వాంఙ్మయం అనే పదానికి అర్థమేమి?

20 views
Skip to first unread message

రవిచంద్ర

unread,
Jan 5, 2012, 7:57:45 AM1/5/12
to telug...@googlegroups.com
ఈ పదానికి నేను ఆంధ్రభారతి నిఘంటువులో లేదు. సందర్భాన్ని బట్టి సాహిత్యం అని అర్థం చేసుకున్నాను. ఇది సరైనదేనా?

Veeven

unread,
Jan 5, 2012, 8:44:02 AM1/5/12
to telug...@googlegroups.com

5 జనవరి 2012 6:27 సా న, రవిచంద్ర <ravichandr...@gmail.com> ఇలా రాసారు :

ఈ పదానికి నేను ఆంధ్రభారతి నిఘంటువులో లేదు. సందర్భాన్ని బట్టి సాహిత్యం అని అర్థం చేసుకున్నాను. ఇది సరైనదేనా?

"వాఙ్మయం" అన్నది సరైన పదం. దానికి ఆంధ్రభారతి నిఘంటువులో literature అని ఇచ్చారు. 

వాఙ్మయానికి సాహిత్యానికి సూక్ష్మ అర్ధభేదాలు ఉండొచ్చు: ఈ లంకెలో చూడండి: http://kalagooragampa.blogspot.com/2010/05/recorded.html

ఇట్లు,
వీవెన్.

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Jan 5, 2012, 8:50:11 AM1/5/12
to telug...@googlegroups.com
వాక్, మయముల కలయికే వాఙ్మయము (మధ్యలో పూర్ణానుస్వార ముండదు). గంథస్థమైనవి, కానిని, పుక్కిటిపురాణాలు, సామెతలు -  ఒకటేమిటి భాష తా భాసిల్లిన సారస్వతమంతా వాఙ్మయమే.

రమణా రావు ముద్దు

unread,
Jan 6, 2012, 3:49:26 AM1/6/12
to telug...@googlegroups.com
   గిరిధర్ గారి వివరణ పూర్తిగా సరి ఐనది.
2012/1/5 Lanka Giridhar (లంక గిరిధర్) <giridha...@gmail.com>:

> వాక్, మయముల కలయికే వాఙ్మయము (మధ్యలో పూర్ణానుస్వార ముండదు). గంథస్థమైనవి,
> కానిని, పుక్కిటిపురాణాలు, సామెతలు -  ఒకటేమిటి భాష తా భాసిల్లిన సారస్వతమంతా
> వాఙ్మయమే.
>
> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> ఉంది కాబట్టి.
>
> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> telug...@googlegroups.com
> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> telugupadam...@googlegroups.com
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి

Rakesh A

unread,
Mar 21, 2012, 5:19:42 PM3/21/12
to telug...@googlegroups.com
తాఁ భాసిల్లిన (మధ్యలో అర్ధానుస్వరముంటే బాగుంటుంది) ;-)

2012/1/5 Lanka Giridhar (లంక గిరిధర్) <giridha...@gmail.com>
వాక్, మయముల కలయికే వాఙ్మయము (మధ్యలో పూర్ణానుస్వార ముండదు). గంథస్థమైనవి, కానిని, పుక్కిటిపురాణాలు, సామెతలు -  ఒకటేమిటి భాష తా భాసిల్లిన సారస్వతమంతా వాఙ్మయమే.

kv ramana

unread,
Mar 22, 2012, 1:48:05 AM3/22/12
to telug...@googlegroups.com
అరసున్న ఉండటానికి లేకపోవడానికి  తేడా కనిపించదు. ఎవరూ ఉచ్చరించడం లేదు. పునర్ముద్రణకు వస్తున్న పాత పద్యాలలో అరసున్నను విదిచిపెడుతున్నారు. కానీ వాడుక భాషలో అర్ధానుస్వారం వినిపిస్తోంది. మాఁవ (మామ), సాఁవెత (సామెత) - ఉదాహరణలు.

