ప్రపంచ జనాభాలో తెలుగు వారి శాతం

13 views
Skip to first unread message

The Achievers

unread,
Nov 10, 2009, 7:00:51 AM11/10/09
to telug...@googlegroups.com
తెలుగు భాష గణాంకాలు
1997 ప్రకారం గణాంకాల ప్రకారం ఉల్ఫ్‌రామ్‌ఆల్ఫావారిచ్చిన వివరాలు ఇక్కడ:
http://www.wolframalpha.com/input/?i=Telugu




Telugu Statistics.jpg

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 10, 2009, 7:10:40 AM11/10/09
to telug...@googlegroups.com
ఇవి శుద్ధతప్పులు నమ్మదగిన గణాంకాలు కావు. అప్పటికి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రజనాభాని తెలుగువాళ్ళ జనాభాగా చూపిస్తున్నాయి ఇవి. తమిళనాడులో తెలుగువాళ్ళమని చెప్పుకున్న రెండుకోట్ల జనాభాని, మహారాష్ట్ర, ఒరిస్సా,  కర్ణాటకలలోని తెలుగు జనాభాని ఇవి లెక్కలోకి తీసుకోవడంలేదు.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

bujji

unread,
Nov 11, 2009, 6:45:33 AM11/11/09
to తెలుగుబ్లాగు
ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగువారి సంఖ్య మాత్రమే ఇది చూపిస్తున్నట్లుగా
అనిపిస్తోంది. ఇతరదేశాల్లో,ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి సంఖ్య
విషయమేమిటి? నాకు తెలిసినంతవరకు,ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి సంఖ్య
పదహారు కోట్లకన్నా ఎక్కువే. కానీ,ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే,వీరిలో
తెలుగు బాగా మాట్లాడగలిగేవారు దాదాపు పదునాల్గుకోట్లు మాత్రమే!

kv ramana

unread,
Nov 12, 2009, 9:35:10 AM11/12/09
to telug...@googlegroups.com
హిందీ తరవాత తెలుగు మాట్లాడే జనాభా దేశంలో ఉందని అందరూ అంటున్నారు.  ఇది ఎప్పటి గణాంకాల ప్రకారం? ౨౦౦౧? ౧౯౯౧లొ బెంగాలి కిందనే తెలుగు వున్నాది. ఉల్ఫ్‌రామ్‌ఆల్ఫావారిచ్చిన వివరాలు కూడా ఏమీ నెరవుగా లేవు.

2009/11/11 bujji <supremema...@gmail.com>

గోపాల్(Gopal Koduri)

unread,
Nov 12, 2009, 10:02:24 AM11/12/09
to telug...@googlegroups.com
దశావతారం సినిమా వచ్చినప్పటి సమయం లోవి :D 
అంటే నా ఉద్దేశ్యం, సినిమా లో అంత దీమాగా ఆ డైలాగ్ పెట్టారూ అంటే, నిజం ఉండాల్సిందే కదా? :)
--
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in


12 నవంబర్ 2009 3:35 pm న, kv ramana <kvje...@gmail.com> ఇలా రాసారు :

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 12, 2009, 12:45:50 PM11/12/09
to telug...@googlegroups.com
బెంగాలీల జనసంఖ్య తెలుగువారి జనసంఖ్య కంటే చాలా ఎక్కువే అయినా అందులో ఒక పెద్దభాగం మనకి పరాయిదేశమైన బాంగ్లాదేశ్ లో నివసిస్తున్నది. కనుక The Indian Union అనే ఆధికారిక నామం గల భారతదేశంలో హిందీ తరువాత తెలుగే అధిక సంఖ్యాకుల భాష అనేది సాంకేతికంగా (technically) వాస్తవమే.

kv ramana

unread,
Nov 13, 2009, 1:49:50 AM11/13/09
to telug...@googlegroups.com
బెంగాలీల జనసంఖ్య దేశంలోనే 7.౩ కోట్లు  - తెలుగు వాళ్ళ కంటే ఎక్కువని లెక్కలు చూపిస్తున్నాయి.  ప్రపంచ స్థాయిలో చూస్తె బెంగాలీలు రమారమి ఇరవై కోట్లు. 
హిందీ తరవాత మనమే ఉన్నాం అనటానికి 2001 గణాంకా లేమైనా సమర్థిస్తున్నాయా? 

Sirish Kumar Tummala

unread,
Nov 13, 2009, 2:10:41 AM11/13/09
to telug...@googlegroups.com
తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సాల్లోని తెలుగువాళ్ళను లెక్కలోకి తీసుకున్నారా?


- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/11/13 kv ramana <kvje...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 13, 2009, 4:30:47 AM11/13/09
to telug...@googlegroups.com
2001 నాటి జనాభాలెక్కల ప్రకారం వట్టి ఆంధ్రప్రదేశ్ జనాభానే 7.6 కోట్లకి పైన ఉంది.
Message has been deleted

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 13, 2009, 7:51:27 AM11/13/09
to telug...@googlegroups.com
బెంగాలీ సంగతేమో కానీ తెలుక్కి సంబంధించి వీటన్నింటిలోను సర్వసామాన్యంగా ఉన్న తొఱ్ఱ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రజనాభాని తెలుగువాళ్ళ జనాభాగా చూపించడం. మళ్లీ ఆ రాష్ట్రజనాభాని కూడా అసలు లెక్కకంటే తగ్గించి చూపించడం. మిగతా రాష్ట్రాల్లో జిల్లాలకి జిల్లాలే నిండిపోయిన తెలుగువాళ్ళ సంగతేంటి ? ఉదాహరణకి - నాకు తెలిసి ఈ క్రింది నాన్-ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో తెలుగువాళ్ళు మెజారిటీ.

తమిళనాడు - ధర్మపురిజిల్లా -
(తమిళనాడు శాసనసభలో తెలుగు ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ 30 మందికి తక్కువ కాకుండా ఉంటారు. గత శాసనసభలో నైతే 40 మంది ఉన్నారు.)

కర్ణాటక - రాయచూరు, బళ్ళారి
ఒరిస్సా - కోరాపుట్, గంజామ్, బెర్హంపూర్
ఛత్తీస్‍ఘడ్ - దంతేవాడ

ఇంకా కొన్నున్నాయని వింటున్నాను.

ఇలా తప్పుడుగా సర్క్యులేట్ అవుతున్న లెక్కల్లో ఎవఱైనా అఱవ్వాళ్ళ హస్తముందా ? అని నాకో అనుమానం.

నా మటుకు నాకు వికీ నమ్మదగిన ఆకరం కాదు. అది ప్రైవేట్ సోర్సు కావడం ఒక కారణం. అదీగాక అక్కడ కొంతమంది అఱవ్వాళ్ళు చేఱి తెలుగుమీదున్న వ్యాసాల్ని తెలుక్కి వ్యతిరేకంగా ఎడిట్ చేస్తున్నారు. రెండేళ్ళక్రితమైతే కొన్ని తెలుగుమీదున్న కొన్ని వ్యాసల్ని ఏకంగా చెఱిపేశారు కూడా !

చంద్ర శేఖర వర్మ భూపతిరాజు

unread,
Nov 13, 2009, 11:47:30 AM11/13/09
to telug...@googlegroups.com
hello
more info about telugu

http://en.wikipedia.org/wiki/Telugu_language
---
Thanks & Regards
Chandra Sekhara Varma BHUPATHIRAJU
Sr.Sales Executive.
FEMTOMED INDIA Pvt. Ltd
Mobile: +91 8008470349 / 9912599221
www.femtomedindia.com
Email: varma.bhu...@femtomedindia.com
          brcs...@gmail.com

R&D Center: Life Science Incunator No.3
ICICI Knowledge Park, Genome Valley, Shameerpet, Hyderabad,
Andhra Pradesh, INDIA


Sent from Hyderabad, AP, India
Mike Ditka  - "If God had wanted man to play soccer, he wouldn't have given us arms."

2009/11/13 krishnaveni chari <krishn...@gmail.com>
http://en.wikipedia.org/wiki/Languages_of_India

2009/11/12 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

kv ramana

unread,
Nov 14, 2009, 12:07:19 AM11/14/09
to telug...@googlegroups.com
నేను ఒరిస్సా జయపురం నివాసిని. ఒరిస్సాలో తెలుగు వాళ్ళు 20 లక్షల వరకూ ఉంటారు; బెంగాలీలు ఎంతమంది ఉంటారో గాని కటకం, పురీల్లో చాలామంది ఉన్నారు. సుభాష్ చంద్ర బోస్ కతకంలో పుట్టి పెరిగాడు. బంగ్లాదేశ్ కాందిశీకులు ఐదు లక్షల మంది మల్కనగిరి జిల్లాలో ఉన్నారు. ఒక బెంగాలి ఎమ్మెల్యే ఉన్నాడు. బెంగాలీలు పశ్చిమ బెంగాల్ బయట ఈశాన్య భారతంలో ఎక్కువగానే ఉన్నారు. 2001 జనాభా లెక్కలు ఎలా వున్నాయో?

2009/11/13 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages