నేనైతే స్థానికీకరణ అని వాడుతున్నాను.
--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/
--
Murali Krishna Kunapareddy
"Come my friends, 'tis not too late to seek a newer world"
On Mar 20, 6:15 am, Kamesh <chitte...@gmail.com> wrote:
> On 3/20/07, తుమ్మల శిరీష్ కుమార్ <sirishtumm...@gmail.com> wrote:
>
>
>
>
>
> > వయసులో పెద్ద కాకున్నా నుడికారం గురించి రాసిన వారు చెప్పినపుడు
> > చెవినొగ్గాల్సిందే!
> > ఆధునికీకరణను కూడా ఆధునీకరణ అని రాయడం చూస్తూంటాం. ఇదీ అంతేనేమో!
> > -శిరీష్
>
> > On 3/20/07, Ramanadha Reddy Yarrapu Reddy <iamramuh...@gmail.com> wrote:
>
> > > స్ధానికం చేయడం స్థానికీకరణ.
> > > స్థానం చేయడం స్థానీకరణ అవుతుందేమోగానీ, స్థానంచేయడమనే మాటే ఎబ్బెట్టుగా
> > > ఉంది.
> > > కాబట్టి స్థానికీకరణమే సరైనదని నా ఆలోచన.
> > > ఇదే సరైనదని తేల్చేసేవాణ్ణే గానీ, పెద్దవాళ్లు తేల్చాలని మురళీకృష్ణగారి
> > > కోరికగావున మిన్నకుండిపోయాను.
> > > -- రానారె
> > >http://yarnar.blogspot.com
>
> > > On 3/19/07, Murali Krishna Kunapareddy < murali.kunapare...@gmail.com>
> > > wrote:
>
> > > > ఎక్కువగా ప్రచారంలో వున్నది స్థానికీ కరణే, స్థానీకరణ అనేది కరెక్టో కాదో
> > > > పెద్దవాళ్ళు తేల్చాలి.
>
> > > > On 3/19/07, Veeven (వీవెన్) <vee...@gmail.com > wrote:
>
> > > > > "స్థానికీకరణ" లేదా "స్థానీకరణ" లలో ఏది సరైనది?
>
> > > > > నేనైతే స్థానికీకరణ అని వాడుతున్నాను.
>
> > > > > --
> > > > > వెబ్సైట్:http://veeven.com/| బ్లాగు:http://veeven.wordpress.com/
>
> > > > > --
> > > > > Murali Krishna Kunapareddy
> > > > > "Come my friends, 'tis not too late to seek a newer world"
>
> > స్ధానికీకరణ మాత్రమే సరైనది అని నేనూ భావిస్తున్నాను. వాడుక పరంగాను, వ్యాకరణ
>
> పరంగానూ కూడా.
>
> --
> కామేష్
> అందమే ఆనందం .. ఆనందమే జీవిత మకరందం ...
>
> http://chittellas.blogspot.comhttp://kamesh.wordpress.com
> నా ఆన్లైన్ రేడియోhttp://kamesh.diinoweb.com/files/- Hide quoted text -
>
> - Show quoted text -
"ఆధినికీకరణ" కరక్టైతే కానీయండి. కానీ పక్కపక్కనే రెండు "క"కారాలు పలకడం కష్టంగా లేదూ? ఈ రెంటినీ కలిపితే ఏదైనా సంధి ఏర్పడుతుందా? "ఆధునీక్కరణ" అంటే నాలుక వడిపడకుండా శుభ్రంగా వుంటుంది కదా!
--ప్రసాద్
http://blog.charasala.com
ఔననక ఛస్తానా! :)
రానారె,
అంతంత మాటలెందుకయ్యా! కొద్దిగా చనువు చేసి అలా అన్నానంతే! ఎంత ఘాటైనా నన్నేమీ చేయదు. బండకారం తిన్నోన్ని. రానారె "ఔ" అన్నాక నేను "నో" అనడమా అని అలా అన్నానంతే!
On Mar 21, 2:08 pm, "Ramanadha Reddy Yarrapu Reddy"
<iamramuh...@gmail.com> wrote:
> :-)
అధునా అంటే ఇప్పుడు ; ఆధునికం = ఇప్పటికి సంబంధించినది
ఇప్పటికి సంబంధించినదిగా చెయ్యడం (కరణం) = ఆధునికీకరణం
అలాగే స్థానం అంటే చోటు ; ఒక చోటుకు సంబంధించినది = స్థానికం
ఒక చోటుకు సంబంధించినదిగా చెయ్యడం (కరణం) = స్థానికీకరణం
"సంబంధించిన" అనే అర్థంలో "ఇక" ప్రత్యయాన్ని అకారాంత శబ్దాలకి
చేర్చేటప్పుడు కొన్ని నియమాలు వర్తిస్తాయి. ఆ పదం యొక్క మొదటి అక్షరానికి
"వృద్ధి" వస్తుంది. వృద్ధి అంటే అకారం ఆకారంగాను, ఇ(ఈ)కారం లేదా ఏత్వం
ఐత్వంగాను, ఉ(ఊ)కారం లేదా ఓత్వం ఔత్వంగాను మారడం.
ఉదాహరణకి :
(1) మనస్ = ఉల్లము ; దానికి సంబంధించినది = మానసికమ్
(2) గిరిః = కొండ ; దానికి సంబంధించినది = గైరికమ్
(3) మూలమ్ = కుదురు ; దానికి సంబంధించినది = మౌలికమ్
విద్యుత్ భవిష్యత్ భగవత్ మొదలైన హలంత శబ్దాలకి (పొల్లుతో అంతమయ్యే
వాటికి) "ఇక" ప్రత్యయాన్ని పై పద్ధతిలో చేర్చడం అన్ని వేళలా సాధ్యపడదు.
అటువంటప్పుడు పై విధంగా "వృద్ధి" చేసి వాటి తుది హల్లుని అకారాంతంగా
మార్చాలి.
ఉదాహరణకి :
విద్యుత్ = వైద్యుతమ్ ; భవిష్యత్ = భావిష్యతం
భగవత్ = భాగవతమ్
వీటికి కరణ శబ్దాన్ని యథాతథంగా జతగూర్చవచ్చు.
ఉదా : వైద్యుత కరణమ్ (విద్యుదీకరణమ్ కాదు)
అలాగే భవిష్యత్కరణమ్ లేక భావిష్యత కరణమ్ మొii ప్రయోగార్హం.
ఇక స్థానీకరణం అని ఎందుకు అనకూడదో రాసి ముగిస్తాను.
సంస్కృతంలో "స్థానమ్" అంటే తగిన చోటు/తగిన మనిషి (a deserving place or
person) అనే అర్థం కూడా ఉంది.ఉదాహరణకి : అస్థానే దోషారోపః = ఆరోపించదగని
వ్యక్తియందు దోషములను ఆరోపించుట.
కాబట్టి స్థానీకరణం అంటే తగిన మనిషిగా మార్చడం. qualify చెయ్యడం అనే
అర్థం వస్తుంది. ఇది మన సందర్భానికి బొత్తిగా పొసగని అపార్థం.
> > --http://yarnar.blogspot.com- Hide quoted text -