలుగు పదాలు, పరిశీలించగలరు

56 views
Skip to first unread message

Kiran Kumar Chava

unread,
Aug 21, 2010, 1:02:25 AM8/21/10
to తెలుగు పదం గుంపు
 

వేగ దారి -- Express Way

గాలి కార్లు -- భవిష్యత్తులో వచ్చే గాలిలో ఎగిరే కార్లు

కృత్రిమ యోగ నిద్ర -- Artificial Sleep ,

జీవ శాస్ర్తవేత్త -- Biological scientist

రోబాటు -- A very small Robot, which can fit in hand. And can do multiple things such as survey of new area.

నావ , అంతరిక్ష నావ -- Space Ship మన వాళ్లు నావ అని వాట్టానికి కూడా సిగ్గు పడి షిప్ అనే వాడుతున్నారు:-(

 

క్వారంటైన్  -- దీనికి సరిపొయ్యే తెలుగు పదం ఏదన్నా ఉందా

దత్తాంశం - Data

పూర్ణ దత్తాంశం --  Verbose Data, Complete Data

చేతనం -- Enable

నేతి , నేతి -- Not found, Not Found

గణణి -- Computer

సమాచారిణి -- Communicator

 

 
 

----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog



narayana sarma

unread,
Aug 21, 2010, 2:59:25 AM8/21/10
to telug...@googlegroups.com
> నావ , అంతరిక్ష నావ -- Space Ship మన వాళ్లు నావ అని వాట్టానికి కూడా సిగ్గు
> పడి షిప్ అనే వాడుతున్నారు:-(
అంతరిక్ష నౌక అనే పదం ఉంది వాడుకలో.

>
>
>
> క్వారంటైన్  -- దీనికి సరిపొయ్యే తెలుగు పదం ఏదన్నా ఉందా
quarantine- నిర్బంధం?

*హైదరాబాదులో Quarantine Hospital ఒకటి ఉండేది.. దాన్ని జనాలు ముచ్చటగా
'కోరంటి ఆస్పత్రి' చేసుకున్నారు. (ఆ తర్వాత దాని పేరు మార్చేసి పెద్దది
చేసుకున్నారులెండి ప్రభుత్వం వారు) కొత్త పదం ఏదైనా కావాలంటే అలా తయారు
చేసేసుకోవచ్చేమో చూడండి.

>
> దత్తాంశం - Data
>

ఈ పదం సాంఖ్యక శాస్త్రం Statistics లో ఎలాగూ వాడుకలో ఉన్నది.

> పూర్ణ దత్తాంశం --  Verbose Data, Complete Data
>
> చేతనం -- Enable
>


> నేతి , నేతి -- Not found, Not Found

:) నేతి గారెలు, నేతి బూరెలు అనుకుంటే కష్టమేమో!? Just kidding..

>
> గణణి -- Computer
>
గణన యంత్రం అని వాడుకలో ఉంది.

> సమాచారిణి -- Communicator

సమాచారం .. Information
సంభాషణ .. Communication?
>
>

>
--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 21, 2010, 3:36:35 AM8/21/10
to తెలుగుపదం
వేగ దారి -- Express Way - వేగవన్ మార్గం
గాలి కార్లు -- భవిష్యత్తులో వచ్చే గాలిలో ఎగిరే కార్లు (వల్లె)
కృత్రిమ యోగ నిద్ర -- Artificial Sleep - కృత్రిమనిద్ర అంటే
సరిపోతుందేమో !
జీవ శాస్ర్తవేత్త -- Biological scientist వల్లె !

రోబాటు -- A very small Robot, which can fit in hand. And can do
multiple
things such as survey of new area. చూద్దాం మిహతావాళ్ళేమంటారో !

నావ , అంతరిక్ష నావ -- Space Ship రోదోనౌక, రోదసీనౌక

క్వారంటైన్  -- ఎడం పెట్టడం ?
దత్తాంశం - Data వల్లె
పూర్ణ దత్తాంశం --  Verbose Data, Complete Data వల్లె

చేతనం -- Enable అదేమో విశేష్యం, ఇదేమో క్రియ. మఱి ఎలా సమన్వయించాలి ? నా
అభిప్రాయంలో చేతనానికీ enable కీ సంబంధమే లేదు. enable కి శక్తం చేయడమే
రైటు. disable కి అశక్తం చేయడం.

చేతనం అంటే తెలుసుకోవడం, గుర్తుపట్టడం అని అర్థం. (చితీ - సంజ్ఞానే)
గుర్తుపట్టగలిగినది సచేతనం. లేనిది అచేతనం.
నేతి , నేతి -- Not found, Not Found నేతి అంటే ఇది కాదు అని అర్థం .
ఇదొక వేదాంత దశావస్థ.

గణణి -- Computer మళ్లీ స్త్రీలింగం. ఎందుకండీ బాబూ మనకీ స్త్రీలింగాల
తంటా ? ఇది వ్యాకరణబద్ధమూ కాదు, వినడానికి సొంపుగానూ లేదు.

సమాచారిణి -- బ్రహ్మచారిణి/ సృష్టిస్థితిలయకారిణి లా ధ్వనిస్తున్నది.

