ఇది మీ బ్లాగు చిరునామా..
http://sairatna-sairatna.blogspot.com/
అలా చూసినప్పుడు మనవాళ్ళు ఊళ్ళ పేర్లని ఇంటిపేర్లుగా స్వీకరించడం కొంత
మంచే చేసిందేమో ! ఇంటిపేర్లనేవి కాకతీయుల కాలంలో వారి రెవిన్యూ శాఖవారు
మొదలుపెట్టిన ఆచారం. భూముల రిజిస్ట్రేషన్ నిమిత్తం వాళ్ళు ఈ ఆచారాన్ని
మొదలుపెట్టారు. అంతకుముందు తెలుగువాళ్ళకి గోత్రాలే తప్ప ఇంటిపేర్లు
ఉండేవి కావు. ఉదాహరణకి కవిత్రయంలో తిక్కనకీ, ఎఱ్ఱాప్రెగడకీ
ఇంటిపేర్లున్నాయి (కొట్టరువు తిక్కన్న, చదలువాడ ఎఱ్ఱన్న) కానీ ఆదికవి
నన్నయ్యకి ఇంటిపేరు లేదు. ఎందుకంటే ఆయన కాకతీయుల కంటే పూర్వుడు.
నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com
ఇట్లు భవదీయుడు
తాడేపల్లి
This mail might have been sent to you in Telugu language. If you are
unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE
(UTF-8). For writing in Telugu, use http://lekhini.org
బహుశా ఒక కారణం ఉండొచ్చు ఇప్పటికి 1750 సంవత్సరాలకి పూర్వం దేశంలో
ఒకేసారి అనేక రాష్ట్రాల్లో అనేక బ్రాహ్మణ సామ్రాజ్యాలు తయారయ్యాయి.
ఉదాహరణకి - దక్కన్ అంతా శాతవాహనుల కిందికి, ఉత్తర భారతదేశమంతా శుంగ
వంశీయుల కిందికి వచ్చాయి. ఆ సందర్భంగా ఆ బ్రాహ్మణ రాజుల్ని బట్టి
బ్రాహ్మలందరినీ "భట్టారక" అని వ్యవహరించడం జనానికి అలవాటై ఉంటుంది.
అటుపిమ్మట వాళ్ళు రాజ్యాధికారాన్ని కోల్పోయినా, ఆ బిరుదులు అలాగే కొనసాగి
ఉంటాయి. ఉదాహరణకి బమ్మెర పోతన పూర్వీకులు మంత్రులుగా పని చేశారు. పోతన
వ్యవసాయం చేసుకొని బతికాడు. కానీ ఆయన్ని పోతనామాత్యుడు (మంత్రి పోతన)
అన్నారు గదా, పూర్వీకుల్ని బట్టి ! అలాగే ఈ "భట్టు" శబ్దం కూడా ! అని నా
ఊహ.
ఒక చిన్న సందేహం.
కాకతీయులు ప్రస్తుతమున్న మన ఆంధ్ర ప్రదేశ్ నంతటిని పరిపాలించారా (నాకు
చరిత్ర సరిగా తెలియదు. క్షమించండి)? ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు
మన స్వాతంత్రం వచ్చాక ఏర్పడ్డాయి కదా. అంటే అంతకు ముందు తెలుగు వారంతా
వేర్వేరు రాష్ట్రాలలో ఉండేవారు కదా. ఉన్న తెలుగు వారందరికి ఇంటిపేర్లు
ఉన్నాయి కదా. అందుకని.
అలాగే కాకతీయలు తెలుగు కాకుండా వేరే భాష మాట్లాడే ప్రజలను ఎవరినైనా
పరిపాలించారా? అలా పరిపాలించినట్లయితే వారికి కూడా ఇంటి పేర్లు ఉండాలి
కదా. అలా ఎవరైనా ఉన్నారా?
భవదీయుడు,
వైద్యభూషణ్.
