--బహిరంగంగా గానీ, ఆంతరంగికంగా గానీ, తెలుగులో గానీ వేఱే ఇంకేదైనా భాషలో
గానీ, ప్రభుత్వ సంస్థలో గానీ, ప్రైవేట్ సంస్థలో గానీ, స్వచ్ఛందసంస్థలో
గానీ, స్వదేశీసంస్థ ఆవరణలో గానీ, విదేశీసంస్థ ఆవరణలో గానీ, ఇంట్లో గానీ,
బయట గానీ, సమావేశాల్లో గానీ, వ్యక్తిగతసంభాషణలో గానీ, ఇంగ్లీషు మీడియమ్
విద్యాసంస్థలో గానీ, తదితర మీడియమ్ కి చెందిన విద్యాసంస్థలో గానీ-
--అవమానించడం, దూషించడం, నిర్మాణాత్మక సూచనలేవీ లేకుండా కేవలం
ద్వేషబుద్ధితో విమర్శించడం, కించపఱచడం, అపహాస్యం చేయడం, అన్యాపదేశంగా
ఛలోక్తులు విసరడం, ఇతరులతో గానీ, ఇతరదేశాలతో గానీ, ఇతరభాషలకి చెందిన
విషయాలతో గానీ, పోల్చి హీనపఱచడం.
--వాఙ్మూలకంగా గానీ, లిఖితపూర్వకంగా గానీ, తెలుగులో మాట్లాడొద్దని,
రాయొద్దని, చదవొద్దని, తెలుగు నేర్చుకోవద్దని తెలుగులో ఉన్న పుస్తకాల్నీ,
తదితర పఠనసామగ్రిని ఉపయోగించరాదని సలహా ఇవ్వడం, శాసించడం, లేదా తెలుగులో
మాట్లాడిన లేదా వ్రాసిన, లేదా చదివిన ప్రాతిపదికపై ఇతరుల్ని అవమానించడం,
ఆ ప్రాతిపదికపై ఉద్యోగాన్ని గానీ బహుమతిని గానీ తదితర న్యాయమైన మానవీయమైన
లాభాల్ని గానీ ఇవ్వడానికి నిరాకరించడం, ఆ ప్రాతిపదికపై దూషించడం,
విమర్శించడం కించపఱచడం, అపహాస్యం చేయడం, ఛలోక్తులు విసరడం, ఇతరులతో
పోల్చి హీనపఱచడం
--ఈ పనులకి సూచకంగా చేష్టలు చేయడం, లేదా బొమ్మలు వేయడం, రాతలు రాయడం, ఈ
పనుల కోసం దృశ్యశ్రవణ కార్యక్రమాల్ని రూపొందించడం, సినిమాలు తీయడం,
సినిమాల్లో ఈ పనుల నిమిత్తం దృశ్యాల్నీ, ఘట్టాల్నీ ప్రవేశపెట్టడం, ఈ పనుల
కోసం వెబ్ సైట్లని ఉపయోగించడం, ఈ పనుల కోసం పబ్లిక్ ప్రైవేట్ ఆస్తుల్ని
దుర్వినియోగపఱచడం.
--తెలుగుభాషకీ, సాహిత్యానికీ, జాతికీ, భూమికీ, చరిత్రకీ ముఖ్యమైన
విషయాలపై భౌతిక దాడులకి పాల్పడ్డం, దాడిచేయడం, పూర్తిగా గానీ, పాక్షికంగా
గానీ ధ్వంసం చేయడం
--పైన పేర్కొన్న నేరాలు చెయ్యమని ప్రోత్సహించడం, వాటికి సహకరించడం,
సహాయసామగ్రిని సమకూర్చడం, సమర్థించడం, పై నేరాలు తమ సమక్షంలో
జఱుగుతున్నప్పుడు మౌనంగా గానీ, వాఙ్మూలకంగా గానీ, లిఖితపూర్వకంగా గానీ
ఆమోదించడం
ఇలాంటివి చేసిట్లు నిస్సంశయంగా ఋజువైతే ఆ నేరస్థులకి నేరతీవ్రతని బట్టి
ఆఱునెలల నుంచి అయిదేళ్ళ వఱకు కఠిన కారాగారశిక్ష విధించాలి. ఆ తరువాత కూడా
ఇలాంటి పనుల్లో పాల్గొంటున్నట్లు ఋజువైతే వారిని చెఱసాలే కాకుండా
పదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకీ,
వ్యాపార లైసెన్సులకీ, పారిశ్రామిక లైసెన్సులకీ, రేషన్ కార్డులకీ,
డ్రైవింగ్ లైసెన్సులకీ అనర్హుల్ని చేయాలి.
