నీరుడు జరిగిన బుక్ ఎగ్జిబిషన్ నందు e-తెలుగు వారి ఆధ్వర్యంలో మరియు తోటి
తెలుగు బ్లాగర్ల సహకారంతో నడిచిన స్టాల్ ని మీరందరూ విచ్చేసి ఆ
కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు అందరికీ e-తెలుగు వారి తరుఫున
ధన్యవాదములు. మరి రాబోయే బుక్ ఎగ్జిబిషన్ నందు ఒక స్టాల్ నిర్వహిస్తే
ఎంతమంది సహకరిస్తారో అన్న తలంపుతో ఉద్బవించినదే ఈ జాబు.
ఇక అసలు విషయానికి వస్తే, ఔత్సాహికులు ఎంతమంది పాల్గొనడానికి సిద్దంగా
ఉన్నారో తెలియజేయ ప్రార్దన. ఈ కమిటీలో సభ్యులు కావలసిన వారు e-తెలుగులో
సభ్యత్వం తీసుకోవాలన్న నియమం ఏమీ లేదు. కావున అందరూ అర్హులే. ఇది
రాజుగారి ఇంట్లో పెళ్ళి కావున తెలుగు పాలు పోయ్యాల్సిందిగా
విన్నవించుకుంటున్నాము. అందరూ పాలు పోస్తున్నారుగా నా గ్లాసు లీళ్ళతో
చేరుకున్న పాలేమీ పలుచనపోవు అని అనుకోకుండా అందరూ తృణమో.. ఫలమో.. చేతి
సాయమో.. నోటి సాయమో.. లేక మరేదైనా వేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం
చెయ్యాల్సిందిగా కోరుకుంటున్నాను.
మీ మీ అభిప్రాయాలు.. సలహాలు.. సూచనలూ.. నిందలు.. అపవాదులు.. వగైరా
వగైరా.. ఏవైనా నేను స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను అని సవినయంగా
తెలియజేసుకుంటున్నాను. దయచేసి చదివిన ప్రతి ఒక్కరూ స్పందించ ప్రార్దన.
ఇట్లు,
భవదీయుడు,
చక్రవర్తి
e-తెలుగు కోశాధికారి
౯౪౪ ౧౪ ౧౮ ౧౩౯ (తెలుగులో చరవాణి సంఖ్య)
944 14 18 139
నా మైల్ ఐడీ varthy [at] gmail [dot] com
తక్షణమే స్పందించినందులకు నెనరులు
On Nov 10, 2:21 pm, Praveen Kumar NANDAGIRI <pravynan...@gmail.com>
wrote:
> To read many telugu blogs:http://koodali.org (or)http://jalleda.com
ఏదో అడపా దడపా ఇలా బ్లాగ్దర్శనం చేయుచుందును. కాన ఈ విషయాలు సంపూర్ణంగా
తెలియనేరను.
ఈ పుస్తక ప్రదర్సన ఏమిటి? ఉడత సాయం, బుడత సాయం - నిఝంగా తెలియకే - అననేమో
చెప్పగలరా? (చెప్పమని మనవి.)
మాకు అందుబాటులో ఉన్నట్లుగా స్పందించడానికి సిద్ధము.
మితృడు,
సతీష్.
> > తెలుగులో రాయడానికి (To write in telugu):http://lekhini.org- Hide quoted text -
>
> - Show quoted text -
ఉండాలి .. ఉండాలి .. అందరూ బాగుండాలి.
ముందుకా సముఖత చూపినందులకు ధన్యవాదములు. e-తెలుగు సభ్యత్వ విషయమై నన్ను
విడిగా సంప్రదించగలరు. e-తెలుగు సభ్యత్వ అర్హతల విషయంలో ఒక్కటే నిబంధన.
తెలుగుపై ఆశక్తి కలిగి ఉండటమే. ఆశక్తి ఉన్వాళ్ళు తమ తమ శక్తి పరంగా
తెలుగుకి సేవ చెయ్యడమే మా e-తెలుగు లక్ష్యం.
అంతర్జాలంలో తెలుగు కనబడాలి మఱియు వ్రాయబడాలి. అందుకు ఉన్న అవరోధాలేమైనా
సరె వాటిల్ని అధిగమించడంలో మా వంతు కృషి మేము చేయ్యడానికి సిద్దంగా
ఉన్నాము అలాగే చేసేవారికి మేము అండగా ఉన్నాము . మరి మీరు ఈ విషయంలో
అర్హులైతే e-తెలుగు లో సభ్యత్వం పొందటానికి అర్హులే.
స్పందించి ఉత్సూహాన్ని చూపినందులకు ధన్యవాదములు. ఇక అసలు విషయానికి
వస్తే.. పైన చెప్పినట్లుగా ఈ సంవత్సరం జరిగే భాగ్యనగర్ పుస్తక ప్రదర్శనలో
eతెలుగు స్టాల్ కనుక పెట్టి తెలుగు ని ప్రోత్సాహిస్తే, మీరు ఏవిధంగా
సహకరిస్తారు అని నేను సభా ముఖంగా అడిగాను. అందుకు మీకు కలిగిన లేదా తోసిన
సాయం చెయ్యొచ్చని మనవి.
మరిన్ని వివరాలు అవసరం అయితే నా చరవాణి యందు సంప్రదించండి.
> > > తెలుగులో రాయడానికి (To write in telugu):http://lekhini.org-Hide quoted text -
ఉండాలి .. ఉండాలి .. అందరూ బాగుండాలి.
సరిదిద్దినందులకు నెనరులు. అలాగే శక్తి కూడా ముఖ్యమే. కాబట్టి ఆసక్తి
ఉన్నవారు తమ తమ శక్తికి తగ్గట్టుగా సాయపడతారన్నది నా అభిమతం. ఇక ముందు
జాగ్రత్త పడతాను.
On Nov 12, 2:26 pm, తాడేపల్లి T.L. Bala Subrahmanyam
<subtadepa...@gmail.com> wrote:
> ఆశక్తి = ఆ 'శక్తి'
> ఆసక్తి = interest
>
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly
> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com
On Nov 13, 7:13 pm, sravan kumar <srava...@gmail.com> wrote:
> కృతజ్ఞతలు