సమర్పిస్తున్నాం కొత్త కౢ (క్ఌ) ప్రయోగం అధికారికంగా.
విభూతి యోగము వికీమూలాల లంకె
గీతామృత తరంగిణి లంకె౩౫ వ పద్యము లో
కౢ వ్రాయడానికి సరైన పద్ధతిని చూడగలరు.
పూర్వము క్ఌ అనో క్ల్ అనో కఌ అనో వ్రాసి సరిపెట్టుకోవడం చేశాం. కానీ అవి సరైన పద్ధతులు కావు.
"ఈ కొత్త పద్ధతిలో మాకు సరిగా కనబడుటలేదు" అని మీరనవచ్చుఁ. కానీ వ్రాయాల్సిన పద్ధతి ఇదే. కాబట్టి ఇట్లా వ్రాసి పెట్టియుంచినచో, కొంత కాలానికి సవరించబడ్డ మంచి ఖతులు వచ్చినప్పుడు, వాటంతటవే సరిగా చూపడబతాయి. ఇప్పటికీ పోతనని తమ ఇష్టఖతిగా ఎన్నుకున్నవారికి, మ్యాక్ వాడుకరులకు, ఇది బాగుగానే కనబడుతుంది. మీ కోసమై బొమ్మ అతికిస్తున్నాను.
తొలి ప్రయోగం చేసిన మల్లిన నరసింహారావుగారికి అభినందనలు.
(
గూగులు శోధిస్తే దీనిని ఇంతకు ముందు వికీపీడియాలో వాడబడిందని తెలుస్తుంది, కానీ అది కేవలం చూపడానికి వాడారు కాబట్టి లెక్కలోనికి రాదు).
రాకేశ్వర
త.క - " 'కౢప్తా'నికి 'కొంత'తో యతి సరిపోదు. కి కీ కె కేలతో నే సరిపోతుంది. కాబట్టి అది క్లు అయివుండాలి" అని మీరు అభ్యంతరం చెప్పవచ్చు. వెల్.. పద్యం వ్రాసింది మేము కాదు! పుస్తకంలోనున్న పద్యాన్ని వికీమూలాలలోనికి ఎక్కించడమే మా పని. :)
2009/10/29 రాకేశ్వర రావు
<rake...@gmail.com>
గణనయంత్రాల్లో ఏయే తెలుఁగు అక్షరాలు ఇతర చిహ్నాలు వ్రాయసాధ్యమో తెలుసుకోవాలంటే ఈ లంకె చూడండి.
http://unicode.org/charts/PDF/U0C00.pdf
2009/10/29 రాకేశ్వర రావు
<rake...@gmail.com>
ఌ ౡ లు కంప్యూటర్లలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండానే కనబడుతున్నా, వాటి గుణింతాలు
కౢ కౣ
లు అంత బాగా కనబడట్లేదు. ఈ విషయం తేలడాని ఇంకా చాలా ఏండ్లు లేదా దశాబ్దాలే పట్టేడట్టుంది.
ముందు వీటిని టైపాటు చేయడం ఎలా అనేది పెద్దప్రశ్న. పద్మ, లేఖినిలలో ఌౡలకే ఆశ్రయం లేదు. ఇక వాటి గుణింతాల మాట పాణిని ఎఱుఁగు.
మీకు వీటి అవసరం ఎప్పుడైనా వస్తే వాటిని టైపు చేయడానికి విధానం ఒకటి వుంది.
ముందుగా మీకు పోతన ఫాంటు గాని వేమన ఫాంటు గాని కావాలి. ఇప్పటీ ఇవి లేని వారు వేంటనే ఇక్కడి నుండి తెచ్చుకోండి.
http://www.kavya-nandanam.com/
Notepad తెఱవండి. అందులో ఫాంటుని పోతనగా ఎంచుకోండి.
Alt నొక్కిపెట్టివుంచండి.
Numpad+ నొక్కండి
C నొక్కండి
Numpad6 నొక్కండి
Numpad2 నొక్కండి (ౡ గుణింతానికి 3 నొక్కండి)
(Numpad అనగా ప్రక్కన ప్రత్యేకంగా అంకెలు వుంటాయే మామూలు కీబోర్డలలో అక్కడ, అంతేగాని అక్షరాల పైవఱుసలో అంకెలు కాదు)
వివరాలు.
http://www.fileformat.info/tip/microsoft/enter_unicode.htm
క్ఌ బాగానే కనబడుతుంది కానీ
క్ౡ అనేది పోతన ఖతితో వక్రంగా కనబడుట (ప్రక్క అక్షరం క్రింద), వేమన ఖతితో కనబడకపోవుట చేస్తుంది.
అతికించబడ్డ బొమ్మలు చూడండి.
-
కావ్యనందనం దేశికాచారి గారికి ఎవరైనా ఈ వక్రంగా కనబడే ౡ గుణింతం గుఱించి చెబితే బాగుంటుంది. నాకు ఆయని చిరునామా తెలియదు.
మీ రాకేశ్వర (అందం బ్లాగు)