హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం

Yametazamwa mara 16
Ruka hadi kwenye ujumbe wa kwanza ambao haujasomwa

Kiran Kumar Chava

hayajasomwa,
12 Mac 2006, 23:01:4412/03/2006
kwa telugu blog,telug...@googlegroups.com,telug...@yahoogroups.com,racch...@yahoogroups.com

హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం

హాజరైనవారు:

త్రివిక్రం
వీవెన్
నరేందర్ పారుపల్లి
శిరీష్ కుమార్ తుమ్మల
కిరణ్ కుమార్ చావా
వాసు తుమాటి
వెంకట రమణ ఉప్పల
రెడ్డప్ప


చాలా సరదాగా జరిగినది


గంటన్నర ఎలా గడచిపొయినదో తెలియలేదు

సమావేశ స్థలం కూడా చాలా బాగుంది :) ఈట్ స్ట్రీట్ హుస్సేన్ సాగర్ (నక్లెస్ రోడ్) వెంట బేంచీలు వేసి బుద్దుడినీ, నీళ్ళనూ, రంగురంగుల ప్రపంచాన్ని చూస్తూ, హైదరాబాదు బహుళ సంస్కృతినీ ఆస్వాదిస్తూ అన్నిటికన్నా ముఖ్యముగా హుస్సేన్ సాగర్ వెన్నంటి కూర్చున్నా నీరు పారిపొయ్యేంత వాసన రాలేదు

 

అందరూ అటో ఇటో సాయంత్రం ఐదు గంటలకు వచ్చినారు


మొదట పరిచయాలు :

ఊరు, పెరిగిన ఊరు, చదివిన ఊరి, ఇష్టాలు, ఆశయాలు మొదలగున్నవి

ఇది నిజంగా సరదాగా గడచినది, నిజమైన తెలుగు వాళ్ళ సమావేశంలాగా అరే మీది ఆ ఊరా? నాకు ఆ ఊరులో వారు తెలుసు, వాడు నా క్లాసుమేటు, వాడు నా జూనియరు వంటివి ఎన్నో చోటుచేసుకున్నాయి (ప్రపంచం చిన్నది కదా!)

తరువాత కోక్ :(


తరువాత తెలుగు డిజిటల్ ప్రపంచంలో అభివృద్ది జరగడానికి ఎవరి ఆలోచనలు వారు చెప్పినారు

(అన్నట్టూ చెప్పడం మర్చిపొయినాను, వీవెన్ అందరికీ ఉచితం ఫైర్ ఫాక్స్ సీ డీ లు ఇచ్చినాడు)

కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు :

1. తెలుగు వికీ లో సహాయం పేజీని ఏ ఆపరేటింగ్ సిస్టమునకు ఆ ఆపరేటింగ్ సిస్టముగా విభజించి చిన్న చిన్న పేజీలుగా చేయడం
2. దగ్గరలోని సైబర్ కేఫ్ నకు ఈ నెలలో కనీసం ఒక్కదాన్ని అయినా పూర్తి తెలుగు యూనీకోడ్ సపోర్టు చేయుదానిగా చేయడం
3. మీట్ ద వెటరన్స్ - మనకు తెలిసిన వాళ్ళకు తెలిసిన వాళ్ళను, తెలిసిన వాళ్ళను తెలిసిన గొప్పవారిని కలిసి (సిరివెన్నల, యండమూరి, వంటివారిని) మన ప్రయత్నాలను వివరించడం
4. సైబర్ కేఫ్ నందు ఉంచడానికి ఓ A4 సైజు పోష్టరు తయారు చేయడం
అదండీ సంగతి

ఇంకా చాలా చాలా జరిగినాయి, దీని తరువాత మిగిలిన వారు రెప్లైలు ఇస్తారు అని ఆశిస్తూ,
కిరణ్ కుమార్ చావా



--
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

Murali Krishna Kunapareddy

hayajasomwa,
13 Mac 2006, 05:18:3513/03/2006
kwa telug...@googlegroups.com
హాయ్‌,
 
సమావేశం మిస్సయ్యినందుకు బాధపడుతున్నాను. తప్పనిసరి మీటింగ్‌ ఒకటి అటెండ్‌ కావల్సి వచ్చింది. ఈసారి సమావేశానికి తప్పనిసరిగా వస్తాను.
 
మీ అనుభూతుల్ని వినడానికి సిద్దంగా వున్నాను.
 
మీ
మురళీకృష్ణ కూనపరెడ్డి.

 

Sudhakar

hayajasomwa,
28 Mac 2006, 13:51:3828/03/2006
kwa telugublog
మరల ఎప్పుడు మన తెలుగు
బ్లాగర్ల సమావేశం? వచ్చే
ఏప్రిల్ 16 నా ?

సుధాకర్
http://sodhana.blogspot.com
[లేఖిని తో వ్రాయబడినది]

Kiran Kumar Chava

hayajasomwa,
28 Mac 2006, 20:32:0228/03/2006
kwa telug...@googlegroups.com
Alright,
 
I agree to April 16th.
 
Any other suggestions?
 


 
On 3/29/06, Sudhakar <sudh...@gmail.com> wrote:
మరల ఎప్పుడు మన తెలుగు
బ్లాగర్ల సమావేశం? వచ్చే
ఏప్రిల్ 16 నా ?

సుధాకర్

తుమ్మల శిరీష్ కుమార్

hayajasomwa,
28 Mac 2006, 20:35:4628/03/2006
kwa telug...@googlegroups.com
నేన్రెడీ
-చదువరి

Veeven (వీవెన్)

hayajasomwa,
28 Mac 2006, 21:03:5228/03/2006
kwa telug...@googlegroups.com
నాకూ ఓకే!

Murali Krishna Kunapareddy

hayajasomwa,
29 Mac 2006, 02:04:0829/03/2006
kwa telug...@googlegroups.com
లాస్ట్‌ టైం మిస్సయ్యా కనుక ఈ సారి మిస్సయ్యే వుద్దేశ్యం లేదు. కౌంట్‌ ఆన్‌ మి.
 
మురళీకృష్ణ.

 
On 3/29/06, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:

తుమ్మల శిరీష్ కుమార్

hayajasomwa,
29 Mac 2006, 08:08:4129/03/2006
kwa telug...@googlegroups.com
కన్నడ వికీపీడీయా వాళ్ళు ఏప్రిల్ 2 న బెంగుళూరులో ఒక కాన్ఫరెన్సూ, పత్రికా సమావేశము ఏర్పాటు చేసారు. యు.ఆర్ అనంతమూర్తి ముఖ్య అతిథి. వివరాలిక్కడ చూడండి. http://kn.wikipedia.org/wiki/WP:PM

తుమ్మల శిరీష్ కుమార్

hayajasomwa,
29 Mac 2006, 08:10:2429/03/2006
kwa telug...@googlegroups.com
వికీమీడియా ఫౌండేషను దీన్ని స్పాన్సరు చేస్తోంది.

వెంకట రమణ

hayajasomwa,
29 Mac 2006, 08:58:0629/03/2006
kwa telug...@googlegroups.com
మనం ఆ స్థితికి చేరుకోవాలంటే ఇంకా కొంతకాలం వేచివుండక తప్పదనుకుంటాను. :(

--
రమణ

Veeven (వీవెన్)

hayajasomwa,
29 Mac 2006, 10:11:1829/03/2006
kwa telug...@googlegroups.com
Well, we are calling it Telugu bloggers meet. We need to be specific.
The meeting should be about wiki-related. Then we can be.
Jibu wote
Mjibu mchapishaji
Sambaza
Ujumbe 0 mpya