On Jul 3, 6:19 am, తాడేపల్లి T.L. Bala Subrahmanyam
<subtadepa...@gmail.com> wrote:
> భట్టు అనేది శర్మ/ శాస్త్రి/ అవధాని/ సోమయాజులు/ దీక్షిత్ లాంటి కుల
> బిరుదే. దీని పూర్వరూపం "భట్టారక". దానికి పూర్వరూపం "భర్తా". అయితే
> మొదట్లో - అంటే రెండు-మూడువేల ఏళ్ళ క్రితం భట్టారక నామం రాజులకి
> వాడేవారు. భర్త అంటే రాజు కనుక. కానీ అది ఏ కాలంలో, ఏ కారణం చేత
> బ్రాహ్మణులకి బదిలీ అయిందో, రాజులెందుకు ఆ బిరుదాన్ని తగిలించుకోవడం
> మానేశారో తెలియకుండా ఉంది.
>
> బహుశా ఒక కారణం ఉండొచ్చు ఇప్పటికి 1750 సంవత్సరాలకి పూర్వం దేశంలో
> ఒకేసారి అనేక రాష్ట్రాల్లో అనేక బ్రాహ్మణ సామ్రాజ్యాలు తయారయ్యాయి.
> ఉదాహరణకి - దక్కన్ అంతా శాతవాహనుల కిందికి, ఉత్తర భారతదేశమంతా శుంగ
> వంశీయుల కిందికి వచ్చాయి. ఆ సందర్భంగా ఆ బ్రాహ్మణ రాజుల్ని బట్టి
> బ్రాహ్మలందరినీ "భట్టారక" అని వ్యవహరించడం జనానికి అలవాటై ఉంటుంది.
> అటుపిమ్మట వాళ్ళు రాజ్యాధికారాన్ని కోల్పోయినా, ఆ బిరుదులు అలాగే కొనసాగి
> ఉంటాయి. ఉదాహరణకి బమ్మెర పోతన పూర్వీకులు మంత్రులుగా పని చేశారు. పోతన
> వ్యవసాయం చేసుకొని బతికాడు. కానీ ఆయన్ని పోతనామాత్యుడు (మంత్రి పోతన)
> అన్నారు గదా, పూర్వీకుల్ని బట్టి ! అలాగే ఈ "భట్టు" శబ్దం కూడా ! అని నా
> ఊహ.
>
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly
> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com
అలాగే తూర్పుచాళుక్యుల తరువాత వచ్చిన కాకతీయులు కూడా తెలుగు మాట్లాడే
జిల్లాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చారు. అందుచేత దానికి ఆ
రోజుల్లో ఆంధ్రసామ్రాజ్యమని పేరు. అయితే ఆ కాలంలో ఉన్నది ఫ్యూడల్ వ్యవస్థ
(చిన్నరాజులు పెద్దరాజుకు కప్పం కట్టి అవసరమైనప్పుడు సైనిక సహాయం చేసే
వ్యవస్థ) కనుక జిల్లాల్లో స్థానిక ప్రభువులు కూడా ఉండేవారు. ఉదాహరణకి -
నెల్లూరుని పరిపాలించిన మనుమసిద్ధి వారి సామంతుడు. ఆంధ్ర సామ్రాజ్యానికి
ద్రోహం చేస్తున్నాడనే అనుమానంతో రెండో ప్రతాపరుద్రుడు (అప్పటికి ఇంకా
చక్రవర్తి కాలేదు) తన మాతామహురాలూ, ాప్పటి ఆంధ్రచక్రవర్తిని అయిన
రుద్రమదేవి ఆదేశాల మేరకు వరంగల్ నుంచి నెల్లూరు వెళ్ళి మనుమసిద్ధిని
నరికి చంపాడు.
