"ఇ" తో అంతమయ్యే పదాలకు బహువచన రూపం

12 views
Skip to first unread message

చరసాల

unread,
Aug 25, 2010, 10:03:54 AM8/25/10
to తెలుగుపదం
"సోదరి", "నటి" లాంటి పదాలకు బహువచన రూపం ఏమిటి? "సోదరీమణులు",
"నటీమణులు" అని వాడటం ఎబ్బెట్టుగా వుంటోంది. మొన్నటి వార్తల్లో "...
నటిమణుల అరెస్టు.." లాంటి పదబంధాలు చదువుతున్నపుడు కష్టంగా వుంది.

తాడేపల్లి లాంటి వారు ఓ తోవ చూపిస్తే సంతోషం.

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Aug 25, 2010, 2:20:15 PM8/25/10
to telug...@googlegroups.com
నమస్కారం

ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇకారాన్తస్త్రీలింగశబ్దాల బహువచనరూపాలు నన్ను కూడా చాలా చీకాకు పెడుతున్నాయి. ముఖ్యంగా భాషాబోధకులు సైతం తప్పులు చేయడం చాలా బాధిస్తుంది. ఉదాహరణకు, వ్యాకరణాన్ని అనుసరించి మంజరికి బహువచనం మంజరులు ఔతుంది. కానీ మంజరిలు అనే వ్రాస్తారు ఈ పండితబ్రువులు. కమలముఖిలు అనడం తప్పు, కమలముఖులు అనాలి.

పైన చెప్పిన దోషంతో పోలిస్తే సరైన రూపం తెలియనపుడు ఇకారాన్తపదానికి తరువాత ఒక విశేషణం చేర్చి తెలిసిన రూపం తెచ్చుకోవటం నయమే. అలాంటి కోవలోకే చెందుతాయి ఈ నటీమణులూ సోదరీమణులూను. ప్రజలకు, మణికి బహువచనం మణులు అని తెలుసు కానీ, సోదరికి బహువచనరూపం సోదరులు అని తెలియదు పాపం!! పుంలింగమైన సోదరుడు శబ్దానికీ స్త్రీలింగమైన సోదరి శబ్దానికీ రెంటికీ సోదరులు శబ్దమే బహువచనరూపం! అలాగే నటికి నటులు బహువచనరూపం ఔతుంది.

దీనికి సంబంధించి బాలవ్యాకరణంలో చిన్నయసూరి సూత్రీకరించిన నియమాలు ఇవీ:

ఇత్తునకు బహువచనంబు పరంబగునపు డుత్వంబగు. (బా.వ్యా.-తత్సమ-౪౫)
హరులు-గిరులు-కవులు-రవులు-యామినులు-భామినులు. తపరకరణంబుచే దీర్ఘంబున కుత్వంబు లేదు. శ్రీలు-స్త్రీలు-లకోరీలు.

వికృతియం దికారాన్తముల యుపోత్తమేత్వంబునకు బహువచనము పరంబగునపు డుత్వంబగు. (బా.వ్యా.-తత్సమ-౪౬)
ఇచ్చట వికృతిశబ్దముచే సంస్కృతసమేతరంబు గ్రహింపవలయు. కలికి-కలుకులు. ములికి-ములుకులు. చెలిమి-చెలుములు. బలిమి-బలుములు. ఉపోత్తమేత్వంబున కనుటంజేసి జిగి నిసి ఇత్యాదులం దుత్వంబు లేదు. జిగులు నిసులు.

రలడోపధనవార్థాదుల యుపోత్తమేత్వంబున కుత్వంబు గలుగదు. (బా.వ్యా.-తత్సమ-౪౭)
పందిరి-పందిరులు. పిడికిలి-పిడికిళులు. రాపిడి-రాపిడులు. తొమ్మిది-తొమ్మిదులు.

ఉకారాన్త గోశబ్దంబుల కంతట వువర్ణకంబగు. (బా.వ్యా.-తత్సమ-౪౮)
తరువు-ధేనువు-మధువు-గోవు. అంతట ననుట స్త్రీలింగప్రథమైకవచనలోపబాధనార్థము.

వువర్ణకేతరవిభక్తి పరమగుచో నుకారాన్తంబులకు బహుళంబుగా గోశబ్దంబునకు నిత్యంబుగా వుగాగమంబగు. (బా.వ్యా.-తత్సమ-౪౯)
తరువులు-తరులు-ధేనువులు-ధేనులు-గోవులు.

నమస్సులతో
రాఘవ

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 25, 2010, 2:21:27 PM8/25/10
to తెలుగుపదం
పిల్చినాక ఇహ తప్పుతుందా ? పిల్చినందుకు నెనర్లు.

తెలుగు వ్యాకరణ నియమాల ననుసరించి - వాడుకభాషైనా, గ్రాంథికభాషైనా -
ఇకారాంతాలన్నీ బహువచనంలో ఉకారాంతాలైపోతాయి.

ఓటమి - ఓటములు
రాశి - రాశులు
లక్ష్మి - లక్ష్ములు
సోదరి - సోదరులు
నటి - నటులు

ఈమధ్య విశాఖపట్నం, బెంగుళూరు, హైదరాబాదులాంటి మెట్రోపాలిటన్
ప్రాంతాల్లోని జనాలు తమ సొంత బహువచన రూపాలు కొన్ని సృష్టించి
వాడుతున్నారు.

ఉదా :-

ఇల్లు - ఇల్లులు
సోదరి - సోదరీలు
లక్ష్మి - లక్ష్మీలు

వీటి ప్రామాణికతని కాలమే నిర్ణయించాలి. ఇవి విఱివిగా ప్రచారంలోకి
వచ్చినరోజు గ్రాంథికానికీ, వాడుకభాషకీ మధ్య ఇప్పటి దాకా ఉమ్మడిగా ఉన్న ఒక
ప్రాచీన సూత్రబంధం తెగిపోయినట్లే.

Prasad Charasala

unread,
Aug 25, 2010, 6:00:13 PM8/25/10
to telug...@googlegroups.com
వివరించినందులకు రాఘవ గారికి, తాడేపల్లి గారికి నెనర్లు. ఇకపై శంక లేకుండా "సోదరులు", "నటులు" అని స్త్రీలిగ బహువచనానికైనా వాడేస్తా!

--ప్రసాద్

2010/8/25 ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ <msrk...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Prasad
http://blog.charasala.com

Kiran Kumar Chava

unread,
Aug 25, 2010, 8:58:55 PM8/25/10
to telug...@googlegroups.com
ఇల్లు - ఇండ్లు అనే ప్రయోగం కూడా విన్నాను.


----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog





2010/8/25 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Aug 25, 2010, 11:37:09 PM8/25/10
to telug...@googlegroups.com
ఇల్లు ఇళ్లు సాధువులు. ఇండ్లు కూడా సాధువే. ఇల్లులు... ఇల్లి (=ఉపవాసం) అన్న పదానికి బహువచనం ఔతుంది.

Veeven (వీవెన్)

unread,
Aug 26, 2010, 10:09:50 AM8/26/10
to telug...@googlegroups.com
బహువచన రూపాలపై కొన్ని నియమాలని గతంలో నేను ఈ క్రింది లంకెలో పొందుపరిచాను. చూడండి.

http://wiki.etelugu.org/%E0%B0%AC%E0%B0%B9%E0%B1%81%E0%B0%B5%E0%B0%9A%E0%B0%A8_%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

ఇట్లు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages