అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి జరిపే కృషిలొ భాగంగా నా ఈ చిన్న సలహా -
ఇప్పటికే అంతర్జాలంలో అనేక తెలుగు సైట్లు వెలుస్తున్నాయి. ఇందులో
మనకందరికీ బహు పరిచయమైన పత్రికల సైట్లు, సినిమా, సాహిత్యం సైట్లతోపాటు
వివిధ సంస్థల సైట్లు, ప్రవాసాంధ్రుల సైట్లు, వ్యక్తిగత సైట్లు అనేకం
పుట్టుకొస్తున్నాయి. వీరితో తెలుగు బ్లాగులను/సంకలినులను ఒక లంకెగా వారి
వారి సైట్లలో ఇచ్చే వీలును చర్చించవచ్చు కదా? ముఖ్యంగా వార్తా పత్రికల
సైట్లు, సాహిత్యం/సినిమా/కలగూరగంప సైట్లు, ప్రవాసాంధ్ర సైట్లకు (తానా
వంటివి) ఇలాంటి ఏర్పాటు వుంటే బాగుంటుందని ఒక ఆలోచన.
ఈ విషయమై నా సూచనలు:
1. ఇప్పటికే ప్రాచుర్యం పొందిన తెలుగు సంకలినులు - కూడాలి, జల్లెడ, హారం
- రూపకర్తలు ఇటువంటి వారిని సంప్రదించవచ్చు. ఆయా సైట్ల అభిరుచిని
అనుసరించి - రాజకీయం, హాస్యం, సినిమా - ఇలా ఫీడ్లు తయారు చేయగలిగితే
వారికి మరింత ఆకర్షణీయంగా వుండొచ్చు.
2. ఇలాంటి సైట్లలో ఇవ్వబడిన వేగు చిరునామాలకు ఈ-తెలుగు
సంఘం/అగ్రిగేటర్లు/వ్యక్తిగతంగానైనా సంప్రదించవచ్చేమో
3. ఇలా మన బ్లాగుల/సంకలినుల లంకెలు ఇచ్చిన సైట్ల లంకెలు మన
బ్లాగులు/సంకలినులలో వుంచే ప్రస్తావన వారికి నచ్చవచ్చు.
ఢిల్లీ ప్రవాసాంధ్ర వెబ్‌సైటుకు ఇలాంటి సూచన చేస్తూ నేను ఇప్పుడే ఒక వేగు
పంపుతున్నాను.
మిత్రులు ఈ విషయమై ఇంకేమైనా సూచనలు వుంటే చర్చించగలరు.
భవదీయుడు
అరిపిరాల సత్యప్రసాద్
కొత్త ఢిల్లీ
మీ భావనతో నేను ఏకీభవిస్తున్నాను. అలాగె, మీకొక విన్నపం. eతెలుగు అనే
సంస్థ వారి ఆధ్వర్యంలో రాబోయే నెలలో భాగ్యనరం పుస్తక ప్రదర్శనలో ఓ
కార్యక్రమం జరపబోతున్నది. ఆ చర్చ ఇక్కడ కొనసాగుతున్నది.
మీ వంతు కర్తవ్యంగా మీరు కాస్త కలుగ జేసుకుని ఇలాంటి ప్రతిపాదిక ఒకటి
నడుస్తున్నది. కావున పాలు పంచుకోగలరని నా మనవి
భవదీయుడు,
చక్రవర్తి
On Nov 14, 3:15 pm, చక్రవర్తి <var...@gmail.com> wrote:
> లంకె ఇవ్వడం మరిచాను. ఇక్కడ స్పందించండి ..http://groups.google.com/group/telugublog/browse_thread/thread/f4e8d9...