ఆ (క్రీ.శ.1330) తరువాత వచ్చిన, 330 సంవత్సరాల పాటు కొనసాగిన విజయనగర
సామ్రాజ్యంలో కూడా తెలుగుజాతి మొత్తం ఒకే ప్రభుత్వం కింద ఉన్నారు. ఒక
ముఖ్యమైన విషయం ఇక్కడ మననం చేసుకోవాలి. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఈనాటివి
కావు. విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజుల్లోనే తన
సామ్రాజ్యాన్ని ఏడు భాషారాజ్యాలుగా విభజించి ఒక్కొక్క రాష్ట్రానికి
ఒక్కొక్క గవర్నర్ ని నియమించాడు. అవి-
౧. ఒరిస్సా
౨. తుళునాడు
౩. కన్నడనాడు
౪. తెలుగునాడు
౫. తమిళనాడు
౬. మలయాళం
౭. సింహళం (శ్రీలంక)
ఈ అన్ని రాష్ట్రాలకీ, సామ్రాజ్యానికీ ఆ రోజుల్లో తెలుగే అధికారభాషగా
ఉండడం మనకి గర్వకారణం. ఎందుకంటే రాష్ట్రమేదైనా గానీ, విజయనగర చక్రవర్తులు
తమ ఆధికారిక శాసనాలన్నీ మూడొంతులు తెలుగులోనే వేయించేవారు. ఆ కారణం చేత
ఆంధ్రప్రదేశ్ లోనే కాక ఇతరరాష్ట్రాల్లో కూడా తెలుగు శాసనాలు
లభిస్తున్నాయి.
ఆ తరువాత ఆంధ్రదేశపు తెలుగుజిల్లాలన్నీ ఖులీకుతుబ్ షా వంశం కిందకి
వచ్చాయి. తెలుగుదేశాన్ని పరిపాలించడం వల్లా, తెలుగుని అధికారభాషగా
గుర్తించడం వల్లా ఆ వంశానికి తెలుగు సుల్తాన్ లు అని పేరు కూడా వచ్చింది.
కృష్ణాజిల్లా కూచిపుడి భాగవతులకి ఆ గ్రామాన్ని దానం చేసినవారు ఆ సుల్తాన్
లే. అలాగే విజయవాడ కనకదుర్గమ్మకి వారు నగలు కూడా చేయించారు.
కుతుబ్ షాల వంశం అంతరించాక పరిపాలన చేపట్టిన నిజామ్ వంశం కూడా యావత్తు
తెలుగుదేశాన్ని పాలించింది. కానీ దురదృష్టవశాత్తు బ్రిటీష్ వారికి డబ్బు
బాకీపడ్డం వల్ల దాన్ని తీర్చలేని పరిస్థితుల్లో - ముందు రాయలసీమని,
తరువాత ఉత్తర సర్కారు జిల్లాల్నీ వారికప్పగించాల్సి వచ్చింది. తెలుగుజాతి
రాజకీయంగా విడిపోయిన తొట్టతొలి చారిత్రిక సందర్భం అదే.
ఈ గుంపు బ్లాగులకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకేగాని, బ్లాగులో
రాస్తున్న, రాసిన విషయాలపై చర్చకోసం కాదు. బ్లాగులో రాసే విషయంపై
సంబంధించిన చర్చను సదరు బ్లాగుల్లోనే చెయ్యాలి.
ఈ గుంపుకు మీరు కొత్తవారవటంచేత తెలియజేస్తున్నాను. గమనించగలరు.
- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com
2009/7/4 Ranga Sai Mamidenna <mvran...@gmail.com>:
చంద్ర మోహన్
On Jul 4, 2:11 am, kv ramana <kvjeyp...@gmail.com> wrote:
> తాడేపల్లి వారు ఇచ్చిన భోగట్టా చాలా ఉపయోగరం.
>
> మరాఠీలవి కూడా ఇంటిపేర్లు లాంటివే. మంగేష్కర్, తెందూల్కర్ లాంటి వాటిలో
> వున్నవి ఊళ్ళపేర్లే. సింధీవాళ్ళ పేర్లు కూడా.
>
> భట్టు బిరుదు నన్నయకు ముందరి వాళ్ళకు ఉండేవి. బాణభట్ట, ఆర్యభట్ట. భట్టు
> భర్తాశబ్దభవం అన్నారు కదా. మరెందుకో రాజులెవరికీ భట్టబిరుదాలు లేవు. ప్రభువనే
> భావం కాక గౌరవమిచ్చే బిరుదేమో. దేవతా, గోస్వామి లాంటివి బ్రాహ్మణ
> బిరుదాలున్నాయిగా.
>
> 2009/7/4 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtadepa...@gmail.com>
పెద్దలందరికీ నమస్సులు.