2012/3/22 Rakesh A <rake...@gmail.com>



--
కిల్లంసెట్టి వెంకటరమణ

రమణా రావు ముద్దు

unread,
Mar 22, 2012, 11:15:40 AM3/22/12
to telug...@googlegroups.com
అరసున్న ఒక్కటే కాదు,ఋ ,బండిర మొదలైనవి విడిచిపెట్టుతున్నారు.కొందరు
మాత్రం ఇంకా రాస్తున్నారు.నా అభిప్రాయంలో వర్ణ మాల పూర్తిగా అచ్చులో
ఉండాలి.మనం తెలుసుకొని ఉండాలి.ముఖ్యంగా ప్రాచీన కావ్యాలు
అచ్చువేసినప్పుడు అవసరం.మిగతా సమయాల్లో మీ ఇష్టం .బెర్నార్డ్ షా
అంతటివాడే ఉచ్చారణ ప్రకారం స్పెల్లింగు మార్చ్హాలని ప్రయత్నం చేసినా
విఫలుడయాడు.

2012/3/22 kv ramana <kvje...@gmail.com>:

Pulikonda

unread,
Mar 22, 2012, 11:16:34 PM3/22/12
to telug...@googlegroups.com
వాఙ్మయం అనే పదంలో అనుస్వారాన్ని గురించి చేసే ఈ చర్చ చాలా చిత్రం గా ఉంది. అవసరం  లేంది కూడాను
స ంస్కృత పదాల్లో అనుస్వారానికి బదులు వర్గాక్షరాల ముందు వర్గపంచమాక్రాషన్ని రాస్తారు. 
అంటే ఆ వర్గంలోని అనునాసికాక్షరం. 
ఇక్కడ వాక్ + మయం అనే పదాలు సంధిలో కవర్గ పంచమాక్షమైన ఙ ని తీసుకొని వాఙ్మయం అయింది. 
ఇందులో సున్న కాని అరసున్న కాని రావడం అనే ప్రసక్తి ఎందుకుంటుంది. ఇక్కడ ఙ అక్షరమే అనుస్వారం.  

ఙకారం పెట్టి దీన్ని రాయలేని శబ్దసాధుత్వం తెలియనివారికి తెలుసుకోలేని పెద్ద వ్యాకరణ  విశేషాలేమీ లేవిక్కడ. 

ఇక అరసున్న ఎక్కడ రాసేవారు ఎందుకు రాసేవారు ఆ అచ్చతెలుగు పదాల కథాకమామీషు వేరే. 
భవదీయుడు
పులికొండ సుబ్బాచారి. 
Prof. P.  Subbachary
Chairman BOS
Department of Folklore & Tribal Studies
Dravidian University
Kuppam 517425
A.P

kv ramana

unread,
Mar 24, 2012, 3:09:04 AM3/24/12
to telug...@googlegroups.com
 అక్షరం ఉన్నచోట వేరే అనుస్వారంతో పనిలేదు - అదే సామాన్యులం చర్చించుకున్నాం. చిత్రంగా తోచిందా?  సరే  
అవును, వాఙ్మయంతో అరసున్నతో సంబంధం లేదు.  ఐతే, చర్చించిన సందర్భం వేరు. పులికొండ వారు వెనక్కు వెళ్లి మరోసారి పరికించాలి. 
-కేవీ 

2012/3/23 Pulikonda <psubb...@gmail.com>

Pulikonda

unread,
Mar 24, 2012, 4:24:17 AM3/24/12
to telug...@googlegroups.com
అవును కదా వెనుకటి సందర్భం ఏమిటో చూస్తాను. నేను సామాన్యుల్లో ఒకణ్ణే నండీ. మాగురువులు ఇప్పటికీ 75 ఏళ్ళ వయస్సులో రోజుకు 18 గంటలు భాషా సేవ చేస్తున్నారు. వారికంటే ఇరవై ఏళ్ళు చిన్నవాణ్ణి.
అలా ఉండడం ఎంత అదృష్టం కదా. 
సుబ్బాచారి. 

Reply all
Reply to author
Forward
0 new messages