Claim ని తెలుగులో ఏమనాలి?

0 views
Skip to first unread message

రమణ / Ramana

unread,
Jun 28, 2009, 1:13:24 PM6/28/09
to telug...@googlegroups.com
ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేసేప్పుడు claimకి తెలుగులో ఏమనాలో ఎవరైనా చెప్పగలరా?
ఉదాహరణకి ఈ సందర్భాలలో
Claim victory
False claim
Verfied the claims లాంటివి. వాజ్యం, వాదం అన్నపదాలు కొన్ని సందర్భాలలో సరిపోయినట్టనిపిస్తున్న సమానర్ధకంగా అనిపించడం లేదు.
 
తాడేపల్లిగారు,
Your response would be highly appreciated.
 
Thanks
Ramana
 
 

 

--
రమణ
http://swagathaalu.blogspot.com

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 28, 2009, 1:33:41 PM6/28/09
to telug...@googlegroups.com
రమణగారూ ! మీ అభిమానానికి నెనర్లు. Claim ని ఇంగ్లీషులో కూడా ఒకే అర్థంలో వాడకపోవడం జరుగుతోంది. రకరకాల సందర్భాల్లో రకరకాల అర్థాల్లోవాడుతున్నారు. కనుక ఆ అన్ని అర్థాలకీ/ సందర్భాలకీ ఇంగ్లీషులో మాదిరే ఏకవాచకం తెలుగులో లభిస్తుందని అనుకోలేం. ఎందుకంటే ఇప్పటిదాకా లభించలేదు.
 
మీరిచ్చిన ఆంగ్ల పదబంధాల (English phrases) కి సందర్భాన్ని బట్టి సమీపార్థకాలతో సరిపుచ్చుకోవలసి ఉంటుందనుకుంటా.
 
Claim victory - విజయాన్ని ప్రకటించుకొను
False claim - తప్పుడు హక్కుల ప్రకటన
Verfied the claims - (ఇది మిక్కిలి కష్టమైన వాడుక) - వినతులను తనిఖీ చేశారు. 
 
ఇంకా చాలా ఉన్నాయి.
 
His claim to fame - అతని కీర్తికారణం
His claims of pioneering the art - ఆ కళకి తానే ఆద్యుణ్ణని అతను ఆపాదించుకుంటున్న గొప్పతనం/ ఘనత
 
ఒకవేళ మీకు ఈ సమాచారం ఉపయోగకరం కాదనిపిస్తే మన్నించగలరు.
 
 --
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

రమణ / Ramana

unread,
Jun 28, 2009, 1:55:32 PM6/28/09
to telug...@googlegroups.com
తాడేపల్లిగారు,
 
వెంఠనే సమాధనిమిచ్చినందుకు కృతజ్ఞతలు. మీ జవాబు వల్ల కొంత స్పష్టత కలిగింది. ఈ సందేహం కలగగానే మొదట మీ బ్లాగ్ లోనే సమాధనం దొరకుకుందేమోనని వెతికాను. మీ పాత టెంప్లెట్లో కొన్ని ఇంగ్లీషు పదాలు వాటి తెలుగు వున్న gadget ఒకటి వుండేది కదా :-)
Thanks


 
2009/6/28 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>



--
రమణ
http://swagathaalu.blogspot.com

amaranarayana beeda

unread,
Jun 28, 2009, 6:25:56 PM6/28/09
to telug...@googlegroups.com
రమణగారు ఈ పదానికి సరైన పదం వ్యక్తీకరణ అంటే తనకు కలిగిన ఇబ్బందిని , లేదా సంతోషాన్ని , ఇలా ఏదైనా కావచ్చు.ఇతరులకు తెలియజేయడం లేదా విన్నవించడం ,

2009/6/28 రమణ / Ramana <ram...@gmail.com>

Kumar

unread,
Jun 29, 2009, 2:55:47 AM6/29/09
to telug...@googlegroups.com

వ్యక్తీకరణ అనేది సంస్కృత root. తెలుగు లో 'చెప్పుకోవడం' అని అనుకోవచ్చు.
 
విజయం తనదేనని చెప్పుకున్నాడు.
లేనిది ఉన్నట్టు (false claim) చెప్పుకున్నాడు.
Verified the claim - తాడేపల్లి గారు అన్నట్టు చాలా కష్టమైన వాడుక. నిజ నిర్ధారణ చేయడం అని అనుకోవచ్చు.
 
ఏది ఏమైనా ఇలాంటి చర్చలు అన్దరినీ ఆలోచింప జేస్తాయి :)
 
కుమార్
 
 
 
 

 
2009/6/29 amaranarayana beeda <ama...@gmail.com>

kranthi kumar

unread,
Jun 29, 2009, 2:56:03 AM6/29/09
to telug...@googlegroups.com
మంజూరు చేసుకొనుట అనుకుంట

2009/6/29 amaranarayana beeda <ama...@gmail.com>

sudhakar valluri

unread,
Jun 30, 2009, 1:23:06 PM6/30/09
to telug...@googlegroups.com
ఈ చర్చని మనం 'తెలుగు పదం' గుంపులో కొనసాగిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.



2009/6/28 రమణ / Ramana <ram...@gmail.com>

ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేసేప్పుడు claimకి తెలుగులో ఏమనాలో ఎవరైనా చెప్పగలరా?
ఉదాహరణకి ఈ సందర్భాలలో
Claim victory
False claim
Verfied the claims లాంటివి. వాజ్యం, వాదం అన్నపదాలు కొన్ని సందర్భాలలో సరిపోయినట్టనిపిస్తున్న సమానర్ధకంగా అనిపించడం లేదు.
 
తాడేపల్లిగారు,
Your response would be highly appreciated.
 
Thanks
Ramana
 


--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

రమణ / Ramana

unread,
Jul 1, 2009, 12:07:24 PM7/1/09
to telug...@googlegroups.com
Thanks. Will do, what is the group url?
 
Thanks
Ramana

2009/6/30 sudhakar valluri <vsk...@gmail.com>



--
రమణ
http://swagathaalu.blogspot.com

Katta Girija Ramana

unread,
Jul 7, 2009, 9:06:13 AM7/7/09
to telug...@googlegroups.com
అవసరం మేరకు భాషను వాడడం జరుగుతుంది. ఒక్కో పదానికి అర్థం వెదకడం కాదు. మొత్తంగా వాక్యాన్ని అనువాదాం అదీ భావానువాదం చెయ్యాలి. అంతే గాని ఇలా ఒక్కో పదం పట్టుకొని అనువాదం చేస్తే ప్రమాదాలు జరుగుతాయి.  ఒక్కో పదాన్ని రచయిత తన సామర్థ్యంతో మరో కొత్త అర్థం వచ్చే విధంగా వాడుతాడు. కనుక వాక్యాలలో పదాలకు అర్థం అడగండి. ఇలా పాదాలకు అర్థం అడిగితే చెప్పడం కష్టమే సుమా ! మీ ప్రయత్నం అభినందనీయం. ఇంట మందిని కదిలించినారు.

2009/7/1 రమణ / Ramana <ram...@gmail.com>



--
మీ కట్టా గిరిజా రమణ
Reply all
Reply to author
Forward
0 new messages