లినక్స్ లో పోతన తెలుగు కీ బోర్డు పరిచయం

6 views
Skip to first unread message

arjuna rao chavala

unread,
Nov 24, 2007, 12:03:45 PM11/24/07
to telug...@googlegroups.com

నమస్కారము,

పోతన తెలుగు కీబోర్డు శ్రీ తిరుమల కృష్ణ దేశికాచార్యులు సృష్టించారు.  ఇన్స్ క్రిప్ట్ లాంటి వాటిలో మంచి లక్షణాలు (ఒకే కీల సమూహానికి ఒకే అక్షరము) మరియు ఐట్రాన్స్ లేక ఆర్ టి యస్ లో మంచి లక్షణాలు ( గుణింతాలకొరకు హల్లుల తర్వాత అచ్చులు వాడటం), మరియు ఇంగ్లీషు  కీల ఉచ్ఛారణకి దగ్గరగా తెలుగు అక్షరాలు జతచేయబడి సులభంగా రెండు భాషలలో టైపు చేసుకోవటం నేర్చుకోవటానికి, వాడటానికి వీలుగా వుంటుంది. ఇది మొదట విండోస్ లో లభ్యమయ్యింది. http://www.kavya-nandanam.com/dload.htm ఇప్పుడు లినక్స్ ఉపయోగించేవారికి పరిచియంచేస్తున్నాను. దీని నమూనా, ముఖ్యమైన లక్షణాలు గల ఫైలు, లినక్సలో అమరిక కొరకు టార్ ఫైలు జతచేసాను.
 

లినక్సులో అమరిక
లినక్సులో పోతన తెలుగు కీ బోర్డు  2.0 వర్షన్  టార్ ఫైళ్ళు పంపిస్తున్నాను. మీరు ఇప్పటికే   itrans, RTS, scim-m17n తో వాడుతుంటె,  దీనిని  setup చేయడం చాలా సులభం.

te-pothana.mim దీనిని /usr/share/m17n లో కాపీ చేయండి.
te-pothana.png    దీనిని          /usr/share/m17n/icons లో కాపీ చేయండి.
ఒకసారి scim setup  నుండి telugu లో పోతన ను ఎంచుకొోండి.  అప్పుడు

మీకు  Te-పో  కనపడుతుంది. ఒక వేళ కనపడకపోతే, ఒక్కసారి logout చేసి మరల login అవ్వండి.
ఇక మీరు తెలుగులో సులువుగా టైపు చేయడానికి రెడీ.
ఈ లేఔటు గురించి మరింత సమాచారం కోసం తెలుగు వికీపీడియా పేజీ చూడండి.
పోతన (ఫాంటు). (2007, సెప్టెంబర్ 26). వికీపీడియా, ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. Retrieved 17:49, సెప్టెంబర్ 26, 2007 from http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%8B%E0%B0%A4%E0%B0%A8_%28%E0%B0%AB%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%29&oldid=188094 .
మీరు వాడి మీ అభిప్రాయాలు arjun...@googlemail.com కు తెలియచేయండి.
ఇక సెలవు
అర్జున
24 నవంబరు 2007

 

english_pothanaTE.JPG
pothanakbv2.tar
Reply all
Reply to author
Forward
0 new messages