ఈమధ్య ఒకటో తరగతి తెలుగువాచకం చూసినప్పుడు నాకీ సందేహం వచ్చింది. మన యునికోడ్లో వత్తులూ, గుణింతాలూ ఏకాంతిక స్వమూర్తులు(stand-alone entities) కావు. అవి సర్వదా హల్లులతో కలిసిపోయే ఉంటాయి. కానీ కంప్యుటర్లు రాకముందు వాడిన యాంత్రిక లెటర్ప్రెస్సులలోను, అను, శ్రీలిపి మొదలైన స్వంతదారీ ఖతుల (proprietary fonts) లోను ఒత్తుల్నీ, గుణింతచిహ్నాల్నీ అక్షరంలో భాగంగా కాక స్వతంత్రంగా విడిగా చూపించే సౌలభ్యం ఉంది. (ఈ కింద దానికి సంబంధించి ఒక PDF జోడించాను. పరిశీలించండి) ఇప్పుడు అను, శ్రీలిపి ఉన్నాయి కాబట్టి ఫర్వాలేదు. ఱేపు వాటిక్కూడా యునికోడ్ పాఠాంతరాలు వచ్చి, అవే స్థిరపడితే వాటిల్లో వీటిని చూపించేదెలా ?
2009/11/29 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>: