ఌ ౡ లు కంప్యూటర్లలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండానే కనబడుతున్నా, వాటి గుణింతాలు
కౢ కౣ
లు అంత బాగా కనబడట్లేదు. ఈ విషయం తేలడాని ఇంకా చాలా ఏండ్లు లేదా దశాబ్దాలే పట్టేడట్టుంది.
ముందు వీటిని టైపాటు చేయడం ఎలా అనేది పెద్దప్రశ్న. పద్మ, లేఖినిలలో ఌౡలకే ఆశ్రయం లేదు. ఇక వాటి గుణింతాల మాట పాణిని ఎఱుఁగు.
మీకు వీటి అవసరం ఎప్పుడైనా వస్తే వాటిని టైపు చేయడానికి విధానం ఒకటి వుంది.
ముందుగా మీకు పోతన ఫాంటు గాని వేమన ఫాంటు గాని కావాలి. ఇప్పటీ ఇవి లేని వారు వేంటనే ఇక్కడి నుండి తెచ్చుకోండి.
http://www.kavya-nandanam.com/
Notepad తెఱవండి. అందులో ఫాంటుని పోతనగా ఎంచుకోండి.
Alt నొక్కిపెట్టివుంచండి.
Numpad+ నొక్కండి
C నొక్కండి
Numpad6 నొక్కండి
Numpad2 నొక్కండి (ౡ గుణింతానికి 3 నొక్కండి)
(Numpad అనగా ప్రక్కన ప్రత్యేకంగా అంకెలు వుంటాయే మామూలు కీబోర్డలలో అక్కడ, అంతేగాని అక్షరాల పైవఱుసలో అంకెలు కాదు)
వివరాలు.
http://www.fileformat.info/tip/microsoft/enter_unicode.htmక్ఌ బాగానే కనబడుతుంది కానీ
క్ౡ అనేది పోతన ఖతితో వక్రంగా కనబడుట (ప్రక్క అక్షరం క్రింద), వేమన ఖతితో కనబడకపోవుట చేస్తుంది.
అతికించబడ్డ బొమ్మలు చూడండి.
-
కావ్యనందనం దేశికాచారి గారికి ఎవరైనా ఈ వక్రంగా కనబడే ౡ గుణింతం గుఱించి చెబితే బాగుంటుంది. నాకు ఆయని చిరునామా తెలియదు.
మీ రాకేశ్వర (అందం బ్లాగు)