తెలుగు తల్లి గర్భ శోకం
Wednesday, 28 October, 2009 9:31 PM
From:
"polimetla.com" <bpoli...@gmail.com>
To:
"తెలుగుబ్లాగు" <telug...@googlegroups.com>
నమస్తే,
నలుగురితో పంచుకుంటే బాధ తగ్గుతుందని ఈ గుంపుకి పంపిస్తున్నాను.
తెలుగు తల్లికి జరిగిన అవమానానికి కన్నీటి ధార.
తెలుగు తల్లి గర్భ శోకం
http://polimetla.com/telugu-poetry/telugu_talli_garbha_sokam/
ధన్యవాదములు,
భవాని పోలిమెట్ల
On Oct 29, 3:25 am, svaram <seshumiyapu...@yahoo.co.in> wrote:
> * ఇటీవల జరిగిన ఒక దుర్ఘటనకి సంబంధించి ఒక కవితలాంటి
> ఆవేదన ఇక్కడ తెలుగుబ్లాగు గుంపుకి వస్తే నేను ఆమోదించలేదు
> __________________________________________
>
> తెలుగు తల్లి గర్భ శోకం
> Wednesday, 28 October, 2009 9:31 PM
> From:
> "polimetla.com" <bpolime...@gmail.com>
తెలుగును అభిమానించే వాళ్ళందరికీ నాదొక సూచన - తెలుగులో వ్రాయడం, తెలుగులోనే మాట్లాడడం, తెలుగు వాడకాన్ని మరింత పెంచడం మన ముందున్న ప్రధాన కర్తవ్యం. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఐతే అంతర్జాలాన్ని దానికి చర్చా వేదికగా ఉపయోగించడం కంటే తెలుగును సుసంపన్నం చేయడానికి ఉపయోగించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎలాగంటే తెలుగులోని పదాలనూ సేకరించి ఒక చోట చేర్చి గ్రంధస్థం చేయాలి. ఇందులో ఉండాల్సిన పదాలు : (1)ఇతర భాషలనుండి తెలుగులోకి వచ్చి చేరిన పదాలను, (2)ఒకే పదానికి వివిధ మాండలికాల్లో ఉపయోగించే పదాలను, (3)వ్యాకరణ సంబంధ పదాలను - అంటే పర్యాయ పదాలు, నానార్ధాలు, జాతీయాలు, నానార్ధాలు వగైరా (4)మరచిపోయిన పదాలు, (5)పాతబడిపోయి వాడడం మానేసిన పదాలు, (6)కొత్తగా భాషలోకి వచ్చి చేరిన వ్యావహారిక పదాలు -- ఇలా వివిధ శాఖల్లో (కేటగిరీల్లో) సేకరించి గ్రంధస్థం చేయలి. అంటే ఒక అధునాతన నిఘంటువును తయారు చేయాలన్న మాట. ఇలాటివి చేయాలంటె ఎంతో శ్రమ పడాలి, ఎందరో కష్టపడాలి. ఇలాంటి కార్యక్రమం నిజానికి ప్రభుత్వాలే చెయ్యగలుగుతాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వాలు వాటి ఉనికిని కాపాడుకోవడానికే చాలా కష్టపడుతున్నాయి. అందుకని భావ సారూప్యం కలిగిన వాళ్ళంతా కలిసి సమిష్టిగా కలిస్తేనే ఇది సాధ్యపడుతుంది. ఇందుకు అంతర్జాలాన్ని చాలా ప్రభావవంతంగా ఉపయోగించుకోవచ్చని నా భావన.