Communicator కి సమాచారకం బావుంటుంది.

ప్రతీది స్త్రీలింగంగా చేయవద్దని ఇదివఱలో ఒకసారి సభ్యులకు విజ్ఞప్తి చేసి
ఉన్నాను. స్త్రీలింగ నామవాచకాలని అర్థవంతంగా నిష్పాదించడం అంత తేలిక
కాదు. అసలు మనకు ఈ కాలంలో సాంకేతికంగా స్త్రీలింగాలతో అంతగా ఉపయోగం కూడా
లేదు. అసలు ఉన్న స్త్రీలింగాల్నికూడా వాడడం మానేసి వాటి స్థానే
ఆడవాళ్ళక్కూడా పుల్లింగాలనే అనువర్తిస్తున్న రోజులివి. అదీ గాక ఈ రకమైన
నిర్మాణాల వల్ల మానవస్త్రీలే తప్ప వస్తువులూ, కాన్సెప్టులూ స్ఫురించడం
మానేస్తాయి. మనకేమో ఈ కాలంలో వస్తువులూ, కాన్సెప్టులూ కావాలి.

ఏమీ అనుకోవద్దు. నాకు సంకలిని (aggregator) కూడా నచ్చలేదు. "సంక" తో
దానికున్న పోలిక వల్ల. "సరే ! మిత్రుల అభీష్టాన్ని మనం కాదనడం దేనికిలే"
అని, దీన్నొక ego war గా మార్చడం ఇష్టం లేక గమ్మునున్నాను.

సంస్కృతంలో లోతైన పాండిత్యం ఉంటేనే స్త్రీలింగాల్ని కల్పన చేయాలి. దాని
బదులు అందఱూ నిష్పాదించగలిగిన. అర్థం చేసుకోగలిగిన ’సమాచారకం’ వంటి
నపుంసకలింగ నామవాచకాల్ని కల్పించండి. అవి అన్ని సందర్భాలకీ ఉపకరిస్తాయి.

phani deep prayaga

unread,
Aug 21, 2010, 4:29:01 AM8/21/10
to తెలుగుపదం

చిన్నపుడు మా బళ్ళో ఒక సారి robot కి మర మనిషి అని చెప్పినట్టు గుర్తు

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 24, 2010, 11:13:42 PM8/24/10
to తెలుగుపదం
సాధనాలను, ఉపకరణాలను నిష్పాదించడానికి సంస్కృతంలో ఒక ప్రత్యేక ప్రత్యయం
ఉంది. అది "త్ర". ధాతువుని బట్టి అది ఇత్ర, ట్ర అని కూడా మారుతుంది.

ఉదా :-

లవనం - కోయడం/ తెంపడం
లవిత్రం = కొడవలి

పావనం = శుభ్రం చేయడం
పవిత్రం = దర్భ

శసు - హింసాయాం -->విశసనం = బాధించడం
శస్త్రం = ఆయుధం (దేనితో బాధిస్తామో అది)

అసు - క్షేపణే = విసరివేయడం
అస్త్రం = (మంత్రప్రయుక్తమైన) ఆయుధం

వాదనమ్ = వాయించడం
వాదిత్రం = సంగీతసాధనం

భృజ్ = భర్జనమ్ = వేపడం
భ్రాష్ట్రమ్ - బాండి (బాణలి/ బూర్లెమూకుడు) Frying pan
దేని సహాయంతో వేపుతామో అది.

రాజృ - దీప్తౌ = ప్రకాశించడం
రాజు = ప్రకాశించేవాడు
రాష్ట్రమ్ - రాజ్యం - దేనితో ప్రకాశిస్తామో అది.

అనవసరమైన స్త్రీలింగాల్ని వదిలిపెట్టి ఈ మార్గంలో మనం ఉపకరణార్థకాలను
రూపొందించుకుంటే బావుంటుందని నా అనుకోలు.

kv ramana

unread,
Aug 25, 2010, 1:15:32 AM8/25/10
to telug...@googlegroups.com
త్ర ట్ర ప్రత్యయాల గురించి మీరిచ్చిన జ్ఞానానికి నెనర్లు 


2010/8/25 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>

Ravi.Localizer

unread,
Aug 25, 2010, 7:51:03 AM8/25/10
to తెలుగుపదం
> వాయు కార్లు -- భవిష్యత్తులో వచ్చే గాలిలో ఎగిరే కార్లు
>
> కృత్రిమ నిద్ర -- Artificial Sleep ,
>
> జీవ శాస్త్రవేత్త -- Biological scientist
>
> రోబోటు/మరమనిషి -- A very small Robot, which can fit in hand. And can do multiple

> things such as survey of new area.
>
> అంతరిక్ష నౌక/రోదసీ నౌక -- Space Ship
> క్వారంటైన్/అవరోధం -- Quarantine

> దత్తాంశం - Data
>
> పూర్ణ దత్తాంశం -- Verbose Data, Complete Data
>
> అమలవు -- Enable
>
> దొరకలేదు/కనబడలేదు -- Not found, Not Found
>
> సంగణకం -- Computer
>
> సమాచారకం -- Communicator
>

రవికుమార్ రాగం

Reply all
Reply to author
Forward
0 new messages