బెంగాలీ సంగతేమో కానీ తెలుక్కి సంబంధించి వీటన్నింటిలోను సర్వసామాన్యంగా ఉన్న తొఱ్ఱ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రజనాభాని తెలుగువాళ్ళ జనాభాగా చూపించడం. మళ్లీ ఆ రాష్ట్రజనాభాని కూడా అసలు లెక్కకంటే తగ్గించి చూపించడం. మిగతా రాష్ట్రాల్లో జిల్లాలకి జిల్లాలే నిండిపోయిన తెలుగువాళ్ళ సంగతేంటి ? ఉదాహరణకి - నాకు తెలిసి ఈ క్రింది నాన్-ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో తెలుగువాళ్ళు మెజారిటీ.
తమిళనాడు - ధర్మపురిజిల్లా -
(తమిళనాడు శాసనసభలో తెలుగు ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ 30 మందికి తక్కువ కాకుండా ఉంటారు. గత శాసనసభలో నైతే 40 మంది ఉన్నారు.)
కర్ణాటక - రాయచూరు, బళ్ళారి
ఒరిస్సా - కోరాపుట్, గంజామ్, బెర్హంపూర్
ఛత్తీస్ఘడ్ - దంతేవాడ
ఇంకా కొన్నున్నాయని వింటున్నాను.
ఇలా తప్పుడుగా సర్క్యులేట్ అవుతున్న లెక్కల్లో ఎవఱైనా అఱవ్వాళ్ళ హస్తముందా ? అని నాకో అనుమానం.
నా మటుకు నాకు వికీ నమ్మదగిన ఆకరం కాదు. అది ప్రైవేట్ సోర్సు కావడం ఒక కారణం. అదీగాక అక్కడ కొంతమంది అఱవ్వాళ్ళు చేఱి తెలుగుమీదున్న వ్యాసాల్ని తెలుక్కి వ్యతిరేకంగా ఎడిట్ చేస్తున్నారు. రెండేళ్ళక్రితమైతే కొన్ని తెలుగుమీదున్న కొన్ని వ్యాసల్ని ఏకంగా చెఱిపేశారు కూడా !